Amaravati updates: ఏపీ సచివాలయంలో ఉద్యోగాల పేరిట నకిలీ ఆర్డర్స్ విషయంలో నలుగురిని అరెస్ట్ చేసిన తుళ్ళూరు పోలీసులు..
అమరావతి..
-పరారీలో ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు
-నలుగురు ముద్దాయిలను కోర్టులో హాజరుపరిచిన
-పోలీసులు...రిమాండ్ కి తరలింపు
-పౌర సరఫరాల శాఖ లో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పిస్తానని తన వద్ద 3 లక్షలకు పైగా వసూలు చేశారని ఏ గయ్య అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు
Chittoor updates: ఎస్ ఎస్ డిజిటల్ జోన్ లో సర్వర్ మొరాయింపు...
చిత్తూరు..
-సుమారు అరగంటకు పైగా విద్యార్థులు పడిగాపులు
-తెలంగాణ ఎంసెట్ ఆన్లైన్ పరీక్ష రాయడానికి వచ్చిన విద్యార్థులను నిలబెట్టిన సిబ్బంది...
-పిల్లలను లోనికి అనుమతించకుండా నిలబెట్టడం తో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన...
-సిబ్బందికి తల్లిదండ్రులకు కొద్దిసేపు వాగ్వాదం...
Amaravati updates: హైకోర్టును ఆశ్రయించిన ఆన్ -ఎయిడెడ్ స్కూ ల్స్ యాజమాన్యం..
అమరావతి..
-ప్రభుత్వం జారీ చేసిన 155 మెమోను సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్ పై విచారణ..
-155 మెమోను సస్పెండ్ చేయాలని కోరుతూ న్యాయవాది వాదనలు..
-ప్రవేట్ స్కూల్లోని విద్యార్థుల డేటాను యాజమాన్యానికి తెలియ కుండా తొలగిస్తున్నారన్న న్యాయవాది..
-పూర్తి వివరాలతో కౌoటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశం..
-తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా..
Vizianagaram updates: నవోదయ స్కూల్ సమీపంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి..
విజయనగరం ...
-శృంగవరపుకోట మండలం నవోదయ స్కూల్ సమీపంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి..
-7గురు పేకాట రాయుళ్ళను, వారివద్ద నుండి 46 వేల రూపాయల నగదును, నాలుగు మోటార్ సైకిళ్ళను, ఆరు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు.
Kurnool updates: కేసి కెనాల్ కరకట్ట ను పరిశీలించిన ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి....
కర్నూలు జిల్లా..
-నంద్యాల మహానంది మండలంలో వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో పర్యటిస్తున్న శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి....
-బొల్లవరం గ్రామం వద్ద కేసి కెనాల్ కరకట్ట ను పరిశీలించిన ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి....
-భారీ వర్షాలకు మహానంది మండలంలో పంటనష్టం వాటిల్లిన ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి....
Visakha updates: భూములను అక్రమించి,పేదలకు ఇద్దాం: సిపిఐ నారాయణ!
విశాఖ..
-కొమ్మాదిలో ఆక్రమణకు గురైన ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని పరిశీలించిన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ
-రెండు సంవత్సరాల్లో ఉత్తరాంధ్రా ఫ్యాక్షనిజం ప్రాంతంగా మారడం ఖాయం.
-చట్టబద్ధంగా కాపురం చెయ్యాలి కాని ,చట్ట విరుద్ధంగా కాపురం చేస్తే ఎలా?
-మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావే ఈ భూమి వెనుక బినామి.
-భూదొంగలను కాపాడడానికే ప్రభుత్వాలు పని చేస్తున్నాయి.
-భూ దొంగలకు ఈ ప్రభుత్వం వత్తాసు పలుకుతుంది: సిపిఐ నారాయణ..
Tammineni Sitaram Comments: నెంబర్ 1 రేటింగ్ లో నిలిచిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్..
శ్రీకాకుళం జిల్లా..
స్పీకర్ తమ్మినేని సీతారాం కామెంట్స్..
-దేశంలో ప్రధానమంత్రితో ప్రశంశలు అందుకుని నెంబర్ 1 రేటింగ్ లో నిలిచిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్..
-పాదయాత్ర సమయంలో సముద్రపు అలల మాదిరిగా ప్రజలు జగన్ వెంట నడిచారు..
-ఆనాటి ప్రభుత్వం ప్రజలు ఎలా బ్రతుకుతున్నారు అని కూడా పట్టించుకోలేదు..
-ప్రజల కష్ట సుఖాలు చూడకుండా జన్మభూమి కమిటీలు ప్రజల నెత్తిన రుద్దారు..
