Hema: భక్తితో వచ్చా.. కాంట్రవర్సీ కోసం కాదు..
Hema: నటి హేమ విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గమ్మను సోమవారం సాయంత్రం దర్శించుకున్నారు.
Hema: నటి హేమ విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గమ్మను సోమవారం సాయంత్రం దర్శించుకున్నారు. శరన్నవరాత్రి వేడుకల సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న ఆమె ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతున్న సమయంలో ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నలకు ఫైర్ అయ్యింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'అందరికి నమస్కారం. నేను మీ హేమను. అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సంవత్సరం ప్రోటోకాల్ ఇబ్బంది అని, చాలా మంది జనాలు పోటేత్తి వస్తున్నారన్నారు. దీంతో ఈ ఏడాది రాలేనేమో అనుకున్నా. కానీ, అమ్మవారే ఈ రోజు నన్ను ఇక్కడికి రప్పించారు. ఇక్కడ దర్శనం చేసుకున్న భక్తులు చాలా పుణ్యం చేసుకున్నారు. మీ అందరికి కొండంత ధైర్యం ఇవ్వమని అమ్మవారిని కోరుకున్నాను' అన్నారు.
అనంతరం మీడియా పాయింట్ నుంచి ఆమె బయలుదేరుతుండగా ఓ విలేకరి.. ''మేడమ్ మీరు ఎంతమంది వచ్చారు? ఏ టిక్కెట్ కొనుగోలు చేశారు?'' అని ప్రశ్నించాడు. విలేకరి ప్రశ్నతో హేమ ఒకింత అసహనానికి గురయ్యారు. ''మేము ఇద్దరం వచ్చాం. ప్రొటోకాల్ ప్రకారమే టిక్కెట్ కొనుగోలు చేసి... అమ్మవారి దర్శనం చేసుకున్నాం. నేను గుడిలో రూ.10 వేలు కానుకగా ఇచ్చాను. రూ.20 వేలు పెట్టి చీర కొని అమ్మవారికి సమర్పించాను. ఎందుకు వివాదాన్ని సృష్టిస్తున్నారు '' అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.