అనంతపురం: తుంగభద్ర కీలు తగ్గిన వరద
- డ్యాం ఇన్ ఫ్లో: 6647 క్యూసెక్కులు.
- ఔట్ ఫ్లో: 1439
- డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం: 1633 అడుగులు
- ప్రస్తుతం నీటి మట్టం: 1612.26 అడుగులు
- డ్యామ్ సామర్థ్యం: 100.85 టీఎంసీలు.
- ప్రస్తుతం నీటి నిల్వ: 39.757 టీఎంసీలు.
మావోల వారోత్సవాల నేపధ్యంలో పోలీసుల అలెర్ట్
పెద్దపల్లి :
- నేటి నుండి ఆగస్టు 3 వరకు మావోల వారోత్సవాలు
- తూర్పు డివిజన్ లో అలెర్ట్ అయినా పోలీసులు
- కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజిల వద్ద కేంద్ర బలగాలతో పటిష్ట భద్రత
- మావోలు గోదావరి తీరం దాటకుండా గ్రేహాండ్స్ బలగాలతో ముమ్మర గాలింపు
'గిఫ్ట్ ఏ స్మైల్' కు స్పందన..
కేటీఆర్ జన్మదినం సందర్భంగా చేపట్టిన 'గిఫ్ట్ ఏ స్మైల్' లో భాగంగా వంద అంబులెన్సులు కొనుగోలు చేసే ప్రక్రియకు రంగం సిద్ధమయ్యింది. దీనిలో భాగంగా ఇప్పటికే పలువురు టీఆర్ ఎస్ పార్టీ నాయకులు వీటిని సమకూర్చుతున్నారు. ఈ విధంగా సమకూరిన వాటిని ప్రభుత్వ ఆస్పత్రులకు అందించేందుకు నిర్ణయించారు.
పూర్తి వివరాలతో తెలంగాణా కరోనా బులిటిన్
- 59 పేజీలతో కరోనా బులిటెన్ ఇచ్చిన తెలంగాణ వైద్య శాఖ
- ప్రయివేట్ ఆస్పత్రుల్లో పడకల వివరాలు ప్రకటన
- మొత్తం 55 ప్రయివేట్ ఆస్పత్రుల్లో, 4497 బెడ్స్ ఉండగా, 3032 బెడ్స్ ఫుల్, 1465 ఖాళీ
-హైదరాబాద్ తో పాటూ, తెలంగాణ లోని జిల్లాల్లో ఉన్న కంటైన్మెంట్ జోన్ల వివరాలు ప్రకటన..
కడప ఉక్కు పనులు మరింత ముందుకు
రాయలసీమలో కడప ఉక్కు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి అన్ని రకాల అనుమతులు రాగా, రోడ్డు, ప్రహారీ తదితర నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు మంజూరు చేశారు. అన్నీ అనుకున్నట్టుగానే జరిగితే మళ్లీ సాధారణ ఎన్నికలకు వెళ్లకముందే దీని ప్రారంభోత్సవం జరుగుతుందని అంచనా వేస్తున్నారు. రాయలసీమ ప్రజల చిరకాల ఆకాంక్ష కడప స్టీల్ ప్లాంట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఏడాదికి 3 మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఉక్కు కర్మాగారాన్ని నిర్మించడానికి ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్(ఏపీహెచ్‌ఎస్‌ఎల్) పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కంపెనీని ఏర్పాటు చేసింది.
తెలంగాణ కరోనా బులిటెన్ విడుదల
- ఇవాళ 1610 పాజిటివ్ కేసులు
- ఇప్పటికి మొత్తం 57,142 పాజిటివ్ కేసులు..
- గడిచిన 24 గంటల్లో 9 మంది మృతి..ఇప్పటి వరకు 480 మంది మృతి
రాష్ట్రాలకు జేఎస్టి పరిహారం చెల్లించిన కేంద్రం
జాతీయం
♦ 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను సెస్ కలెక్షన్ రూ.95,444 కోట్లు కాగా కేంద్రం రాష్ట్రాలు/యుటీలకు రూ.1,65,302 కోట్ల జీఎస్టీ పరిహారాన్ని చెల్లించింది
♦ కేంద్ర ప్రభుత్వం మార్చి 2020కి సంబంధించి ఇటీవల రూ.13,806 కోట్ల జీఎస్టీ పరిహారాన్ని రాష్ట్రాలకు చెల్లించింది.
♦ 2019-20 సంవత్సరానికి విడుదల చేసిన పరిహారం మొత్తం రూ.1,65,302 కోట్లకు చేరింది.
♦ 2019-20 సంవత్సరంలో సేకరించిన సెస్ మొత్తం రూ.95,444 కోట్లుగా నిలిచింది.
♦ 2019-20 పరిహారాన్ని విడుదల చేయడానికి గాను 2017-18 మరియు 2018-19 మధ్య వసూలు చేసిన సెస్‌ను కూడా ఉపయోగించుకున్నారు.