-దొరికింది దొరికినట్టుగా, పొడుగుచేతుల వాడిదే పలహారం అన్నట్లుగా జన్మభూమి కమిటీలు పేరుతో దోపిడీ చేశారు..
-ప్రజలు అన్నీ గమనించారు..
-151 స్థానాలతో వైసీపీకి పట్టం కట్టి.. తెలుగుదేశం అప్రజాస్వామిక, అధర్మ ప్రభుత్వాన్ని మట్టికరిపించారు..
Anantapur updates: కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో సాగునీటి సలహా మండలి సమావేశం..
అనంతపురం:
-తుంగభద్ర హై లెవెల్ కెనాల్ నీటి కేటాయింపులు, హంద్రీనీవా నీటి వాటాల కేటాయింపులపై చర్చ.
-అనంతపురం జిల్లా కు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరు.
-తుంగభద్ర నుంచి ఈ ఏడాది 24.98టీఎంసీల కేటాయింపు.
-హంద్రీ-నీవా నుంచి దాదాపు 30 టీఎంసీల వరకు నీరు వచ్చే అవకాశం.
-అనంతపురం జిల్లా తో పాటు కడప జిల్లా పులివెందుల బ్రాంచ్ కెనాల్ కర్నూలు జిల్లా ఆలూరు బ్రాంచ్ కెనాల్ కు నీటి విడుదల పై చర్చ.
-అనంతపురం జిల్లాలో తాగునీటి అవసరాల కోసం 10 టీఎంసీల నీరు కేటాయింపు.
-లక్ష ఎకరాల ఆయకట్టు కు సాగునీరు విడుదల
-ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో ఆయకట్టుకు నీరు విడుదల
-తాగునీటి అవసరాల కోసం హంద్రీ-నీవా నుంచి 5 టిఎంసిలు, తుంగభద్ర హై లెవల్ కెనాల్ నుంచి 5 టిఎంసిలు మళ్లింపు.
-సింగనమల చెరువు కు మిడ్ పెన్నార్ రిజర్వాయర్ ద్వారా హంద్రీ నీవా నీరు ఒక టీఎంసీ కేటాయింపు
-చాగల్లు రిజర్వాయర్ నుంచి 4,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు విడుదల
Anantapur updates: తాడిపత్రి పట్టణంలోని ఆంధ్రబ్యాంక్ లో గొడవ!
అనంతపురం:
-వెంకటాంపల్లి గ్రామానికి చెందిన పుల్లమ్మ అనే మహిళా ఖాతాలో నగదు రూ.30 వేలను అదే గ్రామానికి పుల్లమ్మ అనే మరో మహిళకు ఇచ్చిన అధికారులు.
-వారం రోజుల కిందట ఘటన. తమ ఖాతాలో నగదు పోయిందంటూ బ్యాంక్ అధికారులను సంప్రధించిన పుల్లమ్మ బంధువులు.
-పొరపాటు జరిగిందని గ్రహించిన బ్యాంకు అధికారులు
-డబ్బు తీసుకున్న వ్యక్తి నుంచి రూ.10 వేలు అదే రోజు రికవరీ.
-వారం రోజుల తరువాత రూ.20 వేలు ఇస్తామని సర్ది చెప్పిన అధికారులు.
-వారం గడిచిన తరువాత రూ.20 వేలు ఇవ్వాలని బ్యాంక్ వద్దకు వచ్చిన పుల్లమ్మ బంధువులు.
-బ్యాంక్ ఫిల్డ్ అధికారి గంగాధర్ రెడ్డి తో నగదు ఇవ్వాలని వాగ్వాదం
-ఒకరిపై ఒకరు బ్యాంకులోనే దాడికి దిగడం తో గందరగోళం.
-ఆందోళన కారుల కు సర్ది చెప్పి పంపిన పోలీసులు.
Amaravati updates: కృష్ణా, గుంటూరు, నెల్లూరు కలెక్టర్లతో వరదల పరిస్ధితిని సమీక్షించిన సీఎం..
అమరావతి..
-భారీ వర్షాలు, వరదలు (పంట, ఆస్తినష్టం) అంచనాపై సీఎం జగన్ సమీక్ష
-పంటనష్టం, ఆస్తి నష్టంపై అందరూ కూడా త్వరగా అంచనాలు పంపండి.
-ఆర్‌బీకే లెవల్‌లో ఎన్యూమరేషన్ ఆఫ్ ఫార్మర్స్ డిస్‌ప్లే చేయాలి.
-ఇప్పటివరకూ వరదల్లో 8 మంది చనిపోయినట్లు సమాచారం వచ్చింది వారికి వెంటనే రూ. 5 లక్షలు కలెక్టర్‌లు ఇవ్వాలి.
-కుటుంబానికి తోడుగా ఉండాలి, వెంటనే ఆ కుటుంబాలకు డబ్బు అందించాలి.