కడప ఉక్కు పనులు మరింత ముందుకు
రాయలసీమలో కడప ఉక్కు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి అన్ని రకాల అనుమతులు రాగా, రోడ్డు, ప్రహారీ తదితర నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు మంజూరు చేశారు. అన్నీ అనుకున్నట్టుగానే జరిగితే మళ్లీ సాధారణ ఎన్నికలకు వెళ్లకముందే దీని ప్రారంభోత్సవం జరుగుతుందని అంచనా వేస్తున్నారు. రాయలసీమ ప్రజల చిరకాల ఆకాంక్ష కడప స్టీల్ ప్లాంట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఏడాదికి 3 మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఉక్కు కర్మాగారాన్ని నిర్మించడానికి ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్(ఏపీహెచ్‌ఎస్‌ఎల్) పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కంపెనీని ఏర్పాటు చేసింది.
Update: 2020-07-28 01:53 GMT