CM KCR: వర్షకాల అసెంబ్లీ సమావేశాల్లో మాజీ ప్రధాని పివి నరసింహారావు కు భారతరత్న పురస్కారం ప్రకటించాలని తీర్మానం
- వచ్చే నెలలో జరిగే వర్షకాల అసెంబ్లీ సమావేశాల్లో మాజీ ప్రధాని పివి నరసింహారావు కు భారతరత్న పురస్కారం ప్రకటించాలని తీర్మానం చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు.
- నెక్లెస్ రోడ్ కు పివి జ్ఞాన మార్గ్ గా పేరు పెట్టాలని సిఎం నిర్ణయించారు.
- హైదరాబాద్ లో పివి మెమోరియల్ నిర్మించనున్నట్లు వెల్లడించారు.
- పివి నరసింహారావు తెలంగాణ అస్తిత్వ ప్రతీక. భారత దేశంలో అనేక సంస్కరణలు అమలు చేసిన గొప్ప సంస్కర్త.
- ప్రపంచం గుర్తించిన మహామనిషి. దేశ ప్రధానిగా ఎదిగిన తెలంగాణ బిడ్డ.
- అలాంటి మహోన్నత వ్యక్తి గొప్పతనాన్ని రాష్ట్ర అసెంబ్లీలో చర్చిస్తాం.
- అసెంబ్లీలో పివి నరసింహారావు పొట్రేయిట్ (తైల వర్ణ చిత్రం – చిత్తరువు) పెట్టాలని నిర్ణయించాం.
- భారత పార్లమెంటులో కూడా పివి పొట్రెయిట్ పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతాం.
- హైదరాబాద్ లో పివి నెలకొల్పిన సెంట్రల్ యూనివర్సిటీకి పివి పేరు పెట్టాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేస్తాం’’
- అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.
- ప్రజలకు కేవలం భూమి మాత్రమే ఉత్పత్తి సాధనం, ఉపాధి మార్గం అయిన సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న పివి నరసింహరావు అత్యంత సాహసోపేతంగా భూ సంస్కరణలు అమలు చేశారు.
- దీని ఫలితంగా నేడు తెలంగాణలో 93 శాతం మంది చిన్న, సన్నకారు రైతులున్నారు. పేదల చేతికి భూమి వచ్చింది. పివి ప్రధానిగా చేపట్టిన ఆర్థిక సంస్కరణల ఫలితంగా నేడు ఆర్థికంగా నిలదొక్కుకుంది.
- అలాంటి గొప్ప వ్యక్తిని అద్భుతమైన పద్ధతుల్లో స్మరించుకోవాలి’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.
- ‘‘ప్రస్తుతం కరోనా నిబంధనలు అమలులో ఉన్నందున ఈ సమయంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి? కరోనా నిబంధనలు సడలించాక పెద్ద ఎత్తున ప్రజలను భాగస్వాములను చేస్తూ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి? అనే విషయాలను విభజించుకుని కార్యాచరణ రూపొందించాలి’’ అని సిఎం కమిటి సభ్యులకు సూచించారు.