Live Updates: ఈరోజు (సెప్టెంబర్-30) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-09-30 01:15 GMT
Live Updates - Page 3
2020-09-30 07:44 GMT

CM JAGAN: నాడు–నేడు పై జగన్‌ సమీక్ష

అమరావతి: వైద్య ఆరోగ్యశాఖలో నాడు–నేడు పై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.

పాల్గొన్న డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, సీఎస్‌ నీలం సాహ్ని, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు.

2020-09-30 07:01 GMT

YANAMALA RAMAKRISHNUDU : ప‌త‌నావ‌స్థ‌లో ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక వ్యవస్థ: యనమల

అమరావతి: యనమల రామకృష్ణుడు మాజీ ఆర్ధిక మంత్రి వ్యాఖ్యలు :

- భావితరాలు ఈ అప్పులను తీర్చలేని దుస్థితి

- ఏడాదిలో చేయాల్సిన అప్పులు తొలి 5 నెలల్లోనే చేశారు

- మిగిలిన 7 నెలల్లో అప్పులెన్ని చేస్తారో తల్చుకుంటే గుండె గాభరానే..

- రోజువారీ ఖర్చులకు అప్పులు చేయాల్సిన దురవస్థ తెచ్చారు

- జగన్ పాలనలో రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ ఎంత కొలాప్స్ అయ్యిందో కాగ్ లెక్కలే సాక్ష్యం.

- టిడిపి హయాం కంటే నాలుగున్నర రెట్లు ఎక్కువ అప్పుల్లో రాష్ట్రాన్ని ముంచారు.

- టిడిపి పాలనలో ఏడాదికి రూ26వేల కోట్ల అప్పులు..

- వైసిపి పాలనలో ఏడాదికి రూ 1,13,112కోట్ల అప్పులు

- అప్పులపై వడ్డీ చెల్లింపులకే రూ లక్ష కోట్లు వ్యయం చేయాల్సిన దుస్థితి.

- జిఎస్ డిపి అవుట్ పుట్ 24% తగ్గిపోతుందని ఎస్ బిఐ లాంటి పలు ఏజెన్సీల హెచ్చరికలు

- జిఎస్ డిపిలో దవ్యలోటు నిష్పత్తి 9-10%కు చేరినా ఆశ్చర్యం లేదు.

- తెచ్చిన అప్పులు అభివృద్దిపై పెట్టడం లేదు.

- జగన్ అనుచరులకే పంచిపెడుతున్నారు.

- ప్రచార ప్రకటనల ఆర్భాటం ఖర్చుకే ప్రాధాన్యం.

- పేదల ఖాతాల్లో పడే నగదు అరకొరే..

- అర్హులలో మూడొంతుల మందికి ఎగ్గొడుతున్నారు.

- ఒక చేత్తో ఇచ్చినట్లే ఇచ్చి, 2చేతులతో గుంజుకుంటున్నారు

- అటు అప్పుల భారం, ఇటు పన్నుల భారం,

- మరోవైపు కరోనా భారం, ఇంకోవైపు వైసిపి అవినీతి భారంతో కోట్లాది ప్రజలు కుంగిపోయారు.

- అభివృద్ది శూన్యం, సంక్షేమం శూన్యం, ఉపాధి శూన్యం, పెట్టుబడులు శూన్యం, ప్రగతి శూన్యం

- జీరో గవర్నెన్స్ కు ప్రతిబింబంగా జగన్ రెడ్డి పాలన

- జగన్మోహన్ రెడ్డి అనుచరుల ఆర్ధికాభివృద్ది మాత్రం బ్రహ్మాండం.

- రాష్ట్ర ఆర్ధికాభివృద్దిని గాలికి వదిలేసి జగన్ అనుచరుల ఆర్ధికాభివృద్దికే పెద్దపీట.

- పేదల ఆర్ధికాభివృద్దికి గండికొట్టి, పెద్దలకు దోచిపెడ్తున్నారు.

- రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన ముఖ్యమంత్రిగా చరిత్రలో జగన్ రెడ్డి నిలిచిపోతారు.

