Amaravati: అమరావతి ఉద్యమం అనేది పచ్చి భూటకం.. కరణం ధర్మశ్రీ
అమరావతి...
- 250 రోజుల ఉద్యమం అని పది మందితో ఉద్యమం నడుపుతున్నారు..
- అమరావతి ఉద్యమం అనేది పచ్చి భూటకం..
- చంద్రబాబు చేయిస్తున్న జూమ్ ఉద్యమానికి లెఫ్ట్ పార్టీలు మద్దతు తెలుపుతున్నారు..
- కారాల్ మర్క్స్ సిద్దాంతంకు విరుద్ధంగా సీపీఐ సీపీఎం లు వ్యవహరిస్తున్నాయి..
- కమ్యూనిస్టు పార్టీలు పేరు చంద్రబాబు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా అని మార్చుకోవాలి..
- లేని అమరావతి ఉద్యమాన్ని అంతర్జాతీయ ఉద్యమంగా ప్రచారం చేస్తున్నారు..
- మూడు రాజధానులతో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయి..
- చంద్రబాబు ప్రతిపక్ష నేతవా బ్రోకర్ వా..
- మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తావా...
- ఎందుకు విశాఖపట్నంపై చంద్రబాబు విషం కక్కుతున్నావు..
- దళితులపై ప్రేమ ఉంటే రాజధానిలో దళితులకు ఇచ్చిన ఇళ్ల పట్టాలు ఎందుకు అడ్డుకున్నారు..
- వైజాగ్ గా రాజధానిని అడ్డుకుంటే టీడీపీ నేతలు ద్రోహులగా మిగిలిపోతారు..
- ఎల్జీ పాలిమర్స్ వ్యవహారంలో చర్యలు తీసుకోమని డిమాండ్ చేసిన రమేష్ హాస్పిటల్ వ్యవహారంలో ఎందుకు నోరు మీదపడం లేదు..
Mega Bulk Drug Park: రాష్ట్రంలో మెగా బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు
అమరావతి: కేంద్ర ప్రాయోజిత పథకంలో భాగంగా రాష్ట్రంలో మెగా బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు కృషి చేసేలా ఏపీఐఐసీకి బాధ్యతలు అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు
ఇందుకోసం స్టేట్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీగా ఏపీ బల్క్ డ్రగ్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ కార్పోరేషన్ ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ
ఏపీఐఐసీ అనుబంధ సంస్థగా ఏపీ బల్క్ డ్రగ్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ కార్పోరేషన్
రాష్ట్రంలో మెగాబల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటుకు 2 వేల ఎకరాల భూమిని గుర్తించాల్సిందిగా సూచించిన ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరిపేందుకు స్టేట్ ఇంప్లమెంటింగ్ ఏజెన్సీగా ఏపీ బల్క్ డ్రగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పోరేషన్
వచ్చే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న 3 మెగా బల్క్ డ్రగ్ పార్కుల్లో ఒకటి ఏపీలో ఏర్పాటు చేసేలా ప్రభుత్వ ప్రయత్నాలు
దేశంలో మూడు మెగాపార్కుల ఏర్పాటు నేపథ్యంలో రాష్ట్రాల మధ్య పోటీ ఉండే అవకాశమున్నందున సమగ్రమైన ప్రాజెక్టు నివేదిక రూపకల్పనకు ఐఐసీటీ-సీఎస్ఐఆర్ సంస్థకు బాధ్యతలు అప్పగింత
ఇప్పటికే ఫార్మా పరిశ్రమలతో పాటు ఎగుమతుల్లో కీలకంగా ఉన్న ఏపీలోనే ఈ మెగా బల్గ్ డ్రగ్ పార్కును ఏర్పాటుకు అవకాశాలున్నాయని భావిస్తున్న రాష్ట్రప్రభుత్వం
మెగా బల్క్ డ్రగ్ పార్కు నిర్మాణానికి కేంద్రం వెయ్యి కోట్ల రూపాయల మేర నిధులు మంజూరు చేసే అవకాశం
Silver Seized In AP: ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో భారీ మొత్తంలో వెండి పట్టివేత.
శ్రీకాకుళం జిల్లా:
ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో భారీ మొత్తంలో వెండి పట్టివేత..
ఇచ్చాపురం టోల్ గేట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన
సుమారు 62 కేజీల వెండి బిస్కెట్లు..
ఓ కారులో వెండి బిస్కెట్లని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులు..
అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు..
