Railway Updates: సరుకు రవాణా చేసే మినీ రేక్ ల రవాణాపై మరిన్ని సడలింపులు...
- సరుకు రవాణా చేసే మినీ రేక్ ల రవాణాపై మరిన్ని సడలింపులు...
- దేశ వ్యాప్తంగా 1500 కి.మీ. కంటే ఎక్కువ దూరం గల గమ్య స్థానాలకు వర్తింపజేసిన రైల్వే సరఫరా గొలుసుకి అంతరాయం కలుగకుండా , అన్ని సరుకుల రవాణా పై దృష్టి కేంద్రీకరించి భారతీయ రైల్వే సరుకు రవాణా, పార్సల్ రైళ్ళను నడుపుతున్నది...
- సరుకు రవాణా రంగానికి మరింత ప్రోత్సాహం కలిగిస్తూ సరుకు రవాణా వినియోగదారులకు ప్రయోజనం కలిగించే దిశలో భారతీయ రైల్వే సరుకు రవాణా విధానంలో కొన్ని సడలింపులను ఇవ్వాలనే నిర్ణయం తీసుకుంది..
- 20 వ్యాగనున్న మినీ రేక్ ల విషయంలో - ఇంతకు ముందు ఇంటర్ జోనల్ ట్రాఫిక్ కి 600 కి.మీ , టిఇఎఫ్డి ట్రాఫిక్ మినహాయించిన ఇంట్రా - జోనల్ ట్రాఫిక్ కి 1000 కి.మీ. వరకు మాత్రమే ఉండేది దానిని సడలిస్తూ1500 కి.మీ దూరం కి పెంచింది...
- ఇప్పుడు 1500 కి.మీ. దాటి 2000 కి.మీ. ప్రయాణించే మినీ రేట్లపై కూడా ట్రైన్ లోడ్ క్లాస్ రేట్ చార్జీలను బేస్ ఫ్రెట్ రేట్ పై కేవలం 7.5 % అదనపు చార్జీ మాత్రమే విధించడం జరుగుతుంది .
- అలాగే 2000 కి.మీ మించి ప్రయాణించే మినీ రేలపై కూడా 1500 కిమీ . నుండి 2000 కి.మీ. లోపు ప్రయాణానికి విధించే 7.5 % అదనపు చార్జీతో పాటు 2000 కి.మీ కంటే ఎక్కువ దూరం ప్రయాణానికి 10 % అదనపు చార్జీ బేస్ రేట్ ఆధారంగా విధిస్తారు...