2020-09-30 06:52 GMT

GUNTUR NEWS: గుంటూరు కార్పొరేషన్ ఎదుట ఉద్యోగుల, కార్మికుల ధర్నా

 గుంటూరు: దీర్ఘకాలం పెండింగ్ లో ఉన్న మున్సిఫల్ కార్పోరేషన్ ఉద్యోగుల, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని

- గుంటూరు కార్పొరేషన్ ఎదుట ఉద్యోగుల, కార్మికుల ధర్నా.

- అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు కార్మికులందరికీ సమాన వేతనం ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు.

- ఎక్కడ లేని నియమ నిబంధనలను అవుట్ సోర్సింగ్ కార్పోరేషన్ లో అమలు చేస్తున్నారు.

- ఏపి కాస్ లో ఏడాది కాల పరిమితిని తొలగించాలి.

- కార్మిక సంఘల,ఉద్యోగుల గౌరవఅధ్యక్షుడు మద్దిరాల మ్యానీ.

2020-09-30 06:48 GMT

PEDDAPURAM MLA: అధికారుల తీరుపై పెద్దాపురం ఎమ్మెల్యే ఆగ్రహం

తూర్పుగోదావరి - పెద్దాపురం: పెద్దాపురంలో గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన క్రీడా వికాస కేంద్రం, ఈత కొలను పనులు నిలిపివేయడం దారుణం

- 70 శాతం పనులు పూర్తి చేసినా గత ఏడాదిన్నరలో వాటిని అధికారులు పూర్తిచేయని తీరును పరిశీలిఁచిన ఎమ్మెల్యే చినరాజప్ప

- అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప

- పరిశీలనలో పాల్గొన్న మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు మాజీ వైస్ చైర్మన్ కొరుపూరి రాజు తదితరులు

2020-09-30 06:43 GMT

GO.No.22: జీవో నెంబర్ 22 ను రద్దు చేయాలని వామపక్ష నిరసన.

అనంతపురం : పెనుకొండలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా జీవో నెంబర్ 22 ను రద్దు చేయాలని వామపక్ష ఆధ్వర్యంలో నిరసన.. అంబేద్కర్ కూడలిలో జీవో నెంబర్ 22 కాగితాలను దగ్ధం చేసిన వామపక్షాలు...

2020-09-30 06:41 GMT

ఏపీని అప్పుల చేశారు: బీజేపీ నేత విష్ణు కుమార్ రాజు

విశాఖ: ఋషికొండ బీచ్ ని పర్యాటక ప్రాంతం గా మార్చేందుకు బీజేపీ ప్రభుత్వం శ్రీకారం చూడతుందని బీజేపీ నేత విష్ణు కుమార్ రాజు  అన్నారు.

దేశంలోనే సింహాచలం కి ఒక్క ప్రత్యేక స్థానం ఉంది..

సింహాచలం గుడి ప్రసాద స్క్రీమ్ క్రింద 53కోట్లు ప్రకటించాం..

కరోన సమయంలో సింహాచలం సిబ్బందికి జీతాలు లేక చాలా ఇబ్బంది పడ్డారు..

దేవాదాయ శాఖ ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్ధం అవుతోంది..

పేద ప్రజలు మోడీ అవాస ఇంటికి డబ్బులు కట్టిన ఈ ప్రభుత్వం కట్టించుకుండా ఉంది..

పేదల ఇంటి కోసం ప్రజలను ఇలా ఇబ్బంది పెట్టడం సరైనది కాదు...

వెంటనే ఈ ప్రభుత్వం పేద ప్రజల ఇంటిని నిర్మించి ఇవ్వాలి బీజేపీ తరపున డిమాండ్..

వైసీపీ ప్రభుత్వం రాష్టాని అప్పులలో ఉంచారు...

జగన్ ఒక్కసారి కళ్ళు తెరిచి ప్రజల ఇబ్బందులు చూడండి..

2020-09-30 06:13 GMT

Guntur District updates: దేశంలోని రైతులు ఎదురు చూస్తున్న చట్టాలు అందుబాటులోకి వచ్చాయి..

గుంటూరు....

-బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెల కిషోర్ బాబు కామెంట్స్...

-రైతులను దళారులు చేస్తున్న మోసాన్ని చూసి రైతుకు వెన్ను దన్నుగా నిలిచేందుకు మోడీ వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చారు.

-ధరల హామీ ఒప్పందం,రవాణా సౌకర్యాల చట్టాలు వ్యవసాయాని ఊతమిస్తాయి.

