Live Updates: ఈరోజు (సెప్టెంబర్-29) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 29 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-09-29 01:31 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు మంగళవారం | 29 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | త్రయోదశి: రా.10-21వరకు తదుపరి చతుర్దశి | శతభిష నక్షత్రం రా.1-41వరకు తదుపరి పూర్వాభాద్ర | వర్జ్యం: ఉ.7-55 నుంచి 9-36 వరకు | అమృత ఘడియలు: సా.6-04 నుంచి 7-46 వరకు | దుర్ముహూర్తం: ఉ.8-16 నుంచి 9-04 వరకు తిరిగి రా.10-39 నుంచి 11-27 వరకు | రాహుకాలం: మ.3-00 నుంచి 4-30 వరకు | సూర్యోదయం: ఉ.5-53 | సూర్యాస్తమయం: సా.5-50

ఈరోజు తాజా వార్తలు

Live Updates
2020-09-29 16:24 GMT

జాతీయం

- వాణిజ్య శాఖ కమిటీ చైర్మన్ గా మరోసారి వై ఎస్ ఆర్ సి పి పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి

- పరిశ్రమల శాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు

- రవాణా పర్యాటక సాంస్కృతిక శాఖ స్టాండింగ్ కమిటీ చైర్మెన్గా బీజేపీ ఎంపీ టిజి వెంకటేష్ లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ.

2020-09-29 14:41 GMT

తూర్పు గోదావరి జిల్లా..

అమలాపురం..

-సమనస స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో బంగారు ఆభరణాలు లేకుండా కోటి నిధుల గోల్మాల్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన బ్యాంకు ఉన్నతాధికారులు

-బ్యాంక్ క్యాషియర్ బీవీ సత్య సుబ్రహ్మణ్య శర్మ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎస్ బి ఐ రీజనల్ మేనేజర్ కోల జగదీశ్వర్ రావు

-కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న అమలాపురం పోలీసులు

2020-09-29 14:33 GMT

ఢిల్లీ:

-రాష్ట్రపతికి, ప్రధానికి సినీనటి జయప్రద లేఖలు..

-ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం కు “భారత రత్న” పురస్కారం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ రాష్ట్రపతి,

-ప్రధానికి సినీ నటి జయప్రద లేఖలు.

- “భారత రత్న” పురస్కారం ప్రదానం చేయడం ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యంకి ఘనమైన నివాళులని లేఖలో పేర్కొన్న జయప్రద.

-సినీ సంగీతానికి, భారత చలన చిత్ర పరిశ్రమ కి ఎస్.పి.బి చేసిన ఎనలేని సేవలు చేశారని లేఖలో వివరించిన జయప్రద.

2020-09-29 14:02 GMT

గుంటూరు జిల్లా..

-నరసరావుపేట మండలం పెదరెడ్డిపాలెం లో ఇద్దరు క్రికెట్ బుకీలను అదుపులోకి తీసుకున్న నరసరావుపేట రూరల్ పోలీసులు.

-బుకీలు నుండి 2 లక్షల 58 వేలు నగదు,13 సెల్ ఫోన్లు,ఒక లాప్ టాప్ స్వాధీనం చేసుకున్న పోలీసులు.....

2020-09-29 13:57 GMT

అనంతపురం:

ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి:

-డిస్ట్రిబ్యూటర్ లకి నీరు రావడం లేదు. వచ్చే ఏడాది కి హంద్రీనీవా కింద ఆయకట్టు కి ఇవ్వండి.

-ఎంపీఆర్ డ్యాం కింద ఆయకట్టు కు నీరు ఎప్పుడు ఇస్తారో తెలియదు.

-అజెండా లో సమగ్ర సమాచారం లేదు. ముందుగా నీళ్లు ఇవ్వకపోతే రైతులు నష్టపోతారు.

2020-09-29 13:50 GMT

పశ్చిమ గోదావరి జిల్లా..

-పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం కొవ్వురు నందమూరు రోడ్లో గల ఎమ్. వి. ఆర్ రైస్ మిల్లు ఆవరణలో ఏర్పాటు చేసిన

-ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో డివిజన్ స్థాయిలో జరుపుతున్న ఉచిత మెగా పశు వైద్య శిబిరం లో పాల్గొన్న రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి     తానేటి వనిత.

-పశుగ్రాసాల సాగు, దాని ఆవశ్యకత పై మరియు జాతీయ కృత్రిమ గర్భధారణ కార్యక్రమ అవగాహన సదస్సు లో పాల్గొన్న మంత్రి తానేటి వనిత.

2020-09-29 13:45 GMT

విశాఖ..

