Kalki 2: కల్కి షూటింగ్ వార్తలపై స్పందించిన దీపికా.. ఆ వార్తల్లో నిజం లేదంటూ..

Kalki 2: ప్రభాస్‌ హీరోగా, నాగ అశ్విన్‌ దర్శకత్వంలో వచ్చిన 'కల్కి 2898 ఏడీ' ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Update: 2024-12-31 05:25 GMT

Kalki 2: కల్కి షూటింగ్ వార్తలపై స్పందించిన దీపికా.. ఆ వార్తల్లో నిజం లేదంటూ..

Kalki 2: ప్రభాస్‌ హీరోగా, నాగ అశ్విన్‌ దర్శకత్వంలో వచ్చిన 'కల్కి 2898 ఏడీ' ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భవిష్యత్తులో భూమి ఎలా మారుతుంది.? ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. లాంటి అంశాలను నాగ అశ్విన్‌ అద్భుతంగా చూపించాడు. ఇక పురాతన ఇతిహాసాలను, ఆధునిక జీవితాన్ని మిక్స్‌ చేస్తూ నాగ అశ్విన్‌ సృష్టించిన కాల్పనిక కథ ప్రేక్షకులను కొత్త లోకానికి తీసుకెళ్లింది.

ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సీక్వెల్‌ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. అసలు కథ సీక్వెల్‌లోనే ఉండనుందని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కల్కి సీక్వెల్ ఎప్పుడు మొదలువుతుందని మేకర్స్‌ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. కల్కి సీక్వెల్ షూటింగ్ త్వరలోనే మొదలు కానుందని, దీపికాతోనే చిత్రీకరణ ప్రారంభంకానుందని ఓ వార్త బాలీవుడ్‌ మీడియాలో బాగా వైరల్‌ అయ్యింది.

అయితే ఈ వార్తలపై దీపికా తాజాగా స్పందించింది. కల్కి షూటింగ్ త్వరలోనే ప్రారంభంకానుందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని దీపికా క్లారిటీ ఇచ్చింది. “కల్కి’ షూటింగ్‌ త్వరలో మొదలుకానున్నదని వినిపిస్తున్న మాటలో నిజంలేదని తేల్చి చెప్పింది. కల్కి షూటింగ్‌కు సంబంధించి ఎలాంటి సమాచారం లేదని తేల్చి చెప్పింది. అయినా కూడా ప్రస్తుతం తన ఆలోచనలన్నీ నా కుమార్తె ‘దువా’ పైనే ఉన్నాయని చెప్పుకొచ్చింది.

ఈ విషయమై దీపికా మాట్లాడుతూ.. 'మా అమ్మ నన్ను ఎలా అయితే పెంచిందో.. అదే విధంగా నా కూతుర్ని నేను పెంచాలి. తన ప్రతి క్షణాన్నీ నేను ఆశ్వాదించాలి' అంటూ చెప్పుకొచ్చింది. కాగా కల్కి సీక్వెల్‌ ప్రోగ్రెస్‌ గురించి ఇటీవలే ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరైన స్వప్నదత్‌ మీడియాతో మాట్లాడారు. ‘ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతున్నది. తొలిపార్ట్‌తో పాటే సెకండ్‌ పార్ట్‌ షూటింగ్‌ కూడా 35శాతం పూర్తయింది. ఇందులో కూడా దీపిక పదుకోన్‌ కొన్ని సన్నివేశాల్లో అమ్మగా కనిపిస్తారు. రెగ్యులర్‌ షూటింగ్‌ ఎప్పటినుంచి ప్రారంభించాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.’ అని చెప్పుకొచ్చారు. 

Tags:    

Similar News