Live Updates: ఈరోజు (సెప్టెంబర్-30) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 30 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-09-30 01:15 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు బుధవారం | 30 సెప్టెంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | చతుర్దశి: రా.11-29 వరకు తదుపరి పౌర్ణిమ | పూర్వాభాద్ర నక్షత్రం రా.1-41వరకు తదుపరి ఉత్తరాభాద్ర | వర్జ్యం: ఉ.8-28 నుంచి 10-12 వరకు | అమృత ఘడియలు: సా.6-49నుంచి 7-46 వరకు | దుర్ముహూర్తం: ఉ.11-32 నుంచి 12-31 వరకు | రాహుకాలం: మ.12-00 నుంచి 1-30 వరకు | సూర్యోదయం: ఉ.5-53 | సూర్యాస్తమయం: సా.5-50

ఈరోజు తాజా వార్తలు

Live Updates
2020-09-30 13:18 GMT

విజయవాడ..

-వైద్య ఆరోగ్య శాఖామంత్రి, ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని)

-ప్రజలందరి సహకారంతోనే కోవిడ్ ను అరికట్టగలుగుతున్నాం

-ప్రతిపక్ష నేత చంద్రబాబు బాధ్యత లేకుండా ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకోవాలని చూస్తున్నారు

-చంద్రబాబు ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారు

-ప్రజలందరూ విపత్కర పరిస్థితులలో ఉంటే చంద్రబాబు దుష్ప్రచారం తగదు

-కోవిడ్ ను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చాం

-చంద్రబాబు రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి గద్దె దిగిపోయారు

-మేనిఫెస్టోలో పొందుపరచిన అన్నీ నెరవేరుస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్

-చంద్రబాబు కనుక ఈ సమయంలో సీఎం అయితే రాష్ట్రం పరిస్ధితి ఎంతో దయనీయంగా ఉండేది

-కరోనా పాజిటివ్ కేసుల రేటు గణనీయంగా తగ్గింది

-చంద్రబాబు ఈ ఒకటిన్నర సంవత్సర కాలంలో ప్రతిపక్ష పాత్ర పోషించలేదు

-సద్విమర్శను మనస్ఫూర్తిగా స్వీకరిస్తాం

2020-09-30 13:15 GMT

కృష్ణాజిల్లా..

-కారుకి దుర్గా మల్లేశ్వర దేవస్థానం బోర్డు తగిలించి తెలంగాణ నుంచి అక్రమ మద్యం

-అధిక ధరలకు ఆంధ్రాలో అమ్ముతున్నారని సమాచారం

-స్పెషల్ బ్రాంచ్ పోలీసులు వలలో దోషులు

-సుమారు 283 మద్యం బాటిల్స్ విలువ 40000 రూపాయలు

-చక్కా నాగ వరలక్ష్మి, దుర్గ గుడి సభ్యురాలి పేరిట కారు

2020-09-30 13:13 GMT

-శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ట్ర‌స్టుకు బుధ‌వారం ఒక కోటి రూపాయ‌లు విరాళంగా అందిన శ్రీ‌మ‌తి కామాక్షి శంక‌ర్

-విరాళం డిడిని శ్రీ‌వారి ఆల‌యంలో టిటిడి అద‌న‌పు ఈవో, ఎస్వీబీసీ ఎండి ఎవి.ధ‌ర్మారెడ్డికి అంద‌జేసిన దాత

2020-09-30 13:09 GMT

తూర్పుగోదావరి - రాజమండ్రి..

-బిజేపీ అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి కామెంట్స్..

-2024 లోబిజేపీ-జనసేన కలిసి అధికారంలోకి రావాలనే లక్ష్యం గా పనిచేస్తున్నాం

-రాష్ట్రంలో అధికార వైసీపీ ప్రభుత్వంపై ప్రజలలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది

-రాష్ట్ర వ్యాప్తంగా బూత్ స్థాయి నుంచి బిజేపీని బలోపేతం చేసేందుకే విస్తృత పర్యటనలు చేస్తున్నాం..

-రాష్ట్ర ప్లభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడతాం

-చంద్రబాబు గురించి మాట్లాడేవారే లేరు

-ప్రధాని మోఢీ పట్ల ప్రజలలో ఎంతో నమ్మకం వుంది. కేంద్ర పధకాలకే ఏపీలో స్టిక్కర్లు వేసుకుంటున్నారు..

2020-09-30 13:07 GMT

విజయవాడ..

-వాణి మోహన్ పురావస్తు శాఖ కమిషనర్

-గత 10సంవత్సరాలుగా మూతబడి ఉంది

-రేపు సీఎం ప్రారంభిస్తారు

-అనేక గ్యాలరీలు ఉన్నాయి

-హిందు , బుద్ధ, అది మానవుడు వినియోగించిన వస్తువులు ఉన్నాయి

-విక్టోరియా స్మారక భవనం ఇండో యూరోపియన్ వాస్తు కళను పొలివుంటుంది

-8కోట్ల కేంద్ర, రాష్ట్ర భాగస్వామ్యంలో మ్యూజియం అభివృద్ధి

-మొత్తం 6గ్యాలరీలో మ్యూజియం ఏర్పాటు

2020-09-30 13:04 GMT

కడప :

-రైల్వేకోడూరులొ 6.90 కోట్ల వ్యయం తో నూతనం గా నిర్మించిన కోడూరు-చిట్వెలు హై లెవెల్ బ్రిడ్జిని ప్రారంభించిన రోడ్లు, భవనాల శాఖ మంత్రి   శంకరనారాయణ..

-పాల్గొన్న రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు...

-రోడ్లు,భవనముల శాఖ మంత్రి శంకర నారాయణ కామెంట్స్...

-కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు సహాయక చర్యలు అందిస్తూ సీఎం వైఎస్ జగన్ ఎనలేని సేవలు చేశారు...

-సీఎం వైఎస్ జగన్ ముందుచూపు వల్లే వాలంటరీ వ్యవస్థ కరోనా సమయంలో ఎంతగానో ఉపయోగపడింది.

-ప్రభుత్వం చేసే మంచి పనులు చూసి ఓర్వలేకే

-తెలుగుదేశం నాయకులు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు..

-సీఎం వైఎస్ జగన్ ను ప్రజల నుండి ఎవరూ వేరు చేయలేరు..

-చంద్రబాబువి నీచ రాజకీయాలు..

-అందుకే ప్రజలు టీడీపీని 23 సీట్లకే పరిమితం చేశారు.

-చంద్రబాబు ఇకనైనా బుద్ధి తెచుకోవాలి..

-లేకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ది చెబుతారు.

2020-09-30 12:16 GMT

అమరావతి...

-నాడు–నేడు కార్యక్రమంలో ఆస్పత్రులలో చేపడుతున్న మార్పులతో పాటు, కొత్తగా ఏర్పాటు చేస్తున్న వైద్య కళాశాలల ప్రస్తుత పరిస్థితిని తెలుసుకున్న సీఎం   జగన్.

-సమీక్షా సమావేశంలో సీఎం వైయస్‌ జగన్‌ కామెంట్స్..:

-అన్ని ఆస్పత్రులలో అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉండాలి.

-వాటి నిర్మాణ విషయంలో ఎక్కడా రాజీ పడొద్దు.

-ఆస్పత్రికి వచ్చే రోగులకు అక్కడ కార్పొరేట్‌ లుక్‌ కనిపించాలి.

-చరిత్రలో నిల్చిపోయే విధంగా వాటి నిర్మాణం జరగాలి.

-మూడేళ్లలో అన్ని ఆస్పత్రుల నిర్మాణాలు పూర్తి కావాలి.

-తద్వారా ఏ సమస్య తలెత్తినా వెంటనే పరిష్కారం అవుతుంది.

2020-09-30 12:01 GMT

అమరావతి....

మంత్రి బొత్స సత్యనారాయణ పీసీ..

-ఇప్పుడు అవి తమ పథకాలు అని టిడిపి నాయకులు సిగ్గు లేకుండా చెపుతున్నారు

-బిసిల ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేలా చేస్తాం అని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు

-అన్ని కులాలకు కార్పొరేషన్ లు ఏర్పాటు చేస్తాం అని జగన్ హామీ ఇచ్చారు

-139 కులాల్లో 56 కులాలకు కార్పొరేషన్లు అవసరం అని సీఎం కు గతంలో నివేదిక ఇచ్చాం

-ఇంకొక వారం రోజుల్లోపూ బిసి కార్పొరేషన్ల ప్రకటన ఉంటుంది

-అందులో సగ భాగం కార్పోరేషన్ ఛైర్ పర్సన్ లుగా మహిళలే ఉంటారు

-మహిళా సాధికారత కోసం జగన్ ప్రభుత్వం కృషి చేస్తుంది

-డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తాం అని చెప్పి మోసం చేసిన ఘనత చంద్రబాబుది

2020-09-30 09:49 GMT

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద.

10 క్రస్టుగేట్లు 5 ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు

ఇన్ ఫ్లో : 1,26,015 క్యూసెక్కులు.

అవుట్ ఫ్లో :1,26,015 క్యూసెక్కులు.

పూర్తిస్థాయి నీటి నిల్వ: 312.0450 టీఎంసీలు.

ప్రస్తుత నీటి నిల్వ : 311.7462 టీఎంసీలు.

పూర్తిస్థాయి నీటిమట్టం:590 అడుగులు.

ప్రస్తుత నీటిమట్టం: 589.90అడుగులు

2020-09-30 09:47 GMT

కృష్ణాజిల్లా: యువతకు గంజాయి అమ్ముతున్న పది మందిని అదుపులోకి తీసుకున్న అవనిగడ్డ పోలీసులు

పది కేజీల గంజాయి, 5200 రూపాయల నగదు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం

జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో యువతను టార్గెట్ చేసి గంజాయి విక్రయిస్తున్నట్లు తెలిపిన పోలీసులు

విశాఖపట్నం జిల్లా పెద్దవలస గ్రామానికి చెందిన కంకిపాట రాధామాధవరావు గంజాయి అందిస్తున్నట్లు సమాచారం

ఉదయం పులిగడ్డ వద్ద మాధవరావు అనే వ్యక్తికి గంజాయి విక్రయిస్తూ పట్టుబడ్డారు

దాదాపు 200 మంది యువతను గంజాయి బానిసలను చేసినట్లు గుర్తించిన పోలీసులు

D- Addiction నిమిత్తం వారి తల్లిదండ్రులు, N.G.O వారి సహాయంతో యువతకు కౌన్సిలింగ్ కు జిల్లా ఎస్పీ దిశానిర్దేశం

అదుపులోకి తీసుకున్న నిందితుల వివరాలు

1. మహమ్మద్.షాహాష, గుడివాడ

2. బొమ్మ రెడ్డి.సందీప్ రెడ్డి, పామర్రు

3. పోరంకి. రాకేష్, ఉయ్యూరు

4. బొమ్మ రెడ్డి. వరుణ్ శివ సాయి రెడ్డి, చాగంటిపాడు

5. వాడపల్లి.రామకృష్ణ, ఉయ్యూరు

6. పరిమి కాయల. శ్రీనివాసరావు, కూచిపూడి

7. వెలివెల. వెంకటరమణ, కొడాలి

8. జగన్నాథం గోపి, నాగాయలంక

9. జన్ను. సాయి లీల, నంగే గడ్డ.

Tags:    

Similar News