టీడీపీ ఎమ్మెల్యే గణబాబు కామెంట్స్:

-సంవత్సరకాలంగా నష్టపోయి కష్టపడుతున్న కార్మికులను ఆదుకోండి

-ఇప్పటికే ఇసుక కొరత కారణంగా ఆరు నెలలు పాటు నిర్మాణ రంగం కుదేలయింది

-ఇప్పుడు కరోనా కారణంగా దాదాపు ఫిబ్రవరి నెల నుండి మళ్ళి పనులు కోల్పోయి కష్టపడుతున్నారు .

-వారి సంక్షేమ నిధిని విడుదల చేయకుండా , నెలలు తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది

-సిఎం జగన్, కార్మిక శాఖ మంత్రి కి గణబాబు వినతి

2020-09-29 13:41 GMT

విజయవాడ..

కన్నబాబు....ఏపీ వ్యవసాయ శాఖా మంత్రి:

-ప్రభుత్వం ఆర్ధిక సంక్షోభం లో ఉండే పరిస్థితి వస్తుందని అనవసర ప్రచారం చేస్తున్నారు.

-ప్రస్తుతం చంద్రబాబు మతాన్ని ఎంచుకుని. దారుణ ప్రచారం చేస్తున్నారు

-అంతర్వేది రథం సంఘటన పై ఇంకా రాజకీయం చేస్తున్నారు.

-ప్రతిదీ రాజకీయం చేసి బురద చల్లే కార్యక్రమం చేస్తున్నారు.

-జరిగిన దాడుల ఘటనల వెనుక టీడీపీ హస్తం ఉందని విచారణలో తేలినట్టు నాకు సమాచారం ఉంది

-డిజిపి ని ఇష్టారాజ్యంగా చంద్రబాబు విమర్శలు చేస్తున్నారు.

-పోలీస్ వ్యవస్థ ను దిగ జార్చారని బాబు మాట్లాడ్డం తప్పు.

-ప్రజల్లో వ్యవస్థ ల గొప్పతనాన్ని దిగ జారుస్తున్నారు బాబు..

-చంద్రబాబు ను ఇలాగే వదిలేస్తే అమ్మఒడి....ఆరోగ్య శ్రీ కూడా తన పథకాలే అంటారు.

2020-09-29 13:36 GMT

అమరావతి..

-మాజీ జడ్జి రామ కృష్ణ విషయంలో పదే పదే చంద్రబాబు నా ప్రస్తావన తెస్తున్నారు.

-నేను హరిజనులకు వ్యతిరేకినని నాపై ముద్ర వేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.

-జడ్జి రామకృష్ణ తమ్ముడిపై దాడి చేసింది టీడీపీ నేతలే.

-జడ్జి రామకృష్ణ విషయంలో చంద్రబాబు వాస్తవాలు తెలుసుకోండి.

-జడ్జి రామ కృష్ణను అడ్డం పెట్టుకొని చంద్రబాబు రాజకీయాలు చెయ్యాలని చేస్తున్నారు.

-టీడీపీ కి చెందిన ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి జడ్జి రామకృష్ణ తమ్ముడిపై దాడి చేశారు.

-నాపై పదే పదే విమర్శలు చేసిన చంద్రబాబు దీనికి ఏమి సమాధానం చెప్తారు.

-డిజిపి రాసిన లేఖకు చంద్రబాబు సమాధానం చెప్పాలి

-ప్రభుత్వం,పార్టీ దళితులకు వ్యతిరేకమనే ముద్ర వేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.

-కొందరు మీడియా ప్రతినిధులు వాస్తవాలు తెలుసుకోవాలి: మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్ర రెడ్డి..

2020-09-29 13:29 GMT

అనంతపురం:

-వాడి వేడిగా ఐఏబీ సమావేశం.

ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి:

-పేరురు డ్యాం కు ఒక టీఎంసీ నీరు ఇస్తామని గత మీటింగ్ లో చెప్పారు అజెండాలో తగ్గించారు.

-పిఎబిఆర్ డ్యాం కింద లక్ష ఎకరాల ఆయకట్టు కు నీరివ్వాలి.

-పిఎబిఆర్ లో నీటినిల్వ సామర్థ్యము పెంచే చర్యలు తీడుకోండి.

-హెచ్ ఎల్ సి ఆధునికీకరణ పూర్తి చేయండి.

-ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి: హంద్రీనీవా సెకండ్ ఫేజ్ పనులు పూర్తి చేయాలి.

-నియోజకవర్గం లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. చెరువులకు నీరు ఇచ్చి ఆదుకోండి.

Tags:    

Similar News