YANAMALA RAMAKRISHNUDU : పతనావస్థలో ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక వ్యవస్థ: యనమల
అమరావతి: యనమల రామకృష్ణుడు మాజీ ఆర్ధిక మంత్రి వ్యాఖ్యలు :
- భావితరాలు ఈ అప్పులను తీర్చలేని దుస్థితి
- ఏడాదిలో చేయాల్సిన అప్పులు తొలి 5 నెలల్లోనే చేశారు
- మిగిలిన 7 నెలల్లో అప్పులెన్ని చేస్తారో తల్చుకుంటే గుండె గాభరానే..
- రోజువారీ ఖర్చులకు అప్పులు చేయాల్సిన దురవస్థ తెచ్చారు
- జగన్ పాలనలో రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ ఎంత కొలాప్స్ అయ్యిందో కాగ్ లెక్కలే సాక్ష్యం.
- టిడిపి హయాం కంటే నాలుగున్నర రెట్లు ఎక్కువ అప్పుల్లో రాష్ట్రాన్ని ముంచారు.
- టిడిపి పాలనలో ఏడాదికి రూ26వేల కోట్ల అప్పులు..
- వైసిపి పాలనలో ఏడాదికి రూ 1,13,112కోట్ల అప్పులు
- అప్పులపై వడ్డీ చెల్లింపులకే రూ లక్ష కోట్లు వ్యయం చేయాల్సిన దుస్థితి.
- జిఎస్ డిపి అవుట్ పుట్ 24% తగ్గిపోతుందని ఎస్ బిఐ లాంటి పలు ఏజెన్సీల హెచ్చరికలు
- జిఎస్ డిపిలో దవ్యలోటు నిష్పత్తి 9-10%కు చేరినా ఆశ్చర్యం లేదు.
- తెచ్చిన అప్పులు అభివృద్దిపై పెట్టడం లేదు.
- జగన్ అనుచరులకే పంచిపెడుతున్నారు.
- ప్రచార ప్రకటనల ఆర్భాటం ఖర్చుకే ప్రాధాన్యం.
- పేదల ఖాతాల్లో పడే నగదు అరకొరే..
- అర్హులలో మూడొంతుల మందికి ఎగ్గొడుతున్నారు.
- ఒక చేత్తో ఇచ్చినట్లే ఇచ్చి, 2చేతులతో గుంజుకుంటున్నారు
- అటు అప్పుల భారం, ఇటు పన్నుల భారం,
- మరోవైపు కరోనా భారం, ఇంకోవైపు వైసిపి అవినీతి భారంతో కోట్లాది ప్రజలు కుంగిపోయారు.
- అభివృద్ది శూన్యం, సంక్షేమం శూన్యం, ఉపాధి శూన్యం, పెట్టుబడులు శూన్యం, ప్రగతి శూన్యం
- జీరో గవర్నెన్స్ కు ప్రతిబింబంగా జగన్ రెడ్డి పాలన
- జగన్మోహన్ రెడ్డి అనుచరుల ఆర్ధికాభివృద్ది మాత్రం బ్రహ్మాండం.
- రాష్ట్ర ఆర్ధికాభివృద్దిని గాలికి వదిలేసి జగన్ అనుచరుల ఆర్ధికాభివృద్దికే పెద్దపీట.
- పేదల ఆర్ధికాభివృద్దికి గండికొట్టి, పెద్దలకు దోచిపెడ్తున్నారు.
- రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన ముఖ్యమంత్రిగా చరిత్రలో జగన్ రెడ్డి నిలిచిపోతారు.