Live Updates:ఈరోజు (జూలై-28) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 28 జూలై, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-07-28 01:38 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు సోమవారం, 28 జూలై, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, శుక్లపక్షం అష్టమి (ఉ. 7-03 వరకు) తదుపరి నవమి (తె. 4-45వరకు) స్వాతి నక్షత్రం (మ. 12-27 వరకు) తర్వాత విశాఖ నక్షత్రం.. అమృత ఘడియలు ( రాత్రి 2-41 నుంచి 4-11 వరకు), వర్జ్యం (సా. 5-41 నుంచి 7-11 వరకు) దుర్ముహూర్తం ( ఉ. 8-14 నుంచి 9-05 వరకు తిరిగి రాత్రి 10-58 నుంచి 11-43 వరకు) రాహుకాలం (మ. 3-00 నుంచి 4-30 వరకు) సూర్యోదయం ఉ.5-40 సూర్యాస్తమయం సా.6-31

ఈరోజు తాజా వార్తలు

Live Updates
2020-07-28 13:02 GMT

- బహుముఖ ప్రజ్ఞాశాలి  రావి కొండలరావు మరణం పట్ల ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

- తెలుగు సినీ ప్రముఖుడిగా, దర్శకుడుగా, నాటక రచయితగా, నాటక ప్రయోక్తగా, జర్నలిస్టుగా ఆయన చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు.

- క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, కమెడియన్‌గా అనేక చిత్రాల్లో నటించిన రావి కొండలరావు  తెలుగు సినీ ప్రేక్షకులకు శాశ్వతంగా గుర్తుండిపోతారని అన్నారు.

- ఆయన మరణంతో తెలుగు సినీ పరిశ్రమ మరో పెద్ద దిక్కును కోల్పోయినట్లైందని జగన్ అన్నారు.

- ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

2020-07-28 12:58 GMT

అమరావతి

- సినీ, సాహిత్యరంగ‌ ప్ర‌ముఖుడు రావికొండ‌ల‌రావు మృతి. తెలుగు చ‌ల‌న‌చిత్ర‌రంగానికి తీర‌నిలోటు.

- ఐదు ద‌శాబ్దాలపాటు ప్రేక్ష‌కుల్ని త‌న న‌ట‌న‌తో అల‌రించిన రావికొండ‌ల‌రావు స్క్రీన్‌ప్లే ర‌చ‌యిత‌గా,స‌హ‌నిర్మాత‌గా బ‌హుముఖ‌ రంగాల్లో త‌న‌సేవ‌లు అందించారు.

- ఆయ‌న కుటుంబ‌స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సంతాపం తెలియ‌జేస్తున్నాను

2020-07-28 12:41 GMT

- ప్రముఖ నటుడు రావి కొండలరావు మరణించారు.

- నటుడు, దర్శకుడు, రచయిత, నాటకం.. సినీమా.. టీవీ.. పత్రికలు.. మిమిక్రీ ఇలా అన్ని రంగాలలోనూ విశేష అనుభవం రావి కొండలరావు మంగళవారం నాడు (జూలై 28) గుండెపోటుతో మరణించారు.

2020-07-28 09:39 GMT

- కరోనా సమయంలో ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా ఆదేశించాలని ఫిర్యాదు

- జీవించే హక్కును ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని HRC కి ఫిర్యాదు

- ఆన్లైన్ క్లాసులను వెంటనే ఆపేయాలి కోరిన NSUI నేతలు.

2020-07-28 08:57 GMT

కరీంనగర్ జిల్లా:

👉 రామడుగు మండల తహసిల్దార్ కార్యాలయం ముందు మందు డబ్బాతో బైఠాయించిన ఇద్దరు యువకులు ...

👉 తమ తాతకు సంబంధించిన భూమిని మరొకరిపై పట్టా చేయించారని ఆవేదన

👉రామడుగు లోని 13/డి ,13/ఇ, 13/ఎఫ్ ,13/జి,13/ఇ పదిహేను గుంటల భూమిని అక్రమ పట్టా చేశారంటూ ఆవేదన వ్యక్తం చేసిన యువ రైతులు...

👉ఎమ్మార్వో కోమల్ రెడ్డి ఎంత చెప్పిన వినని పర్శరాం, మహేష్ లు...

👉 పరశురామ్ మహేష్ లను చివరకి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలింపు

2020-07-28 08:50 GMT

- ఆక్వా రైతుల తరఫున కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రాజ్‌నాథ్‌ సింగ్‌ తదితరులను కలిసేందుకు ప్రయత్నిస్తున్నాను

- రైతులకు రూ. 6,500 ఇచ్చినట్టే, ఆక్వా రైతులకు కూడా ఇచ్చే విషయం పరిశీలించాలని కోరుతున్నాను

- నాకు భద్రత కల్పించే అంశంపై హోం సెక్రటరీతో చర్చించాను

- రాష్ట్ర ప్రభుత్వమే భద్రత కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది

- నాకు సమస్యే రాష్ట్ర ప్రభుత్వ భద్రతతో అన్న విషయం చెప్పాను

- ఈ వారాంతం వరకు నాకు కేంద్ర బలగాల భద్రత అందుతుందని నమ్ముతున్నాను

- దురదృష్టావశాత్తూ నేను నా నియోజకవర్గానికి వెళ్లే పరిస్థితి లేదు

- నేను ధైర్యం వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నా, నా శ్రేయోభిలాషులు వద్దంటున్నారు

- సుమారు 24 పోలీసు స్టేషన్లలో నా అనుచరులు, వారి అనుచరులు వేర్వేరు కేసులు పెట్టారు

- ప్రభుత్వమే నామీద కక్షగట్టి వ్యవహరిస్తోంది.

- నేను స్పీకర్‌కు లేఖ రాసిన 20 రోజుల తర్వాత కేసులు పెడుతూ పోయారు

- నేను క్షేత్రస్థాయికి వెళ్లలేని నిస్సహాయస్థితిలో ఉన్నాను

- అతిత్వరలో నాకు భద్రత వస్తుంది. అప్పుడే నా నియోజకవర్గానికి రాగలను

2020-07-28 08:45 GMT

- చేతిలో చిల్లిగవ్వలేక దాతల సాయంతో తలదాటుకుంటూ గడుపుతున్న విదేశీయురాలు

- తల్లి బృందావనంలో కూతురు తిరుపతిలో మూడు నెలలుగా ఇక్కట్లు

- విదేశీ మహిళకు ఆర్థిక సాయమందించిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి

- ప్రభుత్వంతో మాట్లాడి వారిని వారి దేశానికి పంపే ప్రయత్నం చేస్తామని భరోసానిచ్చిన కరుణాకర్ రెడ్డి

2020-07-28 06:04 GMT

విజయవాడ

- ఈ నెల 31న శ్రావణ మాసం  2 వ శుక్రవారము పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక పూజలు

- దుర్గమ్మ వరలక్ష్మి దేవి గా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

- ప్రతీ ఏడాది నిర్వహించు సామూహిక వరలక్ష్మీ వ్రతములు, ఉచిత సామూహిక ఆర్జిత సేవలను రద్దు.

- భక్తుల సౌకర్యార్థం ప్రధాన ఆలయంలో  అమ్మవారికి 8-00 గా.లకు దేవస్థానం వారిచే జరిపించు వరలక్ష్మీ వ్రతము నిర్వహించనున్నారు.

- వ్రతములో పరోక్షముగా గోత్రనామములతో జరిపించుకోవడం కోసం ఏర్పాట్లు 

2020-07-28 05:58 GMT

బ్రేకింగ్...

- దేశ వ్యాప్తంగా తొమ్మిది చోట్ల సోదాలు నిర్వహిస్తున్న ఈ డి..

- ముంబై, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీలో తో సహా మరో ఐదు ప్రాంతాల్లో ఈడి సోదాలు..

- ఇప్పటికే జివికె పై కేసు నమోదు చేసిన సీబీఐ ..

- సిబిఐ కేసు ఆధారంగా సోదాలు..

- Mial కు చెందిన 730 కోట్ల నిధుల దుర్వినియోగంపై జీవికి పై కేసు నమోదు.

- ముంబై ఎయిర్ పోర్ట్ లో నిధుల దుర్వినియోగంపై కేసు నమోదు చేసిన సిబిఐ ఈడి

2020-07-28 05:55 GMT

కడప :

- కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్ లొ రెండవ రొజు సిబిఐ విచారణ

- ఈ రొజు విచారణకు హజరైన వైఎస్ వివేకా కుమార్తె సునీత

- ఇది వరకే పులివెందులలొ విచారించిన సిబిఐ

- మరొమారు సిబిఐ అదికారులు పిలవడంలొ విచారణకు హజరైన సునీత

Tags:    

Similar News