Live Updates: ఈరోజు (సెప్టెంబర్-28) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 28 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు సోమవారం | 28 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | ద్వాదశి: రా.9-38 వరకు తదుపరి త్రయోదశి | ధనిష్ఠ నక్షత్రం రా.12-19 వరకు తదుపరి శతభిషం | వర్జ్యం: లేదు | అమృత ఘడియలు: మ.1-31 నుంచి 3-11 వరకు | దుర్ముహూర్తం: మ.12-15 నుంచి 1-03 వరకు తిరిగి మ.2-39 నుంచి 3-27 వరకు | రాహుకాలం: ఉ. 7-30 నుంచి 9-00 వరకు | సూర్యోదయం: ఉ.5-53 | సూర్యాస్తమయం: సా.5-51
ఈరోజు తాజా వార్తలు
మలక్ పేట..
-సురేష్ సింగ్. అజయ్ కుమారులు అరెస్ట్ చేసిన పోలుసులు
-నిందితుల నుండి 1.12 లక్షల నగదు.రెండు సెల్ ఫోనులు స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు...
ఏసీబీ కోర్ట్.....
-మల్కాజిరి ఏసీపీ నర్సింహారెడ్డి ని 5 రోజుల కస్టడీ కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఏసీబీ అధికారులు.
-ఏసీబీ కస్టడీ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసిన ఏసీపీ నర్సింహారెడ్డి తరపు న్యాయవాది...
-వాదనలు విన్న ఏసీబీ కోర్ట్ విచారణకు ను రేపటికి వాయిదా వేసింది...
తెలంగాణ ప్రభుత్వం..
-దేవాదాయ భూముల రిజిస్ట్రేషన్లను ప్రభుత్వం నిషేధించింది.
-ఆ భూముల్లో నిర్మాణాలకు అనుమతులను సైతం నిలిపివేసింది.
-శాసనసభలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా..
-51 గేట్లు ఎత్తిన అధికారులు
-పూర్తి సామర్థ్యం 119.000 మీటర్లు
-ప్రస్తుత సామర్థ్యం 116.50 మీటర్లు
-పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీ
-ప్రస్తుత సామర్థ్యం 5.87 టీఎంసీ
-ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 3,20,000 క్యూసెక్కులు
నల్గొండ :
-20 క్రస్టుగేట్లు 20 ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు
-ఇన్ ఫ్లో : 6,05,007 క్యూసెక్కులు.
-అవుట్ ఫ్లో :6,05,007 క్యూసెక్కులు.
-పూర్తిస్థాయి నీటి నిల్వ: 312.0450 టీఎంసీలు.
-ప్రస్తుత నీటి నిల్వ : 311.4474 టీఎంసీలు.
-పూర్తిస్థాయి నీటిమట్టం:590 అడుగులు.
-ప్రస్తుత నీటిమట్టం: 589.80అడుగులు
మంచిర్యాల జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు:
-ప్రస్తుతం నీటిమట్టం147.51
-గరిష్ట నీటిమట్టం148.00 M
-ప్రస్తుతం నీటినిల్వ : 18.8139
-పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 20.175 TMC*
-ఇన్ ప్లో :277128 c/s
-27 గేట్లను ఎత్తి : 277128c/s నీటిని బయటకు వదులుతున్నా అదికారులు
-2023 ఎన్నికల్లో అధికారం కోసం ఇప్పటి నుండే పని చేస్తాం.
-అందరికి ఒకే లక్ష్యం.
-దేశంలో అన్ని రాష్ట్రాల గవర్నర్ లు కాంగ్రెస్ నేతలు ఇచ్చిన వినతి పత్రం తీసుకున్నారు.
-మేము వినతి పత్రం ఇవ్వడానికి వెళితే పోలీసు అరెస్టు చేశారు.
-గవర్నర్ కు మెయిల్ ద్వారా వినతి పత్రం పంపించాలని చూచించారు.
