Jyothika - Ponmagal Vandhal: జ్యోతిక సినిమా వల్ల వెలుగులోకి వచ్చిన దారుణం

Jyothika - Ponmagal Vandhal: సినిమాల ప్రభావం సమాజం పైన ఎంతో కొంత ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు.

Update: 2021-09-27 10:30 GMT

జ్యోతిక సినిమా వల్ల వెలుగులోకి వచ్చిన దారుణం

Jyothika - Ponmagal Vandhal: సినిమాల ప్రభావం సమాజం పైన ఎంతో కొంత ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు. కొన్నిసార్లు అది పాజిటివ్ విధంగా ఉండగా మరికొన్ని సార్లు నెగిటివ్ ఇంపాక్ట్ కలగజేస్తోంది. అయితే తాజాగా ఒక తమిళ సినిమా ఒక అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని బయటకు తీసుకు వచ్చేలా చేసింది.

అప్పటిదాక భయపడి తనకు జరిగిన అన్యాయానికి సైతం ముసుగు వేసిన ఒక బాలిక 2020లో జ్యోతిక హీరోయిన్ గా విడుదలైన "పొన్ మగల్ వందాల్" సినిమా చూసి ధైర్యం చేసి తనకు జరిగిన అన్యాయాన్ని బట్టబయలు చేసింది. తమిళనాడులోని 9 ఏళ్ల బాలిక తన బంధువైన 48 ఏళ్ల వ్యక్తి తనని రేప్ చేశాడని కుటుంబ సభ్యులకు తెలియజేసింది.

దీంతో ఆ బాలిక కుటుంబ సభ్యులు కేసు నమోదు చేయగా మద్రాస్ హైకోర్టు ఆ నీచుడికి ఐదేళ్లపాటు జైలు శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో జ్యోతిక సోషల్ మీడియా ద్వారా, "సైలెన్స్ ని బ్రేక్ చేయండి. ఒక ఆడపిల్ల తనకోసం తాను నిలబడినప్పుడు ప్రపంచంలో ఉన్న అందరి ఆడవాళ్ళ కోసం నిలబడినట్టే" అని అన్నారు. జేజే ఫ్రెడరిక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని సూర్య నిర్మించారు. ఈ సినిమా సమాజంలోని చీకటి కోణాల్ని బయటకు తీసుకు వచ్చింది.

Tags:    

Similar News