Thalasani Srinivas: జంతు సంరక్షణకు సహకారం: మంత్రి శ్రీ తలసాని
జంతు సంరక్షణకు స్వచ్చందంగా ముందుకొచ్చే సంస్థలకు ప్రభుత్వ సహకారం అందిస్తాMANI మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్
ప్రపంచ రేబిస్ డే సందర్భంగా మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో వీధి శునకాలు ( స్ట్రీట్ డాగ్స్) కు ఉచితంగా వ్యాధి నిరోధక టీకాల పంపిణీ చేసే పోస్టర్ ఆవిష్కరించిన తలసాని
పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని జీవాలకు అన్ని రకాల మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాము.
రాష్ట్ర ఎనిమల్ బోర్డ్ ఆధ్వర్యంలో జంతు సంరక్షణకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.
త్వరలోనే జిల్లా ఎనిమల్ బోర్డ్ కమిటీల పునరుద్దరణ కు చర్యలు చేపడతాం
1962 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా సంచార పశువైద్య శాలలు జీవాల వద్దకే వెళ్లి వైద్య సేవలు అందిస్తున్నాయి.
GHMC పరిధిలోని గోశాలలలోని జీవాలకు 1962 ద్వారా సేవలు అందుతున్నాయి.
లాక్ డౌన్ సమయంలో వీధి శునకాలకు ఆహారం అందించిన సంస్థల నిర్వాహకులను అభినందించిన మంత్రి శ్రీనివాస్ యాదవ్