Live Updates: ఈరోజు (ఆగస్ట్-28) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 28 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-08-28 00:29 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు శుక్రవారం, 28 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్లపక్షం దశమి (ఉ. 10-59 వరకు) తదుపరి ఏకాదశి, మూల నక్షత్రం (మ. 3-46 వరకు) తదుపరి పూర్వాషాఢ, అమృత ఘడియలు (ఉ. 9-35 నుంచి 11-07 వరకు) వర్జ్యం (మ. 2-14 నుంచి 3-46 వరకు తిరిగి రాత్రి 1-12 నుంచి 2-46 వరకు) దుర్ముహూర్తం (ఉ. 8-17 నుంచి 9-07 వరకు తిరిగి మ. 12-26 నుంచి 1-16 వరకు) రాహుకాలం (ఉ. 10-30 నుంచి 12-00 వరకు) సూర్యోదయం: ఉ.5-48 సూర్యాస్తమయం: సా.6-16

ఈరోజు తాజా వార్తలు

Live Updates
2020-08-28 16:12 GMT

టీఆరెస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఉత్తర్ ప్రదేశ్ యువకుడు.

ఎంపీ సంతోష్ పేరుతో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి ఎంపీ స్నేహితులతో చాటింగ్ చేసిన యువకుడు.

ఎంపీ స్నేహితులకు- పేదల చికిత్స పేరుతో వేల రూపాయల డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్న యువకుడు.

ఎంపీ పేరు నమ్మి డబ్బులు పంపిన ఓ వ్యక్తికి అనుమానం రావడంతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు.

కేసు నమోదు చేసి- విచారణలో ఎంపీ పేరుతో ఉన్న అకౌంట్ ఫేక్ అని నిర్దారించిన పోలీసులు.

ఫేక్ అకౌంట్ సృష్టించి డబ్బులు వసూలు చేస్తుంది ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన గోవర్ధన్ గా గుర్తించిన పోలీసులు.

వీఐపీ ల పేర్లతో ప్రముఖుల నుంచి డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలిపిన సైబర్ క్రైమ్ పోలీసులు.

2020-08-28 16:00 GMT

శ్రీశైలం జలవిద్యుత్ ప్రాజెక్టు దగ్గర జరిగిన అగ్నిప్రమాదంపై గవర్నర్ కు లేఖ రాసిన టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ....

శ్రీశైలం జలవిద్యుత్ ప్రాజెక్టు అగ్నిప్రమాదానికి గల కారణాలు ,ఆస్తి నష్టం పై ఇంకా స్పష్టత రాలేదు...

శ్రీశైలం జలవిద్యుత్ ప్రాజెక్టులు అగ్ని ప్రమాదం జరిగినప్పుడు రాష్ట్రానికి ఆర్థిక సంక్షోభం నుండి అంధకారం నుంచి కాపాడి తొమ్మిది మంది మరణించారు...

మరణించిన ఉద్యోగులకు ప్రభుత్వం పరిహారం సరిగా లేదు, ఒక్కొక్కరికి రెండు కోట్లు చొప్పున పరిహారం చెల్లించి వారి కుటుంభం లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి..

శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదం పై నియమించిన విచారణ కమిటీ సాధ్యమైనంత త్వరగా నివేదిక

ఇవ్వాలి..

భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా సరైన జాగ్రత్త చర్యలు తీసుకోవాలి...

2020-08-28 15:39 GMT

ట్యాంక్ బండ్ పై గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించిన సీపీ అంజనికుమార్

గణేష్ నిమజ్జనానికి తక్కువ సంఖ్యలో పబ్లిక్ వస్తున్నారు.. పోలీసులతో సహకరిస్తున్నందుకు పబ్లిక్ కి ధన్యవాదాలు

కారోనా టైం లో జాగ్రత్తలు తీసుకొని నిమజ్జనం చేస్తున్నారు

క్రెన్స్ పెడుతున్నాం, అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం

పబ్లిక్ సోషల్ డిస్టెన్స్ పాటించాలి, మాస్కులు పెట్టుకోవాలి

ఆదివారం సిటీ లో కొన్ని చోట్ల ట్రాఫిక్ డైవర్షన్ చేస్తున్నాము

ట్రాఫిక్ ఆంక్షలు, రూట్ మ్యాప్ ని ఆదివారం రిలీజ్ చేస్తాం...

