మచిలీపట్నం ఉల్లింగిపాలెం లో ఉద్రిక్తత
-మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ను అరెస్ట్ చేయాలని ధర్నాకు దిగిన మోకా భాస్కరరావు బంధువులు, మత్స్యకారులు, అభిమానులు .
- కొల్లు రవీంద్ర కుల ద్రోహి, కుల బహిష్కరణ చేయాలంటూ నినాదాలు చేస్తున్న మత్స్యకారులు..
- భారీగా మోహరించిన పోలీస్ బలగాలు..
తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట
- ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి లేఖ రాసిన కాపు ఉద్యమనేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం
- మీ విజయానికి మా జాతి సహకారం కొన్ని చోట్ల తప్ప మిగిలిన అన్ని చోట్ల మీరు పొంద లేదా.. ముద్రగడ
- పాలకులు ప్రజల యొక్క కష్టాలలో పాలుపంచుకోవాలి.. ముద్రగడ
- ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు అప్పటి బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతిబసు గారు మీ తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి లాగా పూజలందుకో వాలే కాని పదవి మూన్నాళ్ళ ముచ్చట చేసుకోకండి... ముద్రగడ
- ముఖ్యమంత్రి గారు దయచేసి మా జాతి సమస్య తీర్చమని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని కోరమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను.... ముద్రగడ పద్మనాభం
అమరావతి :
- ఇంటర్మీడియెట్ పరీక్ష జవాబుపత్రాల రీ వెరిఫికేషన్, మార్కుల రీకౌంటింగ్‌కు ఫస్ట్, సెకండియర్లకు కలిపి మొత్తం 37,048 దరఖాస్తులు ఇంటర్ బోర్డుకు అందాయి.
- ఇందులో రీవెరిఫికేషన్‌కు 28,742, రీకౌంటింగ్‌కు 8,306 దరఖాస్తులు ఉన్నాయి.
- రీవెరిఫికేషన్, రీకౌంటింగ్‌కు జూన్ 30 వరకు దరఖాస్తులు స్వీకరించారు.
- సాధారణంగా దరఖాస్తుల గడువు ముగిసిన వెంటనే స్పాట్ వాల్యుయేషన్ క్యాంపుల నుంచి జవాబుపత్రాలను తెప్పించి రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ మొదలు పెడతారు.
- 15 రోజుల్లో దరఖాస్తులన్నింటినీ పరిష్కరిస్తారు.
- కానీ కొవిడ్-19 నేపథ్యంలో ఈ ప్రక్రియ ప్రారంభం కాలేదు.
- దీంతో అభ్యర్థుల దరఖాస్తు ఫలితాలకు కనీసం మరో 20 రోజులు పట్టే అవకాశం ఉంది.
అమరావతి:
- రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ చేయడానికి రంగం సిద్ధమవుతోంది.
- ఇద్దరు మంత్రులు.. మోపిదేవి వెంకటరమణారావు, పిల్లి సుభాష్‌చంద్రబోస్‌లు రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో తమ పదవులకు రాజీనామా చేసిన విషయం విదితమే.
- ఖాళీ అయిన మంత్రి పదవులను భర్తీ చేయడానికి వీలుగా విస్తరణ చేపట్టనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
- ఆషాఢమాసం ముగిసిన తర్వాత శ్రావణమాసం ప్రారంభంలో మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశముందని సమాచారం.
- కాగా శ్రావణ మాసం 21వ తేదీ నుంచి ప్రారంభమవుతోంది.
- దీంతో 22వ తేదీన కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించే వీలున్నట్టు తెలుస్తోంది.
- ప్రస్తుతం మంత్రి పదవులకు రాజీనామా చేసిన ఇద్దరు నేతలు బీసీ వర్గానికి చెందినవారు.
- కొత్త మంత్రులను కూడా బీసీ వర్గం నుంచే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎంపిక చేస్తారని భావిస్తున్నారు.
నృత్యదర్శకురాలు సరోజ్ ఖాన్ ఇక లేరు
మూడుసార్లు జాతీయ అవార్డు అందుకున్న నృత్యదర్శకురాలు సరోజ్ ఖాన్(71) ఇక లేరు.
శ్వాసకోశ సంబంధిత సమస్యలతో గత శనివారం ముంబయిలోని గురునానక్ ఆస్పత్రిలో చేరిన ఆమె చికిత్స పొందుతూ.. శుక్రవారం వేకువజామున 2 గంటల సమయంలో గుండెపోటుతో కన్నుమూశారు.
1950వ దశకంలో బాలనటిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన సరోజ్‌ఖాన్ బాలీవుడ్‌లో మంచి కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు పొందారు. త
న 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో రెండు వేలకు పైగా పాటలకు నృత్య దర్శకురాలిగా పనిచేశారు. ‘మదర్ ఆఫ్ డ్యాన్స్’గా సరోజ్ ఖాన్ ప్రసిద్ధి గాంచారు.