-వ్యవసాయ రంగ చరిత్రలో ఈ చట్టాలు కీలక మలుపు తెస్తాయి.

-2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం,దళారులు దోపిడీ నుండి రైతులను రక్షించడం వ్యవసాయ చట్టం లక్ష్యం.

-రైతు నేరుగా పంటను అమ్ముకునే వెసులుబాటు చట్టం కల్పిస్తుంది.

-పంటను ముందుగానే అమ్ముకునే విధానం చారిత్రాత్మకం.

-రెండున్నర రెట్లు ఎమ్ ఎస్పిని పెంచిన ఘనత మోఢీది.....

2020-09-30 06:10 GMT

Vijayawada updates: మెరుగైన వైద్యం పేరుతో ఆగని కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీ..

విజయవాడ..

-టీ బి, బ్రెయిన్ infection తో తమ పాపను ఒక హాస్పిటల్ లో చేర్చిన తాడేపల్లి గూడెం కు చెందిన వసంత దంపతులు

-వారం రోజుల్లో 9 లక్షలు ఖర్చు పెట్టించినా పాప ఆరోగ్యంలో ఏమాత్రం మార్పు లేదని ఆవేదన

-ఇంకో లక్ష చెల్లించి పాపను గవర్నమెంట్ హాస్పిటల్ లో జాయిన్ చేయించుకోమని తాపీగా చెబుతున్న హాస్పిటల్ యాజమాన్యం

-స్థలం అమ్మి వైద్యం కోసం తీసుకు వస్తె డబ్బులన్నీ తీసుకుని స్పృహలో లేని పాపను తిరిగి ఇస్తామని చెప్పడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న   తల్లిదండ్రులు

-డబ్బుల కోసం ఒత్తిడి చేయడంతో హాస్పిటల్ నిర్వాకం పై పటమట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన పాప తల్లిదండ్రులు

2020-09-30 06:01 GMT

Prakasam district updates: రాష్ట్రంలో కక్షపూరిత అరాచక పాలన నడుస్తోంది..

ప్రకాశం జిల్లా..

-పర్ఛూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి కామెంట్స్...

-బాపట్ల పార్లమెంట్ అద్యక్షు డుగా నియమించి నందుకు చంద్రబాబుకు దన్య వాధాలు.

-కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని టీడీపీ అబివృద్ది బాటలో నడిచేలా చక్కటీ వాతావరణం ఏర్పాటు చేసింది.

-జలసిరిలో బోర్లు తవ్వుతాం మిగత ఏర్పాట్ల భారం రైతులే భరాయించాలని మరోసారి తామే బరాయిస్థామంటూ చెబుతున్నారు.

-రాష్ట్రంలో ప్రశ్నించిన వారిని ప్రభుత్వం టార్గెట్ చేసేలా వ్యవహరిస్తూ బయబ్రాం తులకు గురి చేస్తోంది.

-ప్రభుత్వ తీరుతో బయాందోళనకు గురవుతున్న టీడీపీ నాయకులకు మా పార్టీ తరుపున సంఘీభావం తెలుపుతున్నాం.

2020-09-30 05:46 GMT

Amaravati updates: సీఐ నుంచి ప్రాణహాని ఉందన్న మార్కండేయులు..

అమరావతి..

-తాడేపల్లి రూరల్ సీఐ నుంచి ప్రాణహాని ఉందంటూ ఓ వ్యక్తి సెల్ఫీ వీడియో

-ఇంట్లో నిద్రిస్తున్న తన సోదరుడిని ఎక్కడికో తీసుకెళ్లారంటూ ఆవేదన

-తన అన్న ఆచూకీ తెలపాలన్న తాడేపల్లికి చెందిన మార్కండేయులు

-తెల్లవారుజామున 4 గంటలకు తన అన్నను పోలీసులు బలవంతంగా తీసుకెళ్ళారన్న బాధితుడు

-సీఐ అంకమ్మరావు కొంతకాలంగా అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపణ

-ఇప్పటికే లక్షల్లో వసూలు చేసారని బాధితుడు ఆరోపణ

-గుంటూరు అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేస్తే తమపై కక్షగట్టారని బాధితుడి ఆవేదన

-ఏపీ ప్రభుత్వం, హైకోర్టు తనకు రక్షణ కల్పించాలని వినతి

Tags:    

Similar News