Live Updates:ఈరోజు (ఆగస్ట్-26) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-08-26 00:58 GMT
Live Updates - Page 3
2020-08-26 08:00 GMT

Guntur updates: కొల్లిపరలో సాంబశివరావు అనే వ్యవసాయ కూలిపై దాడి

-గుంటూరు...

-కొల్లిపరలో సాంబశివరావు అనే వ్యవసాయ కూలిపై దాడి చేసిన ఓ సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు స్థానిక నేతలు...

-దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి...

-నా తప్పు లేకుండానే నా పై దాడి చేశారు....

-స్థానిక పోలీసులు పట్టించుకోవటం లేదు....

-వెంటనే చర్యలు తీసుకోవాలని రూరల్ ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితుడు సాంబశివరావు... కుల సంఘ నేతలు.

2020-08-26 07:33 GMT

Vijayawada updates: ఏపీ‌ డీజీపీ గౌతం సవాంగ్ వీడియో కాన్ఫరెన్స్

-విజయవాడ

-ఏపీ‌ డీజీపీ గౌతం సవాంగ్ వీడియో కాన్ఫరెన్స్

-ఏడీజీపీ, లా అండ్ అఅర్డర్, డాక్టర్ రవి శంకర్

-గత మూడు వారాలుగా జరిగిన సంఘటనల నేపథ్యంలో ఈ వీడియో కాన్ఫరెన్స్

-పోలీసుల దురుసు ప్రవర్తనపై వచ్చిన కంప్లైంట్లు, లంచాల గురించి వచ్చిన కంప్లైంట్లపై పోలీసులకు దిశా నిర్దేశం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు

-చట్టపరంగా ఎలా పోలీసులు ఉండాలో అలాగే ఉండాలి

-పోలీసులు చేసిన కొన్ని దురుసు పనులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి

2020-08-26 07:31 GMT

Vijayawada updates: రైతులను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు

-విజయవాడ

-రాజధాని అమరావతి రైతులకు పెండింగ్లో ఉన్న కౌలు వెంటనే ఇవ్వాలని కోరుతూ విజయవాడ

-సి.ఆర్.డి.ఏ కార్యాలయం వద్దకు వచ్చిన రైతులను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు.

-అరెస్టు చేసిన మహిళలను సూర్యా రావు పేట పోలీస్ స్టేషన్ కు వెళ్లి పరామర్శించారు.

-భూములిచ్చిన రైతులకు చట్ట ప్రకారం కౌలు చెల్లించడం ప్రభుత్వ బాధ్యత అని, అడగడానికి వచ్చిన రైతుల పైదౌర్జన్యం చేసి అరెస్టు చేయడం ప్రభుత్వానికి తగదు అని మధు విమర్శించారు.

2020-08-26 07:01 GMT

Krishna district updates: భారీగా గంజాయి పట్టివేత.. నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టిన నందిగామ సబ్ డివిజన్ పరిధి డియస్పీ జివి రమణమూర్తి.

-కృష్ణాజిల్లా:

-భారీగా గంజాయి పట్టివేత

-నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టిన నందిగామ సబ్ డివిజన్ పరిధి డియస్పీ జివి రమణమూర్తి.

-విశాఖపట్నం నుండి బీదర్ కు తరలిస్తున్నట్లు నిందితులు.

-నందిగామ (మ)జొన్నలగడ్డ చెక్ పోస్ట్ వద్ద స్కోడా కారులో గంజాయి పట్టివేత.

-సుమారు 193 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న నందిగామ పోలీసులు.

-పట్టుబడిన గంజాయి విలువ సుమారు 3,86,000 రూపాయలు ఉన్నట్లు తెలిపిన పోలీసులు..

-కారులో నలుగురు వ్యక్తులు ఉండగా వారిలో ఇద్దరు మహిళలు, పరారీ లో కారు డ్రైవర్...

-ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసిన నందిగామ పోలీసులు.

-నిందితుల నుండి స్కోడా కారు, ఐదు సెల్ ఫోన్ లను, ముప్పై వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్న నందిగామ పోలీసులు.