రేపు టీటీడీ బోర్డు అత్యవసర సమావేశం
- తిరుమల, తిరుపతి దేవస్థానం దర్మకర్తల మండలి అత్యవరంగా సమావేశం కానుంది.
- డౌన్ అనంతరం దర్శనాలను ప్రారంబించిన పాలకమండలి ఇటీవల కాలంలో పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా తీసుకునే చర్యలపై దీనిపై చర్చించనున్నారు.
- దీనికి ఎక్కడివారు అక్కడే ఉంటూ వీడియో కాన్పెరెన్స్ ద్వారా ఈ సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
కారును ఢీకొన్న కంటైనర్, నలుగురి మరణం
అన్ లాక్ లో సైతం ప్రయాణాలు వేగంగా జరుగుతున్నాయనే దానికి ఇదే నిదర్శనం. లాక్ డౌన్ దాదాపుగా మూడు నెలల తరువాత ప్రయాణాలన్నీ ఒక్కసారే ప్రారంభం కావడంతో ఇలా ప్రమాదాలకు కారణమవుతున్నాయి. గుంటూరు వద్ద జరిగిన ప్రమాదంలో నలుగురు మరణించడం దారుణంగా చెప్పవచ్చు.
నరసరావుపేట నుంచి చిలకలూరిపేట మీదుగా విజయవాడ వెళ్తున్న కారును గుంటూరు నుంచి చిలకలూరిపేట వైపు వెళుతున్న కంటైనర్ లారీ బుధవారం అర్ధరాత్రి యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జుకాగా.. అందులో ప్రయాణిస్తున్న నలుగురు యువకులు చనిపోయారు.
నరసరావుపేటకి చెందిన మేడసాని వెంకట శ్రీచంద్ (25), ఇనుమెట్ల గ్రామానికి చెందిన అత్తులూరి బలరాం(27) అక్కడికక్కడే చనిపోగా..గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ నరసరావుపేటకి చెందిన వింజమూరి హరికృష్ణ (27), షేక్ ఫిరోజ్ అహ్మద్(26) మృతిచెందారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఏపీలో ఉద్యోగుల జీతాలకు లైన్ క్లియర్
- ఏపీలో ఉద్యోగుల జీతాలకు లైన్ క్లియర్ అయ్యింది. ప్రభుత్వం పంపిన ద్రవ్య వినిమయ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపారు.
- దీంతో ఏపీప్రభుత్వ ఉద్యోగులందరికీ జీతాలు చెల్లించేందుకు అడ్డంకి తొలగిపోయింది.
-ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదించడంలో రెండు పార్టీల మధ్య ఏర్పడిన వివాదం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది.
- ప్రస్తుతం ఆ బిల్లుకు సంబంధించి గవర్నర్ ఆమోదం తెలిపడంతో జీతాలు చెల్లించేందుకు మార్గం సుగమమయ్యింది.
విజయవాడ: కేంద్ర ప్రభుత్వం దివాలాకోరు విధానాలకు వ్యతిరేకంగా నేడు జరుగుతున్న కార్మిక సంఘాల నిరసనలకు సిపిఐ మద్దతు - సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ కరోనా మహమ్మారిని అడ్డంపెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటు పరం చేసేందుకు సిద్ధమైంది.
- దేశవ్యాప్తంగా 151 పాసింజర్ రైళ్ల నిర్వహణను ప్రైవేటు పరం చేయనున్నది.
- అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇస్రోలో కూడా ప్రైవేటు భాగస్వామ్యానికి దారులు తీసింది.
- రక్షణ రంగంలో 75 శాతం విదేశీ పెట్టుబడులను అనుమతించింది.
- ఎయిర్ ఇండియాను అమ్మేందుకు చూస్తున్నది.
- పేదలు, వలస కార్మికులు, రోజువారీ కూలీలు, నిర్మాణ కార్మికుల కష్టాలు ప్రభుత్వాలకు ఏమాత్రం పట్టలేదు.
- రు.20 లక్షల కోట్ల ఆత్మను నిర్భర్ ప్యాకేజీ వల్ల పేదలకు నయాపైసా ఉపయోగం లేదు.
- ప్రజాస్వామ్య వ్యవస్థకు సంకెళ్లేసి దుర్మార్గంగా ప్రైవేటీకరణ ప్రోత్సహిస్తున్న కేంద్రం తీరును ఖండిస్తున్నాం. - రామకృష్ణ.
నేటి నుంచి విజయవాడ అమ్మవారి శాకాంబరి ఉత్సవాలు
- నేటి నుంచి శాకాంబరి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన అవసరమైన ఏర్పాట్లను దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారు. దీంతో అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
- విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు నేటి నుంచి మూడురోజులపాటు శాకంబరి ఉత్సవాలు జరుగుతాయని ఆలయ కార్యనిర్వాహణాధికారి ఎం.వి.సురే్‌షబాబు తెలిపారు.