AYYANNA PATHRUDU: విజయ్ సాయిరెడ్డి పై అయ్యన్న పాత్రుడు ఫైర్
విశాఖపట్నం: రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి పై పలు విమర్శలు కురిపిస్తు ఒక వీడియో విడుదల చేసిన మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు..
- మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కుటుంబ సభ్యుల గురించి మాట్లాడడానికి మీకు ఏమాత్రం అర్హత లేదని విజయ్ సాయిరెడ్డి ఆరొపణలు
- భారతీయ జనతా పార్టీ నాయకురాలు పురందేశ్వరి గురించి మీరు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది
- 286 రొజులనుంచి అమరావతి రైతులు ధర్నా చేస్తుంటే కనీసం మీ పాలక వర్గం నుంచి ఒకరైనా వారిని పరామర్శించారని ప్రశ్నించారు
- విశాఖపట్నం లో భూ దోపిడీలు ఎక్కువగా జరుగుతున్నాయి
- దానిపై మీ స్పందన తెలియ చేయాలని డిమాండ్
కృష్ణా జిల్లా కలెక్టర్ పై కోర్టు ధిక్కార పిటిషన్
అమరావతి: కృష్ణాజిల్లా కలెక్టర్ ఇంతియాజ్ పై కోర్ట్ ధిక్కార పిటిషన్ దాఖలు
జగ్గయ్యపేటలో 5.60 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసారంటూ 2019లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది శ్రావణ్ కుమార్ .
లాండ్ ఆక్రమణపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు 2019లో ఆదేశించిన హైకోర్టు
హైకోర్ట్ ఆదేశించిన చర్యలు చేపట్టడం లేదంటూ కోర్ట్ దృష్టికి తీసుకెళ్లిన న్యాయవాది శ్రావణ్ కుమార్..
AP Assembly Sessions: అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే యోచనలో ఏపీ ప్రభుత్వం
అమరావతి: అక్టోబర్ 10 తర్వాత నిర్వహించాలని భావిస్తున్న సర్కార్
గురువారం జరిగే క్యాబినెట్ లో నిర్ణయం తీసుకునే అవకాశం
ANDHRA PRADESH: గవర్నర్ తో ముగిసిన ఏపీసీసీ నేతల భేటీ
విజయవాడ: రాజ్ భవన్ లో గవర్నర్ తో ముగిసిన ఏపీసీసీ నేతల భేటీ
ఏపీసీసీ చీఫ్ శైలజానాథ్ కామెంట్స్
రైతుల తరపున కాంగ్రెస్ పార్టీ నేతలు గవర్నర్ ని కలిశాం
పేదవాడి ఆకలి తీర్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది
Msp లేకుండా, ప్రోక్యూర్మెంట్స్ లేకుండా కార్పొరేట్స్ దయ దాక్షిణ్యాలతో బ్రతికే వైఖరిని మేము ఖండిస్తున్నాము
వైసీపీ కూడా బీజేపీ తో కలిసి పోయింది
కరెంట్ మీటర్లు బిగించి రైతుల మెడకు ఉరి తాడు బిగిస్తున్నారు
ఈ బిల్లులు వెనక్కి తీసుకునే వరకు మా పోరాటం కొనసాగుతుంది
నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా దీని గురించి కార్యక్రమాలు చేయబోతున్నాం
Amaravati updates: మరి కొద్దిసేపట్లో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వైఎస్ జగన్ స్పందన కార్యక్రమం..
అమరావతి..
-క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించనున్న సీఎం
-కోవిడ్ 19 నివారణా చర్యలు, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ సన్నద్దతపై సమీక్ష
-రబీ పంటల సాగుపై ప్రణాళిక, వ్యవసాయ సలహా కమిటీల సమావేశాల నిర్వహణపై సమీక్ష
-గ్రామ సచివాలయాలు, ఆర్‌బీకేలు, వైఎస్‌ఆర్ హెల్త్ క్లీనిక్స్ భవన నిర్మాణాల పురోగతి తెలుసుకొనున్న సీఎం
-నాడు–నేడులో భాగంగా పాఠశాలలు, అంగన్‌వాడీలు, ఆసుపత్రుల అభివృద్ధిపై సమీక్ష
-గ్రామ, వార్డు సచివాలయాలు పనితీరును సమీక్షించనున్న సీఎం
-భారీ వర్షాలు, వరదలు, పంట, ఆస్తినష్టం అంచనాపై దిశా నిర్దేశం చేయనున్న సీఎం
Vijayawada updates: వ్యవసాయ బిల్లు ను వెంటనేరద్దు చేయాలంటూ రాజ్ భవన్ వద్దకు చేరుకున్న కాంగ్రెస్ నాయకులు...
విజయవాడ..
