Sree Vishnu Plasma Challenge: ప్లాస్మా ఛాలెంజ్ : స్ఫూర్తిని రగిలిస్తున్న యంగ్ హీరో!

Sree Vishnu Plasma Challenge: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది.. ఇక భారత్ లో అయితే లాక్ డౌన్ సడలింపులు ఇచ్చిన తర్వాత అయితే రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.

Update: 2020-07-11 08:39 GMT
Plasma Challenge,

Sree Vishnu Plasma Challenge: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది.. ఇక భారత్ లో అయితే లాక్ డౌన్ సడలింపులు ఇచ్చిన తర్వాత అయితే రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.. అయితే రికవరీ రేటు మెరుగ్గా ఉండడం కొంచం ఆశాజనకంగా కనిపిస్తుంది.. ఇక ఈ కరోనాకి వ్యాక్సిన్ ని కనిపెట్టే పనిలో నిమగ్నం అయి ఉన్నారు ప్రపంచ శాస్త్రవేత్తలు.. ఇక కొవిడ్ కి చికిత్స పొంది ఇంటికి వెళ్లిన పేషెంట్స్ తప్పనిసరిగా తమ ప్లాస్మాను ఇచ్చి సాటి మనుషుల్ని కాపాడాల్సిన బాధ్యత ఉందని చాలా మంది చెబుతున్నారు.. ప్లాస్మా డొనేషన్ కోసం ఎదురుచూస్తున్న చాలా మంది కరోనా బాధితులకు ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుందని అంటున్నారు. ఇక రెంయూ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ప్లాస్మా డొనేషన్ ని ఎంకరేజ్ చేసి చికిత్సను అందిస్తున్నాయి. దీనిపైన సినీ తారలు కూడా ప్రచారం చేస్తున్నారు. 

అందులో భాగంగానే...హీరో శ్రీవిష్ణు ప్లాస్మా దానంపై స్ఫూర్తి రగిలిస్తున్నాడు. . 'డొనేట్ ప్లాస్మా' పేరిట క్యాంపైన్‌ను మొదలుపెట్టారు. దీనిలో భాగంగా 'డొనేట్ ప్లాస్మా అండ్ సేవ్ లైఫ్' అని రాసున్న ఇమేజ్‌ను ట్విట్టర్ ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకున్నారు.. అయితే ఈ ఛాలెంజ్ ని తన కో స్టార్స్ అయిన హీరో నారా రోహిత్, హీరోయిన్ నివేదా థామస్ లకి పిలుపునిచ్చాడు శ్రీవిష్ణు.. మరి శ్రీ విష్ణును చూసి మిగతా హీరోలు కూడా ముందుకు వస్తారో లేదో అన్నది చూడాలి మరి..

ఇక దేశ వ్యాప్తంగా కరోనా కేసుల విషయానికి వచ్చేసరికి .. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 27,114 కేసులు నమోదు కాగా, 519 మంది ప్రాణాలు విడిచారు. కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో మొత్తం 8,20,916 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2,83,407 ఉండగా, 5,15,385 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 22,123 మంది కరోనా వ్యాధితో మరణించారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 2,82,511 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు దేశంలో 1,13,07,002 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు.

Tags:    

Similar News