మెగాస్టార్ కు ఆచార్య డిస్ట్రిబ్యూటర్ లేఖ.. దయచేసి ఆదుకోండి...

Acharya Distributor: ఆచార్య సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే...

Update: 2022-05-07 07:54 GMT

మెగాస్టార్ కు ఆచార్య డిస్ట్రిబ్యూటర్ లేఖ.. దయచేసి ఆదుకోండి...

Acharya Distributor: మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ డైరెక్షన్లో ఈ మధ్యనే భారీ అంచనాల మధ్య థియేటర్లలో విడుదలైన ఆచార్య సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా వల్ల డిస్ట్రిబ్యూటర్లు భారీగానే నష్టపోయారు. ఈ నేపథ్యంలో రాయచూరులో సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసి 75% నష్టం చవిచూసిన రాజగోపాల్ బజాజ్ చిరంజీవికి ఒక ఓపెన్ లెటర్ ను విడుదల చేశారు. ఆ లెటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

"సినిమా అనుకున్న స్థాయిలో ఆడక పోవడం నాకు చాలా బాధగా ఉంది. మా ప్రాంతంలో సినిమా విడుదల రైట్స్ కోసం నేను సినిమా విడుదలకు సంవత్సరం ముందే బుక్ చేసుకున్నాను. అనుకున్న అమౌంట్ ని చెల్లించాను. సినిమా బాగా ఆడుతుందని నమ్మకంతో కాకతీయ ఎగ్జిబిటర్స్ వారికి కూడా భారీ మొత్తాన్ని ప్రీమియం కింద చెల్లించాము" అని చెప్పుకొచ్చారు రాజగోపాల్. "మీ అభిమానుల నుంచి సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుందని ఆశించాను. కానీ అనుకున్న స్థాయిలో సినిమా ఆడట్లేదు. సినిమా వల్ల నేను చాలా నష్టాలకి గురయ్యాను.

కరోనా కారణంగా మాలాంటి డిస్ట్రిబ్యూటర్లు ఎంతగా నష్టపోయారు మీకు బాగా తెలుసు. ఈ సినిమా వల్ల నష్ట పోయిన మాలాంటి డిస్ట్రిబ్యూటర్లకు మీరు పరిహారం చెల్లిస్తే బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి నా అభ్యర్థన ను పరిగణించండి. ఇప్పటిదాకా కేవలం 25 శాతం మాత్రమే మాకు తిరిగి వచ్చింది. మేము ఇన్వెస్ట్ చేసిన దాంట్లో 75 శాతం నష్టపోయాం. అప్పు చేసి మరీ ఈ సినిమా కోసం ఇన్వెస్ట్ చేశాను కానీ ఇప్పుడు సినిమా వల్ల నేను భారీ అప్పుల్లో కూరుకుపోయాను" అని రాజగోపాల్ చిరంజీవికి ఓపెన్ లెటర్ ను రాశారు.



Tags:    

Similar News