Chiranjeevi: బాక్సాఫీస్ ను రఫ్పాడించిన గ్యాంగ్ లీడర్ @32

Chiranjeevi: బాపినీడు ఏకంగా చిరంజీవికి స్వర్ణకిరీట ధారణ చేసి, చేతికి రాజదండం ఇచ్చి సత్కరించారు.

Update: 2023-05-09 09:18 GMT

Chiranjeevi: బాక్సాఫీస్ ను రఫ్పాడించిన గ్యాంగ్ లీడర్ @32

Chiranjeevi: మెగా స్టార్ చిరంజీవి కెరీర్ లో ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. ఓ సాధారణ నటుడుగా ఇండస్ట్రీలోకి ప్రవేశించి అంచెలంచెలుగా ఎదిగి తెలుగు సినిమాకి మకుటం లేని మహారాజుగా మారాడు. అయితే చిరంజీవి కెరీర్ లో ఎన్ని హిట్ సినిమాలు ఉన్నా గ్యాంగ్ లీడర్ ఓ స్పెషల్ అని చెప్పాలి. నిజం చెప్పాలంటే ఈ సినిమాతో చిరు మేనియా స్టార్ట్ అయింది. గ్యాంగ్ లీడర్ లో చిరంజీవి నటన, స్టైల్, డాన్స్ అప్పటి కుర్రకారును ఉర్రూతలూపేసింది. చిరు ఇమేజ్ ని సుస్థిరం చేసిన గ్యాంగ్ లీడర్ 1991 మే 9న రిలీజ్ అయింది. అంటే నేటికి 32 వసంతాలు పూర్తి చేసుకుంది.

1991 మే 9న రిలీజైన గ్యాంగ్ లీడర్..అప్పటివరకు ఉన్న అన్ని సినిమాల రికార్డులను బ్రేక్ చేసింది. బాక్సాఫీసులను బద్దలు కొట్టింది. అందుకే ఈ సినిమాకు చిరంజీవి కెరీర్ లోనే ఒక ప్రత్యేక స్థానం ఉంది. గ్యాంగ్ లీడర్ అంటే ఇదేదో యాక్షన్ సినిమా అని అనిపించేలా టైటిల్ ఉన్నా... ముగ్గురు అన్నదమ్ముల సెంటిమెంట్ కథ ఇది. ఉద్యోగం లేక స్నేహితులతో బలాదూర్ గా తిరిగే ఓ యువకుడు.. తన స్నేహితులకు లీడర్ గా ఉంటూ, విడిపోతున్న తన కుటుంబాన్ని ఎలా ఒకటిగా ఉంచాడు. సొంత అన్నయ్యను అన్యాయంగా చంపేసిన విలన్లకు ఎలా బుద్ధి చెప్పాడు అనేదే ఈ చిత్రం కథాంశం.

గ్యాంగ్ లీడర్ గురించి చెప్పాల్సి వస్తే..పాటలను ప్రస్తావించకుండా ఉండలేం. ఈ సినిమాలో అన్ని పాటలు ఆల్ టైమ్ సూపర్ హిట్లే..వేటూరి, భువనచంద్రల సాహిత్యానికి బప్పీలహరి మ్యూజిక్, ఎస్పీ బాలు గాత్రం, చిరంజీవి స్టెప్పులు, విజయశాంతి గ్లామర్...అన్నీ కలిసి గ్యాంగ్ లీడర్ లో పాటలు ఆల్ టైమ్ హిట్స్ గా నిలిచాయి. ఇప్పటికీ గ్యాంగ్ లీడర్ లో బాణీలు ఉంటే కుర్రకారు కాలు కదపాల్సిందే...ఇక డైలాగులు సైతం ఒక హిస్టరీనే..చేయి చూడు ఎంత రఫ్ గా ఉందో..రఫ్పాడించేస్తాను అనే డైలాగ్ పేలిపోయింది. ఈ డైలాగ్ ఇప్పటికీ పాపులరే.

టాలీవుడ్ లో ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. కానీ, అప్పట్లోనే ఈ సినిమా పాన్ ఇండియా లెవల్ లో క్రేజ్ సాధించింది. తెలుగులో హిట్టైన ఈ సినిమాని తమిళంలో 1991 నవంబర్ 30న రిలీజ్ చేస్తే అక్కడా సెన్సేషనల్ హిట్ కొట్టింది. కేరళలో కూడా మంచి వసూళ్లు సాధించింది. తరువాత హిందీలో ఆజ్ కా గూండారాజ్ టైటిల్ తో రీమేక్ చేస్తే అక్కడ కూడా సత్తా చాటింది. డాన్స్, ఫైట్స్ తో బాలీవుడ్ ను మెస్మరైజ్ చేయడంతో మెగా స్టార్ గురించి అప్పట్లో ఇంగ్లీష్ మేగజైన్లు.. కవర్ పేజ్ స్టోరీలు రాశాయి.

ఈ సినిమా శతదినోత్సవ వేడుకలను ఒకే రోజు హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, ఏలూరు నగరాల్లో ఒకే రోజు నిర్వహించారు. ఇది ఒక అరుదైన విన్యాసం. బాపినీడు ఏకంగా చిరంజీవికి స్వర్ణకిరీట ధారణ చేసి, చేతికి రాజదండం ఇచ్చి సత్కరించారు. మొత్తంగా ఎందరికో లైఫ్ ఇచ్చిన ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించి బయ్యర్లందరికీ లాభాల పంట పండించింది. చిరంజీవికే కాదు ఆయన అభిమానులకు సైతం గ్యాంగ్ లీడర్ ఒక ఎవర్ గ్రీన్ మెమోరీ.

Tags:    

Similar News