2020-08-28 15:37 GMT

- ఇంట్లో హోమియోపతి వైద్యం చేస్తున్న వైద్యురాలినీ లంచం అడిగిన ఓ కానిస్టేబుళ్ తో పాటు హోమ్ గార్డ్ ను సస్పెండ్ చేసిన నగర పోలీస్ కమిషనర్ అంజని కుమార్..

- ఎస్ ఆర్ నగర్ పోలిస్ స్టేషన్ పరిధిలో బొరబొండ లో ఇటీవలే తన ఇంట్లోనే హోమియోపతి వైద్యం చేస్తున్న పరిమలజ్యోతి అనే యువతినీ

- బెదిరించిన కానిస్టేబుళ్ బిక్షం హోంగార్డు మోహన్ రెడ్డి..

- యువతి నీ 2 లక్షలు డిమాండ్ చేసిన కానిస్టేబుళ్ బిక్షం హోంగార్డు మోహన్ రెడ్డి..

- లక్ష రూపాయలు చెల్లించిన యువతి.

- కానిస్టేబుళ్ తో పాటు హోంగార్డు పై ఎస్ అర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు.

- ఇదరిని సస్పెండ్ చేస్తూ చర్యలు తీసుకున్న నగర పోలీస్ కమిషనర్...

2020-08-28 15:36 GMT

- సరుకు రవాణా చేసే మినీ రేక్ ల రవాణాపై మరిన్ని సడలింపులు...

- దేశ వ్యాప్తంగా 1500 కి.మీ. కంటే ఎక్కువ దూరం గల గమ్య స్థానాలకు వర్తింపజేసిన రైల్వే సరఫరా గొలుసుకి అంతరాయం కలుగకుండా , అన్ని సరుకుల రవాణా పై దృష్టి కేంద్రీకరించి భారతీయ రైల్వే సరుకు రవాణా, పార్సల్ రైళ్ళను నడుపుతున్నది...

- సరుకు రవాణా రంగానికి మరింత ప్రోత్సాహం కలిగిస్తూ సరుకు రవాణా వినియోగదారులకు ప్రయోజనం కలిగించే దిశలో భారతీయ రైల్వే సరుకు రవాణా విధానంలో కొన్ని సడలింపులను ఇవ్వాలనే నిర్ణయం తీసుకుంది..

- 20 వ్యాగనున్న మినీ రేక్ ల విషయంలో - ఇంతకు ముందు ఇంటర్ జోనల్ ట్రాఫిక్ కి 600 కి.మీ , టిఇఎఫ్డి ట్రాఫిక్ మినహాయించిన ఇంట్రా - జోనల్ ట్రాఫిక్ కి 1000 కి.మీ. వరకు మాత్రమే ఉండేది దానిని సడలిస్తూ1500 కి.మీ దూరం కి పెంచింది...

- ఇప్పుడు 1500 కి.మీ. దాటి 2000 కి.మీ. ప్రయాణించే మినీ రేట్లపై కూడా ట్రైన్ లోడ్ క్లాస్ రేట్ చార్జీలను బేస్ ఫ్రెట్ రేట్ పై కేవలం 7.5 % అదనపు చార్జీ మాత్రమే విధించడం జరుగుతుంది .

- అలాగే 2000 కి.మీ మించి ప్రయాణించే మినీ రేలపై కూడా 1500 కిమీ . నుండి 2000 కి.మీ. లోపు ప్రయాణానికి విధించే 7.5 % అదనపు చార్జీతో పాటు 2000 కి.మీ కంటే ఎక్కువ దూరం ప్రయాణానికి 10 % అదనపు చార్జీ బేస్ రేట్ ఆధారంగా విధిస్తారు...