2020-08-26 06:53 GMT

Amaravati updates: రాష్ట్రం మొత్తం ఉన్న 70వేల మంది పోలీసు అధికారులతో ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ వీడియో కాన్ఫరెన్స్

-అమరావతి

-రాష్ట్రం మొత్తం ఉన్న 70వేల మంది పోలీసు అధికారులతో ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ వీడియో కాన్ఫరెన్స్

-పోలీసు‌ శాఖలోని అన్ని అంతర్గత డిపార్ట్మెంట్లతో వీడియో కాన్ఫరెన్స్ లో ఏపీ డీజీపీ

-ఫ్రెండ్లీ పోలీసింగ్ పై అందరు పోలీసు అధికారులకు దిశా నిర్దేశం

-ఇటీవల జరిగిన శిరోముండనం సంఘటనతో మొత్తం పోలీసులందరికీ ప్రవర్తన నియమావళిపై దిశ నిర్దేశం

-క్రింది స్ధాయి‌ అధికారుల‌ వరకూ దిశా నిర్దేశం

-క్షేత్ర స్ధాయిలో పోలీసు స్టేషన్లకు వస్తున్న బాధితుల పట్ల ఎలా వ్యవహరించాలి అన్న దానిపై దిశ నిర్దేశం

-బాధితులతో పోలీసుల వ్యవహారశైలి ఎలా ఉండాలి అన్న దానిపై దిశానిర్దేశం

2020-08-26 06:44 GMT

Amaravati updates: కౌలు చెల్లించాలని కోరిన అమరావతి రైతులను అరెస్టు చేయటం దుర్మార్గమని ఖండించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.

-అమరావతి

-కౌలు చెల్లించాలని కోరిన అమరావతి రైతులను అరెస్టు చేయటం దుర్మార్గమని ఖండించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.

-అమరావతి రైతులకు కౌలు చెల్లిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణకు హామీ ఇచ్చారు.

-ఇప్పుడు రైతులపై పోలీసులతో ఉక్కు పాదం మోపుతున్నారు.

-ప్రభుత్వం రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తోంది.

-తక్షణమే అరెస్ట్ చేసిన అమరావతి రైతులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.

2020-08-26 01:38 GMT

Ananthapur updates: సర్వజన ఆస్పత్రి లో అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్

-అనంతపురం :

-సర్వజన ఆస్పత్రి లో అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్

-ఐడీ వార్డు వద్ద ఘటన.. కొన్ని రికార్డులు దగ్ధం.

-హుటాహుటిన వార్డులోని కరోనా బాధితులను ఇతర వార్డులకు షిఫ్ట్ చేసిన అధికారులు.

-విషయం తెలియగానే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించిన ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి, ఎస్పీ సత్యఏసుబాబు.

-వైరింగ్ పాతది కావడంతో షార్ట్ సర్క్యూట్ .

-అగ్నిమాపక శాఖ కార్యాలయం ఆసుపత్రి ఎదురుగా ఉండడంతో నిమిషాల వ్యవధిలోనే సిబ్బంది ఇక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చిన ఫైర్ సిబ్బంది.

-ఎమ్మెల్యే అనంత,ఎస్పీ సత్యఏసుబాబు.

-ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటాం అని ఎమ్మెల్యే హామీ.

-ఘటన పై విచారణకు ఆదేశం

2020-08-26 01:27 GMT

Kurnool updates: శ్రీశైలం జలాశయానికి మళ్లీ కొనసాగుతున్న వరద ప్రవాహం

-శ్రీశైలం జలాశయానికి మళ్లీ కొనసాగుతున్న వరద ప్రవాహం

-2 క్రేస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటివిడుదల చేస్తున్న అధికారులు

-ఇన్ ఫ్లో : 1,48,508 క్యూసెక్కులు

-ఔట్ ఫ్లో : 1,23,586 క్యూసెక్కులు

-పూర్తి స్థాయి నీటి మట్టం : 885 అడుగులు

-ప్రస్తుత : 885.00 అడుగులు

-నీటి నిల్వ సామర్ధ్యం:215.807 టిఎంసీలు

-ప్రస్తుతం : 215.8070 టీఎంసీలు

-కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

Tags:    

Similar News