-వ్యవసాయ బిల్లు ను వెంటనేరద్దు చేయాలంటూ ఆంధ్ర రత్న భవన్ నుండి ర్యాలీగా రాజ్ భవన్ వద్దకు చేరుకున్న కాంగ్రెస్ నాయకులు...
-ఏపీసీసీ అధ్యక్షుడు శైలజనాధ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి, సీనియర్ నేత జెడి శీలం, ఏపీసీసీ ఉపాధ్యక్షుడు గంగాధర్..
-వ్యవసాయ బిల్లు పై ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ని కలిసి మెమరండం ఇవ్వనున్న కాంగ్రెస్ నాయకులు...
Visakha updates: దీక్షా శిబిరంలో పాల్గొన్న సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ...
విశాఖ..
-కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వామపక్ష పార్టీల నిరసన దీక్ష.
-సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ కామెంట్స్
-కేంద్రం కార్పొరేటు కంపెనీలకు కమ్ము కాస్తుంది.
-ఫెడరల్ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం వ్యవహారిస్తుంది.
-రాబోయే రోజుల్లో రైతాంగం కూలీలిగా మారుపోతారు.
-నిత్యావసర వస్తువులు నిల్వ ఉంచి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు.
-రాష్ట్రాలను స్వేచ్ఛ లేకుండా ఉత్సవ విగ్రహాలుగా కేంద్రం మారుస్తుంది.
-ఏపిలో టిడిపి,వైపిలు స్వార్థ రాజకీయాలు వలన రాష్ట్రానికి నష్టం జరుగుతుంది.
-జగన్ మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళడం వలన ముఖ్యమంత్రి అయ్యారు.
-చంద్రబాబు కేంద్రానికి ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదు?
Vijayawada update: ప్రకాశం బ్యారేజ్ వరద ముంపు...
విజయవాడ..
-ప్రకాశం బ్యారేజ్ ఇన్ ఫ్లో 6లక్షల 2 వేల క్యూసెక్కులుండగా, ఔట్ ఫ్లో 5లక్షల 95వేలు
-కృష్ణా ఈస్ట్రన్ అండ్ వెస్ట్రన్ కాల్వలకు సాగునీటి అవసరాల మేరకు 7 వేల క్యూసెక్కులు
-వరద నీటి ముంపు లోనే ఉన్న విజయవాడ లోని తారకరామ నగర్, భుపేష్ గుప్త నగర్, బాలాజీనగర్, రామలింగేశ్వర నగర్ ప్రాంత వాసులు
-పునరావాస శిబిరాల్లో తలదాచుకున్న కున్న నిర్వాసితులు
Visakha updates: అంబేద్కర్ విగ్రహాం వద్ద గిరిజన ఉద్యోగుల సంఘం ఆందోళన..
విశాఖ..
-ఆంధ్ర,తెలంగాణ మన్యం బంద్ మద్ధతుగా విశాఖ ఎల్ ఐ సి భవనం అంబేద్కర్ విగ్రహాం వద్ద గిరిజన ఉద్యోగుల సంఘం ఆందోళన.
-జీవో నెంబరు 3 ని అమలు చేయాలంటూ డిమాండ్.
Amaravati updates: టీడీపీ అధినేత చంద్రబాబు లేఖకు స్పందించిన డీజీపీ గౌతం సవాంగ్..
అమరావతి...
-ఘాటుగా ప్రత్యుత్తరం రాసిన డీజీపీ
-జడ్జి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై జరిగిన దాడిలో వాస్తవాలకు విరుద్ధంగా మీ లేఖ ఉంది
-దాడిచేసిన ప్రతాప్ రెడ్డీ టీడీపీకి బలమైన అనుచరుడిగా విచారణలో తేలింది
-ఇద్దరి మధ్య జరిగిన వివాదం లో రామచంద్ర స్వల్పంగా గాయపడ్డారు
-ఆ సమయంలో రామచంద్ర మద్యం సేవించి ఉన్నారు
-రామచంద్ర ఫిర్యాదుపై వెంటనే ఎఫ్ ఐ అర్ నమోదు చేసి విచారణ చేసారు
-సాక్షుల వాంగ్మూలం ,సీసీ కెమెరా ఫుట్ఠేజ్ ల ఆధారంగా ప్రతాప్ రెడ్డీ నీ అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచాము
-పోలీస్ డిపార్ట్మెంట్ చట్టం ప్రకారం పనిచేస్తుంది
-అనుమానాలు రేకెత్తించే విదంగా లేఖలను పోస్ట్ చేయకుండా ఉండాలని అభ్యర్థిస్తున్నాను
-మీకేమన్నా అనుమానాలు ఉంటే సీల్డ్ కవర్లో లేఖ పంపితే విచారణ చేస్తాము