Corona Updates In chittoor: చిత్తూరులో 2.60లక్షల పరీక్షలు చేశాము: జిల్లా కలెక్టర్
తిరుపతి: చిత్తూరులో 2.60లక్షల పరీక్షలు చేశాము
33 వేల కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో అత్యధిక మరణాలు కూడా చిత్తూరు జిల్లాలో నమోదు కావడం దురదృష్టం
పరీక్షలు నిర్వహించి పకడ్బందీగా వైద్యసేవలు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాము
మైల్డ్, మాడరేట్ కేసులు వైద్యం కోసం దూరప్రాంతాలకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా మదనపల్లె,పలమనేరు,శ్రీకాళహస్తి ప్రాంతాలలోనూ కోవిడ్ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్నాము..
జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్త
వైఎస్ఆర్ ఈఎంసీగా ఈ క్లస్టర్ ఏర్పాటు
అమరావతి: కడప జిల్లా కొప్పర్తిలో ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటుపై ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
సెంట్రల్ స్పాన్సర్డ్ పథకమైన ఇఎంసి-2.0 లో భాగంగా ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయం
వైఎస్ఆర్ ఈఎంసీగా ఈ క్లస్టర్ ఏర్పాటు కోసం కేంద్ర ఐటీ శాఖ అనుమతులు
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఎలక్ట్రానిక్ క్లస్టర్ ను ఏర్పాటు చేస్తాయని జీవోలో పేర్కోన్న ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 380.50 కోట్ల విడుదల చేయాలని ఆదేశాలు.
మిగిలిన 50 శాతం మొత్తాన్ని కేంద్రం గ్రాంట్ గా పేర్కోన్న ప్రభుత్వం
కొప్పర్తిలోని ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ కు పెట్టుబడులను ఆహ్వానించేలా ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటించిన ప్రభుత్వం
గ్రీన్ కేటగిరీలోని ఎలక్ట్రానిక్ పరిశ్రమలకు తనిఖీలు ఉండవని స్పష్టం చేసిన ప్రభుత్వం
ఆరెంజ్, రెడ్ కేటగిరీకి ఇది వర్తించదని తెలిపిన పరిశ్రమల శాఖ
భూమి లీజును 33 ఏళ్ల నుంచి 99 ఏళ్లకు పొడగించుకునే అవకాశం కల్పించటంతో పాటు అవసరమైతే భూమిని కొనుగోలు చేసేందుకూ వీలుందని స్పష్టం చేసిన ప్రభుత్వం
వంద శాతం స్టాంపు డ్యూటీ రీఎంబర్సుమెంటు కల్పిస్తున్నట్టు వెల్లడి.
20 శాతం మేర పెట్టుబడి రాయితీ కూడా ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్టరింగ్ క్లస్టర్ లో ఉంటుందని తెలిపిన ప్రభుత్వం
250 కోట్లను మించి పెట్టుబడులు పెట్టే మొబైల్ ఉత్పత్తి పరిశ్రమలకు మెగా స్టేటస్ ఇస్తామని ఉత్తర్వుల్లో పేర్కోన్న ప్రభుత్వం
Vijayanagaram: మిమ్స్ ఆసుపత్రి సిబ్బంది చేతివాటం..
విజయనగరం: కరోనాతో చనిపోయిన మహిళ వద్ద ఐదున్నర తులాల బంగారం మాయం
మృతదేహం వద్ద బంగారం మాయం చేసిన సిబ్బంది.
ఐదున్నర తులాలు విలువగల బంగారు గొలుసు, ఉంగరాలు మాయం
మృతదేహాన్ని కవర్ తో ప్యాక్ చేసి చూపించకుండా తరలించేందుకు ప్రయత్నం
సిబ్బందిని అడ్డుకుని ప్రశ్నించేసరికి బయటపడ్డ బంగారం అపహరణ విషయం.
AP Corona News: ఏపీలో కోవిడ్ సేవలు బేషు: ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి
చంద్రబాబుకు హత్యారాజకీయాలు అలవాటైపోయి కరోనాతో మృతి చెందిన వారిని కూడా ప్రభుత్వ హత్యలుగా పరిగణించాలని మాట్లాడటం ఆయన దిగజారుడు తనానికి నిదర్శనం
క్లిష్టమైన పరిస్థితులలోనూ జగన్ ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్నారు..
ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి
చిత్తూరు జిల్లాలో కోవిడ్ సేవలు బేషుగ్గా ఉన్నాయి.
