Mega Bulk Drug Park: రాష్ట్రంలో మెగా బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు
అమరావతి: కేంద్ర ప్రాయోజిత పథకంలో భాగంగా రాష్ట్రంలో మెగా బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు కృషి చేసేలా ఏపీఐఐసీకి బాధ్యతలు అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు
ఇందుకోసం స్టేట్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీగా ఏపీ బల్క్ డ్రగ్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ కార్పోరేషన్ ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ
ఏపీఐఐసీ అనుబంధ సంస్థగా ఏపీ బల్క్ డ్రగ్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ కార్పోరేషన్
రాష్ట్రంలో మెగాబల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటుకు 2 వేల ఎకరాల భూమిని గుర్తించాల్సిందిగా సూచించిన ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరిపేందుకు స్టేట్ ఇంప్లమెంటింగ్ ఏజెన్సీగా ఏపీ బల్క్ డ్రగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పోరేషన్
వచ్చే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న 3 మెగా బల్క్ డ్రగ్ పార్కుల్లో ఒకటి ఏపీలో ఏర్పాటు చేసేలా ప్రభుత్వ ప్రయత్నాలు
దేశంలో మూడు మెగాపార్కుల ఏర్పాటు నేపథ్యంలో రాష్ట్రాల మధ్య పోటీ ఉండే అవకాశమున్నందున సమగ్రమైన ప్రాజెక్టు నివేదిక రూపకల్పనకు ఐఐసీటీ-సీఎస్ఐఆర్ సంస్థకు బాధ్యతలు అప్పగింత
ఇప్పటికే ఫార్మా పరిశ్రమలతో పాటు ఎగుమతుల్లో కీలకంగా ఉన్న ఏపీలోనే ఈ మెగా బల్గ్ డ్రగ్ పార్కును ఏర్పాటుకు అవకాశాలున్నాయని భావిస్తున్న రాష్ట్రప్రభుత్వం
మెగా బల్క్ డ్రగ్ పార్కు నిర్మాణానికి కేంద్రం వెయ్యి కోట్ల రూపాయల మేర నిధులు మంజూరు చేసే అవకాశం