Ameesha Patel: 49 ఏళ్ల వయసులో ప్రేమలో పడ్డ హీరోయిన్‌.. 30 ఏళ్ల కుర్రాడితో ప్రేమాయణం

Ameesha Patel: బద్రి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది బాలీవుడ్ బ్యూటీ అమిషా పటేల్‌.

Update: 2024-11-16 08:56 GMT

Ameesha Patel: 49 ఏళ్ల వయసులో ప్రేమలో పడ్డ హీరోయిన్‌.. 30 ఏళ్ల కుర్రాడితో ప్రేమాయణం

Ameesha Patel: బద్రి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది బాలీవుడ్ బ్యూటీ అమిషా పటేల్‌ (Ameesha Patel). ఈ సినిమాలో కీలక పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. అయితే ఆ తర్వాత మళ్లీ పెద్దగా తెలుగులో కనిపించలేదు ఈ బ్యూటీ. అయితే బాలకృష్ణ సరసన ఒకటి రెండు చిత్రాల్లో నటించింది అంతే.

ఎక్కువ శాతం బాలీవుడ్‌లోనే నటించిన అమిషా ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది. అయితే సినిమాలకు దూరం ఉంటున్న అమిషా వ్యక్తిగత జీవితం విషయంలో మాత్రం నిత్యం వార్తల్లో నిలుస్తుంటుంది. ముఖ్యంగ డేటింగ్‌ల విషయంలో అమిషా వార్తల్లో నిలుస్తుంటారు. ఇప్పటి వరకు పెళ్లి చేసుకొని అమిషా ఒంటరిగానే ఉంటుంది.

అయితే గతంలో పలువురితో డేటింగ్‌లో ఉందంటూ వార్తలు వచ్చాయి. చివరిగా దర్శకుడు విక్రమ్‌భట్‌తో అమిషా ప్రేమలో ఉందంటూ వార్తలు వచ్చాయి. నిజానికి వీరిద్దరు కలిసి ఉన్న ఫొటోలు కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. అయితే సుమారు 5 ఏళ్లు కలిసున్న వీరిద్దరూ మనస్పర్థాలతో విడిపోయారు. అయితే అతడిని ప్రేమించడం తన జీవితంలో చేసిన పెద్ద తప్పు అని అమిషా అప్పట్లో వ్యాఖ్యానించింది.

ఇదిలా ఉంటే ఉంటే ఇప్పుడు అమిషా మళ్లీ ప్రేమలో పడ్డారు. 49 ఏళ్ల ఈ బ్యూటీ ఓ కుర్రాడితో డేటింగ్‌ చేస్తోంది. ఈ విషాయన్నా తనే స్వయంగా ప్రకటించారు. వ్యాపారవేత్త నిర్వాన్ బిర్లా (Nirvaan Birla) తో ఒక ప్రైవేట్ ఫోటోను పోస్ట్ చేసింది. “నా డార్లింగ్‌తో శుభ సాయంత్రం…” అంటూ తన ప్రియుడితో ఉన్న ఫోటోస్ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. నిర్వాణ బిర్లా విషయానికొస్తే.. అతను బిర్లా బ్రెనియాక్స్, బిర్లా ఓపెన్ మైండ్స్ వ్యవస్థాపకుడి పేరు ఉంది. ప్రముఖ వ్యాపారవేత్త నిర్వాణ యశోవర్ధన్ బిర్లా, అవంతి బిర్లాల కుమారుడు. మొత్తం మీద మరోసారి ప్రేమ వ్యవహారంతో అమిషా పటేల్‌ వార్తల్లోకి ఎక్కారు.


Tags:    

Similar News