Srikakulam district updates: సీతంపేట బంద్ కు పిలుపునిచ్చిన గిరిజనులు..
శ్రీకాకుళం జిల్లా..
-జీవో నెంబర్ 3 ను వెంటనే పునరుద్ధరణ చేయాలని కోరుతూ ఆందోళన..
-అనుమతి లేదని గిరిజనులను అడ్డుకున్న పోలీసులు..
-దోనుబాయి కూడలి వద్ద రోడ్డుపై బైఠాయించి గిరిజనులు ధర్నా..
-ఆదివాసీల ఆందోళనతో నిలిచిపోయిన వాహనాలు..
Prakasam Barrage updates: ప్రకాశం బ్యారేజ్ వద్ద పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ.....
అమరావతి..
-ప్రకాశం బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హచరిక జారీ
-మున్నేరు, వైరా, కట్టలేరు, నుంచి 30 వేల క్యూసెక్కుల వరద నీరు
-ప్రకాశం బ్యారేజ్ ఇన్ ఫ్లో 6లక్షల 2 వేల క్యూసెక్కులుండగా, ఔట్ ఫ్లో 5లక్షల 95వేలు
-కృష్ణా ఈస్ట్రన్ అండ్ వెస్ట్రన్ కాల్వలకు సాగునీటి అవసరాల మేరకు 7 వేల క్యూసెక్కులు
-వరద నీటి ముంపు లోనే ఉన్న విజయవాడ లోని తారకరామ నగర్, భుపేష్ గుప్త నగర్, బాలాజీనగర్, రామలింగేశ్వర నగర్ ప్రాంత వాసులు
-పునరావాస శిబిరాల్లో తలదాచుకున్న నిర్వాసితులు
-నీట మునిగిన పంట పొలాలు
Amaravati updates: రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు!
అమరావతి..
-పూర్తి అయిన కసరత్తు
-వచ్చేనెల మొదటి వారంలో ప్రకటించనున్న చంద్రబాబు
-ప్రధాన కార్యదర్శిగా బీదా రవిచంద్ర, పొలిట్ బ్యూరో లోకి కళా వెంకట్రావు, రాష్ట్రకార్య వర్గంలో కొల్లు రవీంద్రకు చోటు కల్పించనున్న అధిష్టానం
Visakha updates: నేడు రెండు తెలుగు రాష్ట్రా లలో మన్యం బంద్ కి పిలుపు నిచ్చిన గిరిజన జెఎసి సంఘాలు..
విశాఖ..
-గిరిజన ఉద్యోగ సంఘాలు బంద్ కు పిలుపు నివ్వడం తో నిర్మానుష్యంగా మారిన మన్యంలోని చింతపల్లి, పాడేరు, అరకు
-మూతపడిన వ్యాపార సంస్థలు, బంద్ కు మద్దతు పలికిన మావోయిస్టులు
Anantapur updates: ఐసిడిఎస్ లో అక్రమాలపై కలెక్టర్ సీరియస్..
అనంతపురం:
-ప్రభుత్వం సరఫరా చేస్తున్న పాలు, కోడిగుడ్ల, సంపూర్ణ పోషకాహారం దుర్వినియోగం చేశారన్న అభియోగలపై సీరియస్.
-కళ్యాణదుర్గం పట్టణం, మడకశిర మండలం జమ్మనపల్లి, తలపులు మండలం లోని అంగన్వాడీ కార్యకర్తల తొలగింపునకు ఆదేశం
-17 మంది సిడిపిఓ లకు నోటీసులు జారీ
-జాయింట్ కలెక్టర్ సిరి ఆధ్వర్యంలో సమగ్ర విచారణ కు ఆదేశం
Somasila Project: సోమశిల జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం..
నెల్లూరు..
--.ఇన్ ఫ్లో 86 వేల 8వందల క్యూసెక్కు లు.ఔట్ ఫ్లో 94 వేల7 వందల క్యూసెక్కు లు.
-- ప్రస్తుత నీటి మట్టం 73.578 టీఎంసీ లు.పూర్తి నీటి మట్టం 77.988 టీఎంసీ లు
Srisailam project updates: శ్రీశైలం జలాశయంలో క్రమంగా తగ్గుతున్న వరద..
కర్నూలు జిల్లా...
-10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేత
-ఇన్ ఫ్లో : 2,05,017 క్యూసెక్కులు
-ఔట్ ఫ్లో : 3,06,819 క్యూసెక్కులు
-పూర్తి స్థాయి నీటి మట్టం: 885 అడుగులు
-ప్రస్తుతం : 883.90 అడుగులు
-పూర్తిస్దాయి నీటి నిల్వ : 215.8070 టిఎంసీలు
-ప్రస్తుతం: 209.5948 టీఎంసీలు
-కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
Anantapur updates: అక్రమ వాహనాల రిజిస్ట్రేషన్, అమ్మకాలు కేసులో నలుగురిపై ముదిగుబ్బ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు..
అనంతపురం:
-కర్ణాటక నుంచి కార్లను తీసుకొచ్చి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించి విక్రయించారన్న అభియోగలపై కేసు నమోదు
-ముదిగుబ్బ మండలం ఎస్ బ్రాహ్మణ పల్లి కి చెందిన శరత్ బాబు, అనంతపురం డిటిసి కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ మాలిక్ భాష,అడ్మిన్ అధికారి మహబూబ్ బాషా, ఆర్టిఏ ఆన్లైన్ నిర్వహణాధికారి వినోద్ కలిసి అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడినట్లు ఆరోపణలు
Anantapur updates: నేడు అనంతపురం లో నీటిపారుదల సలహా మండలి సమావేశం..
అనంతపురం:
-హాజరుకానున్న అనంతపురం ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, కడప, కర్నూల్ జిల్లాల ప్రజా ప్రతినిధులు.
-తుంగభద్ర నుంచి హెచ్ ఎల్ సి కి వస్తున్న 24.988 టీఎంసీలు,
-హంద్రీ-నీవా నుంచి సుమారు 40 టీఎంసీలు రావచ్చని అంచనా
-తుంగభద్ర డ్యామ్ హెచ్ ఎల్ సి నీటి వాటా కర్నూలు, కడప జిల్లాలకు కేటాయింపులపై చర్చ
-తాగునీటికి తొలి ప్రాధాన్యం హెచ్ ఎల్ సి నుంచి వచ్చే వాటిల్లో 10 టీఎంసీలు తాగునీటికి కేటాయించనున్న అధికారులు
-ఈ ఏడాది ఆలస్యంగా ఐ ఎ బి సమావేశం