Nagababu: రెండో పెళ్లిపై స్పందించిన నాగబాబు
Nagababu: మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో అందరికి తెలిసిందే.
Nagababu: మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో అందరికి తెలిసిందే. తన మూవీ సంబంధించిన విషయాలతోపాటు తన వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటారు. అయితే తాజాగా నాగబాబుకు ఓ అభిమాని నుంచి ఊహించని ప్రశ్నఎదురైంది. ఇన్‌స్టాగ్రామ్ లైవ్ చాట్‌లో ఫ్యాన్స్‌తో ముచ్చటిస్తున్న నాగబాబుకు ఓ అభిమాని నుంచి ఊహించని ప్రశ్న ఎదురైంది. ఆ అభిమాని అడిగిన ప్రశ్నకు నాగబాబు ఇచ్చిన ఆన్సర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకి ఆ అభిమాని ఏం అడిగారంటే.. 'సర్..మీరు మళ్లీ పెళ్లి చేసుకుంటారా అని ప్రశ్నించారు. దాంతో నాగబాబు ఈ వయసులో నాకు పెళ్లా..మీరంతా ఓకే అంటే నాకు కూడా ఓకే' అంటూ నాగబాబు సరదాగా బదులిచ్చారు.
దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లను షేర్ చేస్తూ పలువురు దీన్ని ట్రెండ్ చేస్తున్నారు. మరోవైపు రెండో పెళ్లిపై నాగబాబు చేసిన కామెంట్‌పై కొందరు నెటిజన్లు అవాక్కవుతున్నారు. 'మీరంతా ఓకే అంటే నాకు కూడా ఓకే అంటున్నారంటే..మీ మనసులోనూ రెండో పెళ్లిపై ఆలోచన ఉందా?మీరు కూడా మీ తమ్ముడు పవన్‌కల్యాణ్ బాటలోనే నడుస్తారా' ? అంటూ కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. మెగా డాటర్ నిహారికకు ఇటీవలె పెళ్లి చేసిన నాగబాబు..త్వరలోనే వరుణ్‌తేజ్‌ని సైతం ఓ ఇంటి వాడిని చేయాలని చూస్తున్నట్లు గుసగుసలు వినిపించాయి. సోషల్ మీడియాలో అభిమానులు హద్దులు దాటుతున్నారనే చెప్పాలి. స్టార్స్ సామాజిక మాధ్యమాలతో అభిమానులతో చేరువతున్నారు. అయితే కొందరూ ఆకతాయిలు మాత్రం పలు రకాల ప్రశ్నలతో వారిని ఇబ్బందులు పెడుతున్నారు.
మెగా బ్రదర్ నాగబాబు కూడా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. తెలుగులో సూపర్ హిట్ సాధించి రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్‌లో గుర్తుండిపోయ చిత్రం 'ఛత్రపతి'. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా హిందీలో వివి వినాయక్ ఈ సినిమాతో దర్శకుడిగా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమా మెగా బ్రదర్ నాగబాబు విలన్‌గా యాక్ట్ చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం.