Live Updates: ఈరోజు (సెప్టెంబర్-28) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-09-28 01:41 GMT
Live Updates - Page 3
2020-09-28 06:25 GMT

Lakshmi Barrage updates: లక్ష్మీ బ్యారేజ్ కి కొనసాగుతున్న వరద...

జయశంకర్ భూపాలపల్లి జిల్లా..

-46 గేట్లు ఎత్తిన అధికారులు

-పూర్తి సామర్థ్యం 100.00 మీటర్లు

-ప్రస్తుత సామర్థ్యం 95.40 మీటర్లు

-ఇన్ ఫ్లో 4,28,500 క్యూసెక్కులు

-ఔట్ ఫ్లో 4,07,400 క్యూసెక్కులు

2020-09-28 06:12 GMT

Bhupalpally updates: అంతర్రాష్ట్ర వంతెన చెక్ పోస్ట్ వద్ద వాహన తనిఖీలు చేపడుతున్న కాళేశ్వరం పోలీసులు..

జయశంకర్ భూపాలపల్లి జిల్లా:

-మావోయిస్టుల బంద్, మరియు వారోత్సవాల నేపద్యంలో కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన చెక్ పోస్ట్ వద్ద వాహన తనిఖీలు చేపడుతున్న కాళేశ్వరం పోలీసులు.

-ఇరు రాష్ట్రాల నుండి వాహనాలలో రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికుల వివరాలు సేకరించి, అనుమానితులను విచారిస్తున్న పోలీసులు.

-మావోయిస్టు బంద్ మరియు వారోత్సవాల చివరిరోజు కావడంతో ఎలాంటి ఘటనలు జరగకుండా తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు.

2020-09-28 06:09 GMT

Vikarabad District updates: వికారాబాద్ లో కిడ్నాప్ కలకలం..

వికారాబాద్..

-నిన్న రాత్రి వికారాబాద్ ఎమ్మార్పి చౌరస్తా వద్ద అక్కాచెల్లేళ్లు నడుచుకుంటు వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు చెల్లిని కారులోకి లాక్కొని వెళ్లారు..

-యువతి వికారాబాద్ కు చెందిన ఓ మెడికల్ షాపు యాజమాని కూతురు..

-వికారాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన అమ్మాయి కుటుంబ సభ్యులు..

-4 సంవత్సరాల క్రితం ఖలీల్ అలియాస్ అఖిల్ అనే యువకుడిని పెళ్లి చేసుకున్నా దీపిక..

-పెళ్లయిన కొద్ది రోజులకే ఇద్దరు విడిపోయారు..

-దీపికను తన భర్త ఖలీల్ అలియాస్ అఖిల్ తీసుకెళ్లి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు..

-కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నా పోలీసులు.

2020-09-28 06:05 GMT

Bhadradri Kothagudem: చర్ల ఏజెన్సీ లో మావోయిస్టు లకు వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లు...

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..

-చర్ల మండలం చర్ల, కలివేరు, సత్యనారాయణ గ్రామాలలో మావోయిస్టు లకు వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లు

-ఆదివాసీల సమస్య పరిష్కారానికి ప్రజాస్వామ్య పద్దతిలో పోరాడాలంటూ పిలుపు

-నేడు మావోల బంద్ పిలుపు నేపధ్యంలో ఆదివాసీల పేరుతో పోస్టర్ల కలకలం

2020-09-28 06:02 GMT

Kamareddy updates: సదాశివనగర్ మండలంలోని ఉత్తునూరు గ్రామంలో గల శ్రీ కండెరాయ ఆలయంలో చోరీ...

కామారెడ్డి :

-ఆలయ ప్రధాన గేటు తాళాలు పగులగొట్టి ఆలయంలోకి చొరబడిన దుండగులు.

-ఆలయంలో గల ధర్మహుండీని పగలగొట్టి అందులో నగదుతో పాటు లాకర్లో ఉంచిన కిలో వెండి ఎత్తుకెళ్లిన దుండగులు.

-గ్రామస్తుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

2020-09-28 05:59 GMT

Koulas Nala Project updates: కౌలాస్ నాలా ప్రాజెక్ట్ కు కొనసాగుతున్న వరద..

కామారెడ్డి జిల్లా..

-రెండు గేట్లు ఎత్తి నీరు దిగువకు విడుదల

-ఇన్ ఫ్లో 1704 క్యూసెక్కులు

-ఔట్ ఫ్లో 1704 క్యూసెక్కు లు

-పూర్తిస్థాయి నీటిమట్టం 458 మీటర్లు

-ప్రస్తుత నీటిమట్టం 457.90 మీటర్లు

2020-09-28 05:49 GMT

Nizamabad updates: ధర పల్లి మండలం రామడుగు ప్రాజెక్టు వద్ద విషాదం..

నిజామాబాద్ జిల్లా..

-సరదాగా స్నేహితులతో కలిసి ప్రాజెక్టు సందర్శనకు వెళ్లి నవీన్ అనే యువకుడు నీటిలో గల్లంతు

-రెండవ రోజు గజ ఈతగాళ్ల సహాయంతో కొనసాగుతున్న గాలింపు చర్యలు..

2020-09-28 05:45 GMT

Kamareddy district updates: కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 9977 కరోనా పాజిటివ్ కేసుల నమోదు..

కామారెడ్డి జిల్లా :

-ఇప్పటివరకు 69 మంది మృతి చెందగా, 3672 మంది డిశ్చార్జ్ .

-ప్రస్తుతం 6236 కరోనా పాజిటివ్ కేసులు .

2020-09-28 04:10 GMT

Nizamabad updates: బాబ్లీ గేట్లు మూసెందుకు మహా రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన...

నిజామాబాద్ :

-వరదలు వస్తున్నందున గేట్లు మూసెందుకు అనుమతి కోరిన మహా ఇంజనీర్లు.

-నెల గడువుకు ముందే గేట్లు ముస్తామని తెలంగాణ సర్కారుకు లేఖ.

-సర్కారు నిర్ణయం పై ఉత్కంఠ.

-సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం జులై 1 న గేట్లు తెరిచి అక్టోబర్ 28 వరకు మూసేయాలి.

-ఎస్.ఆర్.ఎస్.పి. లోకి ఇప్పటి వరకు 225 టి.ఎం.సి. మేర కొత్త నీరు.

2020-09-28 04:06 GMT

Saraswati Barrage updates: సరస్వతి బ్యారేజ్ కి కొనసాగుతున్న వరద..

జయశంకర్ భూపాలపల్లి జిల్లా..

-48 గేట్లు ఎత్తిన అధికారులు

-పూర్తి సామర్థ్యం 119.000 మీటర్లు

-ప్రస్తుత సామర్థ్యం 116.50 మీటర్లు

-పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీ

-ప్రస్తుత సామర్థ్యం 5.87 టీఎంసీ

-ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 2,55,000 క్యూసెక్కులు

Tags:    

Similar News