కె.కృష్ణ సాగర్ రావు .. బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి.
బీజేపీ సీనియర్ నేత సోము వీరరాజును ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడుగా నియమించడాన్ని తెలంగాణ రాష్ట్ర శాఖ అభినందిస్తుంది. సోము వీరరాజు సంస్థాగత పాత్రలలో దశాబ్దాల అనుభవం , పార్టీ భావజాలం పట్ల రాజీలేని విధేయతతో కేటాయించిన కొత్త పాత్రకు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా దిగ్విజయంగ నిర్వహించాలని వ్యకిగతంగా , రాష్ట్ర పార్టీ తరపున హృదయపూర్వకంగా కోరుకుంటున్న.
తెలంగాణ ఏజన్సీలో కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు.. సరిహద్దుల్లో హై అలర్ట్...
వరంగల్: సరిహద్దుల్లో హై అలర్ట్...తెలంగాణ ఏజన్సీలో కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు. నేటి నుండి ఆగస్టు 3వ తేదీ వరకు మావోయిస్టుల అమర వీరుల సంస్మరణ వారోత్సవాలు. ఘనంగా నిర్వహించాలని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జగన్ పిలుపు. మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో ముందస్తుగా అప్రమత్తమైన పోలీసులు. తెలంగాణా- చత్తీస్ ఘడ్, తెలంగాణా-మహారాష్ట్ర సరిహద్దు అటవీ ప్రాంతల్లో కూంబింగ్ ముమ్మరం చేసిన పోలీసులు. అనుమానిత ప్రాంతాల్లో విస్తృతంగా వాహన తనిఖీలు. ఏజన్సీ పోలీస్ స్టేషన్లు కు అదనపు భద్రత మావోయిస్టుల షెల్టర్ జోన్స్ పై పోలీసుల ప్రత్యేక నిఘా. ఇప్పటికే మావోయిస్టు హిట్ లిస్ట్ లో ఉన్న నేతలను మైదాన ప్రాంతాలకు తరలివెళ్లాలని పోలీసుల ఆదేశాలు. టార్గెట్స్ రీచ్ కోసం రంగంలోకి మావోయిస్టు యాక్షన్ టీమ్స్ రంగంలోకి దిగాయని నిఘా వర్గాలకు అందిన సమాచారం. అప్రమత్తమైన ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలపోలీసులు తెలంగాణ ఏజన్సీ ప్రాంతాలన్నింటిని గుపిట్లోకి తీసుకున్న పోలీసు బలగాలు. మావోలు, పొలుసుల చర్య, ప్రతి చర్యలతో బిక్కు, బిక్కు మంటున్న ఏజన్సీ పల్లెలు.
అమరావతి: ఉదయం 11గం.లకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి గౌతమ్ రెడ్డి అధ్యక్షతన పరిశ్రమల శాఖపై సమీక్ష. మధ్యాహ్నం 12గం.లకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి గౌతమ్ రెడ్డి అధ్యక్షతన పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖపై సమీక్ష. పారిశ్రామిక పాలసీ విధానం, పెట్టుబడులు సహా పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం.
తెలంగాణాలో కరోనా పరిస్థితులపై మరోసారి హైకోర్టులో విచారణ
టీఎస్ హైకోర్టు
- రాష్ట్రంలో కరోనా పరిస్థితుల పై నేడు హైకోర్టు మరోసారి విచారణ...
- కరోనా కేసుల్లో తమ ఆదేశాలు పట్టించుకోవడం లేదని ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం..
- ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులపై వివరణ ఇవ్వనున్న ప్రభుత్వం...
-నేడు హైకోర్టు నేరుగా విచారణకు హాజరు కానున్న చీఫ్ సెక్రటరీ, వైద్య అధికారులు, జీహెచ్ఎంసీ కమిషనర్.
- కరోనా ను నివారించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, టెస్టులు,హెల్త్ బులిటెన్ లపై వివరణ ఇవ్వనున్న ప్రభుత్వం.
- కరోనా పై ధాఖలైన అన్ని పిటిషన్లు నేడు విచారించనున్న హైకోర్టు.
వారం రోజుల్లో చేప పిల్లల పంపిణీ..
పేద, మత్స్యకార కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చేప, రొయ్య పిల్లలు, గొర్రెల పంపిణీకి మరోసారి ఏర్పాట్లు చేస్తోంది. వీటిని పెంచే కార్యక్రమం ద్వారా కొంతైనా ఆర్థిక స్థితి మెరుగుపడుతుందనే కారణంతో సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు మంత్రి తలసాని ప్రకటించారు.
శ్రీవారి ఆలయంలో ఈనెల 30 నుంచి పవిత్రోత్సవాలు
తిరుమల
- శ్రీవారి ఆలయంలో ఈనెల 30 నుండి మూడురోజుల పాటు పవిత్రోత్సవాలు
- రేపు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలకు అంకురార్పణ
- తెలిసీ తెలియక కలిగిన దోషాలకు పరిహారంగా పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు.
- కరోనా నేపథ్యంలో ఏకాంతంగా నిర్వహిస్తున్న టీటీడీ
-పవిత్రోత్సవాల సందర్భంగా కల్యాణ సేవను రద్దు చేసిన టీటీడీ
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద
నల్గొండ:
- నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం : 590.00 అడుగులు.
- ప్రస్తుత నీటిమట్టం : 542.60 అడుగులు.
- ఇన్ ఫ్లో : 40,252 క్యూసెక్కులు.
- అవుట్ ఫ్లో : 1500 క్యూసెక్కులు.
- పూర్తిస్థాయి నీటి నిల్వ : 312.0405 టీఎంసీలు.
- ప్రస్తుత నీటి నిల్వ : 193.7880 టీఎంసీలు.
కోవిడ్ ఆసుపత్రిగా పులివెందుల ఏరియా అసుపత్రి
కడప :
- పులివెందులలొని ఏరియా అసుపత్రిని జిల్లా కోవిడ్ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తూ జిల్లా కలెక్టరు హరికిరణ్ ఉత్తర్వులు జారీ...
- ఇడుపులపాయ ట్రిపుల్ ఐటిలొను కొవిడ్-19 క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు...
- విదేశాల నుంచి జిల్లాకు వచ్చే వారి కోసం 500 బెడ్లతొ క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు
ఎంజిఎం హాస్పిట సూపరెండేంట్ డా శ్రీనివాసరావు రాజీనామా..
వరంగల్ అర్బన్.
- ప్రస్తుతం హోం క్వారెంటాయిన్ లో ఉన్న శ్రీనివాసరావు.
- శ్రీనివాసరావు భార్యకు పాజిటివ్ రావడంతో తను హోం క్వారెంటాయిన్ లో ఉన్నారు.
- అందుకోసమే గత 5 రోజులుగా సీక్ లీవ్ తీసుకున్న శ్రీనివాసరావు.
కరోనా బారిన పడి గుట్టలపై తలదాచుకుంటున్న పోలీసులు
మహబూబాబాద్ జిల్లా.
- వరంగల్ ఉమ్మడి జిల్లాలో పోలీసులను వణికిస్తున్న కరోనా వైరస్...
- ఇళ్ళు కాళీ చేయాలని ఒత్తిడి చేస్తున్న ఇంటి యాజమానులు..
- మహబూబాబాద్ జిల్లాలో 20మందికి పైగా పోలీస్ సిబ్బందికి కరోనా..
- ఇంటి యామానులు ఇళ్ళు కాళీ చేయాలని ఒత్తిడి చేయడంతో గుట్టలపై తల దాచుకుంటున్న పోలీసులు..