Citadel OTT Release Date: సరికొత్త సమంతను చూడడం ఖాయం.. సిటడెల్‌ స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే..

Citadel OTT Release Date: సమంత, వరుణ్‌ ధావన్ జంటగా తెరకెక్కిన వెబ్‌ సిరీస్‌ను నవంబర్ 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

Update: 2024-08-01 13:11 GMT

Citadel: సరికొత్త సమంతను చూడడం ఖాయం.. సిటడెల్‌ స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే..

Citadel OTT Release Date: అందాల తార సమంత చాలా రోజుల తర్వాత ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. గతేడాది వచ్చిన ఖుషి సినిమా తర్వాత సమంత మళ్లీ ప్రేక్షకులను పలకరించలేదు. సమంత నటించిన తాజా వెబ్‌ సిరీస్ 'సిటాడెల్‌' కోసం ప్రేక్షకుల ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఎన్నో రోజుల నుంచి ఈ వెబ్‌ సిరీస్‌కు సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే మేకర్స్‌ మాత్రం సిటాడెల్ విడుదలకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఇదిలా ఉంటే తాజాగా ఈ వెబ్‌ సిరీస్ స్ట్రీమింగ్‌కు సంబంధించి చిత్ర యూనిట్ ఎట్టకేలకు అధికారిక ప్రకటన చేసింది. సమంత, వరుణ్‌ ధావన్ జంటగా తెరకెక్కిన వెబ్‌ సిరీస్‌ను నవంబర్ 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ఈ వెబ్‌ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఇదిలా ఉంటే ఈ సిరీస్‌ను హిందీ, తెలుగుతో పాటు ఇతర అన్నీ భారతీయ భాషల్లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. హాలీవుడ్‌లో వచ్చిన సిటాడెల్‌కు ఇండియన్‌ వెర్షన్‌గా దీనిని తెరకెక్కించారు. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌ను ఫ్యామిలీ మ్యాన్‌ వెబ్‌ ‌‌‌‌‌‌ సిరీస్‌‌‌‌‌‌‌‌తో మెప్పించిన రాజ్ అండ్ డీకే తెరకెక్కించారు.

కాగా ఈ సిరీస్ భారీ బడ్జెట్‌తో భారత్‌తో పాటు సైబీరియాలో కూడా చిత్రీకరించారు. ఇక తాజాగా ఈ చిత్ర యూనిట్ ఈ సిరీస్‌కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది. పూర్తి స్థాయిలో యాక్షన్‌ ఎపిసోడ్స్‌తో పవర్‌ ప్యాక్డ్‌గా ఉందీ టీజర్‌. సమంత ఈ సిరీస్‌లో సరికొత్త మేకోవర్‌తో కనిపించబోతోంది. టీజర్‌ చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. టీజర్‌ను గమనిస్తే 1990 నేపథ్యంలో ఈ సిరీస్‌ సాగనున్నట్లు స్పష్టమవుతోంది. సమంత ఇప్పటి వరకు నటించని సరికొత్త పాత్రలో ఇందులో కనిపించనుంది. మరి ఈ సిరీస్‌తో సమంతకు ఎలాంటి ఫేమ్‌ లభిస్తుందో చూడాలి.

ఇదిలా ఉంటే సిటాడెల్‌ హాలీవుడ్ వెర్షన్‌లో నటి ప్రియాంక చోప్రా నటించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌ కోసం అమెజాన్‌ భారీ మొత్తంలో ఖర్చు చేసిందని అప్పట్లో ప్రచారం జరిగింది. మరి ఇండియన్‌ వెర్షన్‌ వెబ్‌ సిరీస్‌ ప్రేక్షకులను ఏమేర మెప్పిస్తుందో తెలియాలంటే నవంబర్‌ 7వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. అయితే అమెజాన్‌ ఈ సిరీస్‌ను పెయిడ్‌ వెర్షన్‌లో తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయన్న వార్తలు వస్తున్నాయి.

Full View
Tags:    

Similar News