ప్రజల అవసరాలకు తగినట్లు వైద్య సేవలను అందిస్తున్నాము
టాస్క్ ఫోర్స్ ద్వారా సమీక్షించి జిల్లా పరిస్థితుల పై ఎప్పటికప్పుడు అధికారులకు సూచనలిస్తున్నాము
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
National updates: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని ఢిల్లీలో కలిసిన వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీ, పార్లమెంటరీ స్థాయి సంఘం చైర్మన్ విజయసాయిరెడ్డి
-జాతీయం
-ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని ఢిల్లీలో కలిసిన వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీ, పార్లమెంటరీ స్థాయి సంఘం చైర్మన్ విజయసాయిరెడ్డి
-వ్యవసాయం, మత్స్య, ప్లాంటేషన్, కొబ్బరి పీచు, పసుపు ఉత్పత్తి ఎగుమతులకు సంబంధించిన నివేదికను ఉపరాష్ట్రపతి వెంకయ్యకు సమర్పించిన విజయసాయిరెడ్డి.
-వ్యవసాయ ఉత్పత్తులు, ఎగుమతులు పెంచేలా చర్యలు తీసుకోవాలని కోరాను.
-రైతులకు కనీస మద్దతు ధర లభించేలా చూడాలని వినతిపత్రం అందజేసాను
-వ్యవసాయ ఉత్పత్తుల విదేశీ ఎగుమతుల సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉంది.
-టీ ఉత్పత్తులకు బ్రాండ్ ప్రమోషన్ చేపట్టడంతో పాటు పొగాకు ఉత్పత్తులపై బ్యాలెన్స్ పద్ధతి రావాల్సిన అవసరం ఉంది.
-పొగాకు ఉత్పత్తులను కేవలం ఎగుమతుల వరకే పరిమితం చేయాలి.. ఇలా చేయడం వల్ల రైతులకు, రైతుకూలీలకు నష్టం జరగదు.
- వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీ, పార్లమెంటరీ స్థాయి సంఘం చైర్మన్ విజయసాయిరెడ్డి
Andra Pradesh updates: ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ వీడియో కాన్ఫరెన్స్
-ఏపీ డీజీపీ గౌతం సవాంగ్
-ప్రభుత్వం మన ప్రవర్తనను గమనిస్తోంది
-మనకు వారాంతపు సెలవులు ఇచ్చారు
-కోవిడ్ త్వరలో తగ్గిపోవాలని కోరుకుంటున్నాను
-పోలీసులుగా మనం ముందుంటాం, కనుక కోవిడ్ కు కూడా మనమే ముందు
-ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఉన్న అందరం ఈ రోజు నుంచీ వచ్చిన మార్పుతో పనిచేయాలి
-అన్ని జిల్లాలలో అవగాహన, పరివర్తన, బాధ్యతల నిర్వహణకు సంబంధించిన కార్యక్రమాలు జరగాలి
-పోలీసు అనేది ఒక సేవ చేయడానికి వచ్చిన అవకాశంగా భావించాలి
-టెక్నాలజీ స్కిల్స్ లో పది అవార్డులు వచ్చాయి
-మొత్తం డిపార్ట్మెంట్ కు 26 అవార్డులు వచ్చాయి
-సమగ్రతా లోపం, లంచగొండితనం అనేవి ఉండకూడదు
-మొత్తం కరప్షన్ ను రాష్ట్రంలో లేకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యం
-సామాన్యులకు సేవ చేయడం మన బాధ్యత
-అందరూ మార్పుకు అనుకూలంగా పనిచేస్తారని ఆశిస్తున్నాను
Andra Pradesh Updates: సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్
-సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్
-దళితులు, మహిళలపై ఏదైనా పోలీసుల వల్ల జరిగితే గతంలో ఎవరూ పట్టించుకోలేదు
-ఒక ఎస్సై, సీఐ తప్పు చేస్తే కూడా కేసులు పెట్టి జైలులో పెట్టే ఘటన ఇప్పటి వరకూ లేదు
-ఈ వ్యవస్ధలో ఏదో ఒకచోట మార్పు రావాలి అనేదే దీనికి కారణం
-ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి, చేస్తోంది తప్పా కాదా అని
-పోలీసులలో క్రింది స్ధాయి వరకూ ఒక ఓరియంటేషన్ సమావేశం ఏర్పాటు చేయాలి
-ఎలా ఒక విషయంలో ప్రవర్తించాలి అనేది పోలీసులకు తెలియజేయాలి
-శిరోముండనం అనేది సరైన విషయం కాదు...
-నేను, డీజీపీ, హోం మినిష్టర్ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం
-అందరు జిల్లా ఎస్పీలు కూడా క్రింది స్ధాయి వరకూ ఈ అవగాహన ఉండేలా చేయాలి
-పోలీసులలో పరివర్తన తీసుకు వచ్చేలా నిర్ణయం తీసుకోవాలని ఎస్పీలను కోరుతున్నాను