Live Updates: ఈరోజు (సెప్టెంబర్-28) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-09-28 01:41 GMT
Live Updates - Page 4
2020-09-28 03:54 GMT

Khammam district updates: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పోలీసుల తనిఖీలు..

ఖమ్మం...

-నేడు మావోల బంద్ పిలుపుతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పోలీసుల తనిఖీలు

-15 రోజుల్లో మూడు ఎన్ కౌంటర్లలో ఆరుగురు దళ సభ్యులు మృతి కి నిరసనగా నేడు మావోల బంద్ పిలుపు

-ముందు జాగ్రత్త చర్యగా ఏజెన్సీ ప్రాంతాలకు బస్ సర్వీసులు నిలిపివేసిన అధికారులు

-అటవీ ప్రాంతాల్లో కొనసాగుతున్న పోలీసుల కూంబింగ్

2020-09-28 03:51 GMT

Warangal district updates: నేడు తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టులు..

వరంగల్..

-బూటకపు ఎంకౌంటర్ లను వెతిరేకిస్తూ బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ కేంద్ర కార్యదర్శి జగన్.

-బంద్ నేపథ్యంలో హై అలెర్ట్ ప్రకటించిన పోలీసులు.

-ములుగు జిల్లా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహబూబాబాద్ జిల్లా ల పోలీసులు ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.

-చత్తీస్ గర్డ్, మహారాష్ట్ర బార్డర్ లో భద్రతను పెంచిన పోలీసులు.

-ప్రతి వాహనాన్ని తనిఖీ చేసి అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు.

-నేటితో మావోయిస్టుల వారోత్సవాలు ముగియనుండటంతో ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాట్లు చేసిన పోలీసులు

2020-09-28 03:48 GMT

Kamareddy district updates: నిజాం సాగర్ కు జలకళ...

కామారెడ్డి :

-మంజీర ఎగువ ప్రాంతం లో కురుస్తున్న వర్షాలకు భారీగా వస్తున్న వరద.

-7 టి.ఎం.సి.లకు చేరిన నిజాం సాగర్ నీటి మట్టం.

-పూర్తి స్థాయి నీటి మట్టం 17 టి.ఎం.సి.లు

-ఇన్ ఫ్లో. 7878 క్యూసెక్కులు.

-ప్రస్తుత నీటి మట్టం 7.337 టి.ఎం.సి లు

2020-09-28 03:45 GMT

Sriram Sagar Project updates: శ్రీరాం సాగర్ ప్రాజెక్టు కు కొనసాగుతున్న వరద..

నిజామాబాద్ :

-ఇన్ ఫ్లో 148003 క్యూసెక్కులు

-ఔట్ ఫ్లో 179851 క్యూసెక్కులు

-పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులకు చేరిన జలాశయం

-40 వరద గేట్లు ఎత్తేసిన అధికారులు, వరద గేట్ల ద్వార 160938 క్యూసెక్కుల విడుదల.

-కాలువల ద్వారా కూడా కొనసాగుతున్న ఔట్ ఫ్లో

-జూన్ నుంచి ఇప్పటి వరకు ప్రాజెక్టులోకి చేరిన 234 టీఎంసీ ల వరద నీరు

-వరద గేట్ల ద్వారా గోదావరి లోకి 127టీఎంసీలు వృధాగా వదిలేసిన అధికారులు

2020-09-28 03:32 GMT

Nagarjuna Sagar Dam: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ క్రస్టు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల....

నల్గొండ :

-20 క్రస్టు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల....

-ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో : 4,19,454 క్యూసెక్కులు.

-పూర్తిస్థాయి నీటి నిల్వ: 312.0450 టీఎంసీలు.

-ప్రస్తుత నీటి నిల్వ : 310.252 టీఎంసీలు.

-పూర్తిస్థాయి నీటిమట్టం : 590 అడుగులు.

-ప్రస్తుత నీటిమట్టం : 589.40 అడుగులు

2020-09-28 03:05 GMT

Telangana latest news:ఈ రోజు తెలంగాణ ఎంసెట్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్..

తెలంగాణ... 

-రెండు రోజుల పాటు నాలుగు సెషన్స్ లో జరగనున్న ఎంట్రన్స్

-మొత్తం 84 సెంటర్ లలో పరీక్ష నిర్వహణ, తెలంగాణ లో 67, ఆంద్రప్రదేశ్ లో 17 ల సెంటర్ ల ఏర్పాటు

-పరీక్ష కు హాజరు కానున్న 78,970 మంది విద్యార్థులు

2020-09-28 02:50 GMT

Adilabad district updates: తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చిన మావోలు..

ఆదిలాబాద్..

-కదంబ ఎన్ కౌంటర్ కు నిరసనగా ఈ రోజు బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ.

-ఈనెల పందోమ్మిదిన న కదబ అడవులలో ఎన్ కౌంటర్ లో ఇద్దరు మావోలను కాల్చి చంపిన పోలిసులు.

-బూటకపు ఎన్ కౌంటర్లకు నిరసనగా బంద్ కు పిలుపునిచ్చిన. మావోలు

Tags:    

Similar News