Nagababu Respond On Nepotism : నెపోటిజం గురించి నాగబాబు ఆసక్తికర వాఖ్యలు!
Nagababu Respond On Nepotism : బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తరవాత బాలీవుడ్ ఇండస్ట్రీలో నెపోటిజం (బంధుప్రీతి) బాగా పెరిగిపోయిందని
Nagababu Respond On Nepotism : బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తరవాత బాలీవుడ్ ఇండస్ట్రీలో నెపోటిజం (బంధుప్రీతి) బాగా పెరిగిపోయిందని అంటూ పలువురు కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు ఇదే మాట అన్ని ఇండస్ట్రీలను కుదిపేస్తోంది. అయితే తాజగా దీనిపైన మెగా బ్రదర్ నాగబాబు తన యూట్యూబ్ ఛానల్ లో స్పందించారు.. ఇండస్ట్రీలో నెపోటిజం అనేది పనికిమాలిన ప్రచారం అంటూ కామెంట్స్ చేశారు నాగబాబు.. నెపోటిజం అనేది ఒక సినిమా ఇండస్ట్రీలోనే ఉందని అంటున్నారు. ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ అయితే... ఒక లాయర్ కొడుకు లాయర్ అయితే నెపోటిజం (బంధుప్రీతి) అని ఎందుకు మాట్లాడరు అంటూ వాఖ్యలు చేశారు నాగబాబు..
ఇండస్ట్రీలో వారసత్వం నుంచి వస్తే ఒక్క సినిమా లేదా రెండు సినిమాలు వరకూ వర్కౌట్ అవుతాయని మనలో టాలెంట్ ఉంటేనే ఎదుగుతామని లేదంటే జనాలు పట్టించుకోరని అంటూ నాగబాబు వాఖ్యానించారు.. తన అన్నయ్య చిరంజీవి ఏ గాడ్ ఫాదర్ లేకుండా కేవలం కష్టాన్ని నమ్ముకొని మాత్రమే ఇండస్ట్రీలోకి వచ్చారని ఇప్పుడు మెగాస్టార్ గా నిలబడ్డారని అన్నారు.. మెగా హీరోలు అందరూ కూడా కేవలం కష్టాన్ని నమ్ముకున్నారని నాగబాబు వాఖ్యానించారు..రవితేజ, విజయ్ దేవరకొండ లాంటి హీరోలు కూడా ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా టాలెంట్ కష్టాన్ని నమ్ముకొని పైకి వచ్చి స్టార్ లు గా ఎదిగారని అన్నారు నాగబాబు.. ఇండస్ట్రీలో అందరూ టాలెంట్ ఉన్నవాళ్లే ఉన్నారు. దమ్ము ఉంటేనే హీరో అవుతాడు.. అంతేకాని తీసుకొచ్చి జనంపై రుద్దితే ఎవడూ హీరో అవ్వలేదంటూ చెప్పుకొచ్చారు నాగబాబు..
ఇక చాలా మంది స్టార్ హీరోల కొడుకులు సక్సెస్ కాకుండా ఇళ్లకు వెళ్లినపోయినవారున్నారు. అటు ఇండస్ట్రీ ఏమి ధార్మిక కార్యక్రమమా కాదని అన్నారు.. పెద్ద సినిమాలు రిలీజైతే.. వాటికి కాస్తంత ఎక్కువగానే క్రేజ్ ఉంటుందని, చిన్న సినిమాలను నిర్మించే వాళ్లు పెద్ద సినిమాలు లేని సమయంలో చాలా జాగ్రత్తగా రిలీజ్ చేస్తే ఆడతాయని దానికి కేరాఫ్ కంచరపాలెం మంచి ఉదాహరణ అంటూ చెప్పుకొచ్చారు నాగబాబు..