OTT Movie: మొగుడిని ముక్కలుగా నరికి కూర వండే పెళ్లాం.. ఈ దరిద్రం ఏంట్రా సామీ
OTT Movie: ఇటీవల కాలంలో ఓటీటీల్లో వెరైటీ సినిమాలు ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్ టైన్ మెంట్ అందిస్తున్నాయి.

OTT Movie: మొగుడిని ముక్కలుగా నరికి కూర వండే పెళ్లాం.. ఈ దరిద్రం ఏంట్రా సామీ
OTT Movie: ఇటీవల కాలంలో ఓటీటీల్లో వెరైటీ సినిమాలు ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్ టైన్ మెంట్ అందిస్తున్నాయి. రోజుకో కొత్త సినిమాతో సినిమా హాళ్లలో మిస్ అయిన మూవీలను వారికోసం అందిస్తున్నాయి.అలాంటి మరో సినిమా ఓటీటీలో భారీ ఆదరణ దక్కించుకుంటుంది.వాస్తవానికి నిజ జీవితంలో జరుగుతున్న ఘటనలను ప్రేరణగా తీసుకుని కొన్ని ఓటీటీలు వెబ్ సిరీస్ లను తీసుకొస్తున్నాయి. కొంతమంది చేసిన తప్పులు వల్ల మరొకరు బలవుతుంటారు.సైకోలుగా మారి తమతమ జీవితాలను నాశనం చేసుకుంటారు.ఇప్పుడు మనం చెప్పుకునే సినిమాలో ఒక తండ్రి తన పిల్లల మీద అసభ్యంగా ప్రవర్తిస్తాడు. ఆ తర్వాత పిల్లలే అతడిని దారుణంగా చంపేస్తారు. ఆ మాంసాన్ని వండి వాళ్లు నడిపే రెస్టారెంట్ కస్టమర్లకు వడ్డిస్తారు. ఆ తర్వాత వరుసగా మర్డర్లు చేస్తూ ఆ మాంసాన్ని వండి తినేస్తుంటారు. ఈ మూవీని ఇప్పటికే చాలా దేశాల్లో బ్యాన్ చేశారు. ఆన్ లైన్లో దొరకడం చాలా కష్టం.
ఇంతకీ ఆ మూవీ పేరేంటంటే మలేషియా నుంచి వచ్చిన క్లే పాట్ కర్రీ కిల్లర్స్. ఈ మూవీని జేమ్స్ లీ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ సినిమా కథ మిసెస్ చూ అనే మహిళ, ఆమె ముగ్గురు కుమార్తెల చుట్టూ తిరుగుతుంది. వారు ఓ రెస్టారెంట్ నడుపుతుంటారు. స్పెషల్ గా ఇంట్లో తయారు చేసిన కర్రీ కారణంగా రెస్టారెంట్ చాలా పాపులర్ అవుతుంది. ఈ కర్రీ ఒక పాత కుటుంబ రెసిపీ ప్రకారం తయారు చేస్తున్నట్లు అందరూ అనుకుంటారు. కానీ అది మనిషి మాంసంతో తయారు చేస్తారు. ఇంత దారుణమైన మూవీని చూడడం చాలా కష్టంగానే ఉంటుంది. కొన్ని సన్నివేశాలు ఒంట్లో వణుకు తెప్పిస్తుంటాయి. ఆపిల్ టీవీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది.
కథలోకి వెళితే మాలికి అనే మహిళ తన భర్త చనిపోవడంతో రెండో పెళ్లి చేసుకుంటుంది.అయితే మొదటి భర్త వల్ల ముగ్గురు కూతుళ్లు కలుగుతారు. వాళ్లను కొత్తగా వచ్చిన స్టెప్ ఫాదర్ లైంగికంగా వేధిస్తుంటాడు.ఇది చూసి తల్లీకూతుళ్లు ఒక్కసారిగా అతడిని చంపేస్తారు. అతడి మాంసాన్ని ముక్కలు చేసి కూర వండుతారు. దానిని వాళ్లు రెస్టారెంట్ కు వచ్చిన వాళ్లకు వడ్డిస్తారు. ఆ కర్రీ కి మంచి పేరు రావడంతో రెస్టారెంట్ పాపులర్ అవుతుంది. అప్పటి నుంచి కామాంధులను టార్గెట్ చేసి వాళ్లను చంపి రెస్టారెంట్లో కూర వడి పెడతారు. మాంసం అయిపోయినప్పుడల్లా వాళ్లు మర్డర్లు చేస్తుంటారు. ఇందులో ఆమె చిన్న కూతురు ప్రియుడు కూడా ఉంటారు. చివరికి వాళ్లు పోలీసులకు చిక్కుతారా.. ఇలాగే చంపుకుంటూ పోతారా ?అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీ ఓటీటీలో తప్పకుండా చూడండి.