2020-08-28 15:34 GMT

- గాంధీ ఆస్పత్రి నుంచి తప్పించుకుపోయిన ఖైదీల పై రివార్డు ప్రకటించిన పోలీసులు....

- రెండు రోజుల క్రితం కరోన చికిత్స కోసం జైలు నుంచి తీసుకువచ్చిన నలుగురు నిందితులు గాంధీ నుంచి పరారీ...

- ఆచూకీ తెలిపిన వారికి తగిన రివార్డు ఇస్తామని వెల్లడి...

2020-08-28 14:12 GMT

- తెలంగాణ లో మొదటిసారిగా డిజిటల్ పాఠాలు బోధించబోతున్నాము.

- ఒకే ఇంట్లో వేరు వేరు తరగతుల విద్యార్థులు ఉన్నప్పటికీ ఇబ్బందులు లేకుండా ప్రణాళిక రూపొందించాం

- విద్యార్థులకు టీవీలు స్మార్ట్ఫోన్లు 95 శాతం మంది కి ఉన్నాయి.

- ఉదయం8:00-10:30 ఇంటర్ క్లాసులు....10:30తర్వాత పాఠశాల లకు క్లాసులు వుంటాయి.

- దూరదర్శన్ లో మిస్ అయిన వారు తర్వాతి రోజు T-sat ద్వారా వినొచ్చు...

- దూరదర్శన్ యూట్యూబ్ లో కూడా పాఠాలు అందుబాటులో వుంటాయి.

- విద్యార్థులకు వర్క్ షీట్లు ఇచ్చి వారితో హోమ్ వర్క్ కూడా చేయిస్తాము...

- గ్రామాల్లో పాఠశాల ఆవరణలో పారిశుద్ధ్యం శానిటేషన్ బాధ్యతలు గ్రామ సర్పంచులు చూసుకుంటారు.

- అడ్మిషన్లను ని ఆన్ లైన్ ద్వారా నిర్వహిస్తాం.

- డిగ్రీ ఫైనల్ ఇయర్ PG ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తాం అంతా రెడీగా ఉండండి.

- విద్యార్థుల్లో లేనిపోని అపోహలు సృష్టించ వద్దు

- ఇప్పటికే పాఠశాల, టెన్త్ ఇంటర్ విద్యార్థులను ప్రమోట్ చేశాం.

- ఉపాధ్యాయులు వస్తే కరోనా వస్తుందని అపోహతో గ్రామాల్లో ఉపాధ్యాయులను అడ్డుకోవద్దు

- ఇంటర్ కాలేజీల అఫిలియేషన్ కి సంబంధించి త్వరలోనే ఒక పరిష్కారం లభిస్తుంది.

- సీఎం ఆదేశాల మేరకు యూనివర్సిటీ లకు వీ సీ లను కూడా త్వరలోనే నియమిస్తాము.

2020-08-28 13:32 GMT

- పివి పుట్టిన లక్నెపల్లి, పెరిగిన వంగర గ్రామాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ది చేయాలని సమావేశంలో నిర్ణయించారు.

- హైదరాబాద్ నగరంలో అంతర్జాతీయ స్థాయిలో పివి మెమోరియల్ ఏర్పాటు చేయాలి. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన పివి జీవితమంతా వివిధ రంగాల్లో చేసిన కృషి ప్రస్ఫుటించేలా మెమోరియల్ ఏర్పాటు చేయాలి. ఇందుకోసం అనువైన స్థలాన్ని ప్రభుత్వం ఎంపిక చేస్తుంది.

- పివి నరసింహరావు పేరు మీద విద్యావైజ్ఞానిక, సాహితీ రంగాల్లో సేవ చేసిన వారికి అంతర్జాతీయ అవార్డు ఇవ్వాలని యునెస్కోకు ప్రతిపాదించాలి.

- అవార్డుకు సంబంధించిన నగదు బహుమతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది.

- అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, బ్రిటన్ మాజీ అధ్యక్షులు జాన్ మేజర్, కామెరూన్ తదితరులను కూడా భారతదేశానికి ఆహ్వానించి, శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేలా చేయాలి.

- భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా లేఖలు రాస్తారు.

- పివి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తారు.

- ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో పివి విగ్రహం పెట్టాలి.

- కేవలం హైదరాబాద్ లోనే కాకుండా అన్ని జిల్లాల్లో ఉత్సవాలు నిర్వహించాలి.

2020-08-28 13:31 GMT

- వచ్చే నెలలో జరిగే వర్షకాల అసెంబ్లీ సమావేశాల్లో మాజీ ప్రధాని పివి నరసింహారావు కు భారతరత్న పురస్కారం ప్రకటించాలని తీర్మానం చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు.

- నెక్లెస్ రోడ్ కు పివి జ్ఞాన మార్గ్ గా పేరు పెట్టాలని సిఎం నిర్ణయించారు.

- హైదరాబాద్ లో పివి మెమోరియల్ నిర్మించనున్నట్లు వెల్లడించారు.

- పివి నరసింహారావు తెలంగాణ అస్తిత్వ ప్రతీక. భారత దేశంలో అనేక సంస్కరణలు అమలు చేసిన గొప్ప సంస్కర్త.

- ప్రపంచం గుర్తించిన మహామనిషి. దేశ ప్రధానిగా ఎదిగిన తెలంగాణ బిడ్డ.

- అలాంటి మహోన్నత వ్యక్తి గొప్పతనాన్ని రాష్ట్ర అసెంబ్లీలో చర్చిస్తాం.

- అసెంబ్లీలో పివి నరసింహారావు పొట్రేయిట్ (తైల వర్ణ చిత్రం – చిత్తరువు) పెట్టాలని నిర్ణయించాం.

- భారత పార్లమెంటులో కూడా పివి పొట్రెయిట్ పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతాం.

- హైదరాబాద్ లో పివి నెలకొల్పిన సెంట్రల్ యూనివర్సిటీకి పివి పేరు పెట్టాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేస్తాం’’

- అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.

- ప్రజలకు కేవలం భూమి మాత్రమే ఉత్పత్తి సాధనం, ఉపాధి మార్గం అయిన సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న పివి నరసింహరావు అత్యంత సాహసోపేతంగా భూ సంస్కరణలు అమలు చేశారు.

- దీని ఫలితంగా నేడు తెలంగాణలో 93 శాతం మంది చిన్న, సన్నకారు రైతులున్నారు. పేదల చేతికి భూమి వచ్చింది. పివి ప్రధానిగా చేపట్టిన ఆర్థిక సంస్కరణల ఫలితంగా నేడు ఆర్థికంగా నిలదొక్కుకుంది.

- అలాంటి గొప్ప వ్యక్తిని అద్భుతమైన పద్ధతుల్లో స్మరించుకోవాలి’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

- ‘‘ప్రస్తుతం కరోనా నిబంధనలు అమలులో ఉన్నందున ఈ సమయంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి? కరోనా నిబంధనలు సడలించాక పెద్ద ఎత్తున ప్రజలను భాగస్వాములను చేస్తూ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి? అనే విషయాలను విభజించుకుని కార్యాచరణ రూపొందించాలి’’ అని సిఎం కమిటి సభ్యులకు సూచించారు.

2020-08-28 13:29 GMT

- మంచిర్యాల జిల్లా శ్రీపాద ఎల్లం‌పల్లి ప్రాజెక్టులోకి బారీగా చేరుతున్న వరదనీరు

- ప్రస్తుతం నీటిమట్టం147.80

- గరిష్టనీటిమట్టం148.00 M

- :ప్రస్తుతం‌ నీటినిల్వ19.6197

- పూర్తి స్థాయి నీటి నిల్వ 20.175 TMC*

- ఇన్ ప్లో:16938c/s*

- మూడు గేట్లను ఎత్తి 16,938 క్యూసెక్కుల వరదనీరు బయటకు వదిలిన అదికారులు

Tags:    

Similar News