-రాజభవన్ అధికారికి గేట్ వద్ద వినతి పత్రం తీసుకోవాలని విజ్ఞప్తి చేసిన రాజభవన్ అధికారులు స్పందించలేదు.
-వచ్చే ఉప ఎన్నికల్లో ప్రతి సీనియర్ లీడర్ రెండు గ్రామాల ఇంచార్జ్ తీసుకొని పనిచేయాలని పార్టీ నిర్ణయించింది.
-అభ్యర్థులను ముందు ప్రకటించడం వల్ల గెలుపు సాధ్యం కాదు. చివరకు ఫైనల్ గెలిచే సత్తా ఉన్న పార్టీ గెలుస్తుంది.
-మైనార్టీ ఓటర్లకు కాంగ్రెస్ ఎప్పుడు దూరం కాలేదు.
-తెలంగాణలో కమ్యునల్ పాలిటిక్స్ కొన్ని పార్టీలు అమలు చేస్తున్నాయి.
-ప్రస్తుతం ఉత్తమ్ పీసీసీ. ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు. మార్పు నాకు సంబంధం లేదు. అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ని ఎప్పటికప్పుడు అధిష్టానానికి అందజేస్తా... అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు డివిజన్ లో మావోయిస్టు లకు వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లు
ఇల్లందు పట్టణం, టేకులపల్లిలో మావోయిస్టు లకు వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లు
ఆదివాసీల సమస్య పరిష్కారానికి ప్రజాస్వామ్య పద్దతిలో పోరాడాలంటూ పిలుపు
నేడు మావోల బంద్ పిలుపు నేపధ్యంలో ఆదివాసీల పేరుతో పోస్టర్ల కలకలం
జంతు సంరక్షణకు స్వచ్చందంగా ముందుకొచ్చే సంస్థలకు ప్రభుత్వ సహకారం అందిస్తాMANI మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్
ప్రపంచ రేబిస్ డే సందర్భంగా మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో వీధి శునకాలు ( స్ట్రీట్ డాగ్స్) కు ఉచితంగా వ్యాధి నిరోధక టీకాల పంపిణీ చేసే పోస్టర్ ఆవిష్కరించిన తలసాని
పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని జీవాలకు అన్ని రకాల మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాము.
రాష్ట్ర ఎనిమల్ బోర్డ్ ఆధ్వర్యంలో జంతు సంరక్షణకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.
త్వరలోనే జిల్లా ఎనిమల్ బోర్డ్ కమిటీల పునరుద్దరణ కు చర్యలు చేపడతాం
1962 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా సంచార పశువైద్య శాలలు జీవాల వద్దకే వెళ్లి వైద్య సేవలు అందిస్తున్నాయి.
GHMC పరిధిలోని గోశాలలలోని జీవాలకు 1962 ద్వారా సేవలు అందుతున్నాయి.
లాక్ డౌన్ సమయంలో వీధి శునకాలకు ఆహారం అందించిన సంస్థల నిర్వాహకులను అభినందించిన మంత్రి శ్రీనివాస్ యాదవ్
ఉత్తమ్ కుమార్ రెడ్డి... టీపీసీసీ అధ్యక్షుడు:
కేంద్ర వ్యవసాయ బిల్ నీరసంగా రైతుల పక్షాన తాము గవర్నర్ కలవడానికి మేము ప్రయత్నం చేసాము.
కానీ కేంద్రంలో బీజేపీ ఇక్కడ trs ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీని ఇబంది పెడుతున్నాయి.
వినతి పత్రం ఇవ్వడానికి కూడా పోలీసులు అనుమతినివ్వడం లేదు.
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో పాస్ చేసుకున్న వ్యవసాయ బిల్లు రైతులకు గొడ్డలి పెట్టు.
కార్పోరేట్ శక్తులకు అనుకూలంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది.
కార్పోరేట్ కంపనీలకు మోడీ ప్రభుత్వం ఒక తొత్తు గా మారింది