Amaran OTT: 'అమరన్' ఓటీటీ డేట్‌ ఫిక్స్‌.. నెల రోజుల్లోనే..?

Amaran Movie OTT: మేజర్‌ ముకుందన్‌ వరదరాజన్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా అమరన్‌.

Update: 2024-11-07 11:15 GMT

Amaran Movie OTT

Amaran OTT: మేజర్‌ ముకుందన్‌ వరదరాజన్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా అమరన్‌. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఒక సైనికుడి జీవితంలో ఎదురైన సంఘటనను ఎంతో హార్ట్‌ టచింగా తెరకెక్కించారు. శివకార్తికేయన్‌, సాయిపల్లవి జంటగా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

ముఖ్యంగా సాయిపల్లవి అద్భుతన నటన సినిమాకు ప్లస్‌ అయ్యిందని చెప్పాలి. అలాగే అద్భుతమైన దర్శకత్వం, భావోద్వేగంతో కూడిన కథా.. కథనం, G.V ప్రకాశ్ సంగీతం సినిమాను విజయతీరాలకు చేర్చిందని చెప్పాలి. విడుదలైన అన్ని భాషల్లో ఈ సినిమాకు మంచి టాక్‌ లభించింది. దీంతో ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది.

ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీ తేదీ ఫిక్స్‌ అయినట్లు వార్తలు వస్తున్నాయి. సినిమా విడుదలకు ముందే చేసుకున్న ఒప్పందం ప్రకారం టాక్‌తో సంబంధం లేకుండా అమరన్‌ ఓటీటీలోకి వస్తోందని వార్తలు వస్తున్నాయి. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ అమరన్‌ డిజిటల్‌ హక్కులను రూ. 60 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నవంబర్‌ చివరి వారంలో ఓటీటీలో సందడి చేయనుందని తెలుస్తోంది. నెల రోజుల్లోనే ఈ సినిమా ఓటీటీలోకి రానుందని అర్థం.

ఇక అమరన్‌ సినిమా కలెక్షన్ల విషయంలో కూడా సక్సెస్‌ అయ్యిందని చెప్పాలి. ఈ చిత్రం ఇప్పటికే సుమారు రూ. 200 కోట్ల దాకా వసూలు చేసి మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భాగస్వామ్యంలో ఈ సినిమాను తెరక్కించారు. మరి థియేటర్లలో మంచి విజయాన్ని నమోదు చేసుకున్న అమరన్‌.. ఓటీటీలో ఎలాంటి వండర్స్‌ క్రియేట్ చేస్తుందో చూడాలి. 

Tags:    

Similar News