Live Updates: ఈరోజు (24 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 24 అక్టోబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-10-24 01:22 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు శనివారం | 24 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | అష్టమి ఉ.11-25 వరకు తదుపరి నవమి | ఉత్తరాషాఢ నక్షత్రం ఉ.06-36 వరకు తదుపరి శ్రవణ | వర్జ్యం: ఉ.10-39 నుంచి 12-16 వరకు | అమృత ఘడియలు రా.08-21 నుంచి 09-22 వరకు | దుర్ముహూర్తం: ఉ.05-59 నుంచి 07-29 వరకు | రాహుకాలం: ఉ.09-00 నుంచి 10-30 వరకు | సూర్యోదయం: ఉ.05-59 | సూర్యాస్తమయం: సా.05-౩౧

ఈరోజు దుర్గాష్టమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు 

ఈరోజు తాజా వార్తలు

Live Updates
2020-10-24 07:55 GMT

విశాఖ

ఏపి ఎడ్యుకేషన్ సెట్ పరీక్షల ఫలితాలు Au VC పి.వి.జి.డి.ప్రసాధరెడ్డి విడుదలచేశారు.

ఎడ్యుకేషన్ సెట్ కు 15658 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు

వారిలో10363 మంది క్వాలిఫై అయ్యారు

99.07 శాతం ఉత్తీర్ణత సాధించారు

ఈ సంవత్సరం బాలికలు ఎక్కువగా ఉత్తీర్ణత సాధించారు

కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహణ

మేథమేటిక్స్ లో మొదటి ర్యాంక్ వేమూరి మాణిక్య కిరణ్మయి 113 మార్క్స్

ఫిజికల్ సైన్స్ ఫాతిమా సిఫాన

ఏ ఆర్. మొదటి ర్యాంక్.97 మార్క్స్,

బయోలాజికల్ సతీష్ చోడవరపు 106 మార్కులు

సోషల్ స్టడీస్.బొల్లా రవితేజా రెడ్డి 110 మార్కులు,

ఇంగ్లీషు ముళ్ల అమీర్ భాషా 116 మార్కులతో మొదటి స్థానాలలో నిలిచారు

2020-10-24 07:54 GMT

విజయవాడ

రేపు క్రుష్ణానది లో దుర్గమ్మ నదీ విహారానికి బ్రేక్

ప్రకాశం బ్యారేజి వద్ద వరద ప్రవాహం కొనసాగుతుండడంతో నదిలో తెప్పోత్సవానికి ఆటంకం

ఫంట్ మీద అమ్మవారికి పూజలు మాత్రమే నిర్వహించాలని కో ఆర్డినేషన్ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, సిపి బత్తిన శ్రీనివాసులు, ఇతర అధికార యంత్రంగం కీలక నిర్ణయం

దుర్గగుడి ఇంజినీర్ భాస్కర్ కామెంట్స్

ప్రకాశం బ్యారేజీలో వరద ప్రవాహం ఎక్కువగా ఉన్నందున స్వల్ప మార్పులతో తెప్పోత్సవం నిర్వహించాలని నిర్ణయం

నదిలో విహారం లేకుండా దుర్గా మళ్లేశ్వర స్వామి వార్ల తెప్పోత్సవం నిర్వహించాలని నిర్ణయం

తెప్పోత్సవం సందర్భంగా రేపు సాయంత్రం కృష్ణా నది లో దుర్గా మళ్లేశ్వర స్వామి ఉత్సవ మూర్తులకు యథాతథంగా పూజలు నిర్వహిస్తాం

పరిమిత సంఖ్యలో అర్చకులతో నదిలో అమ్మ,స్వామివార్ల ఉత్సవ మూర్తులకు పూజలు నిర్వహిస్తాం

తెప్పోత్సవం నిర్వహించే పంటు సామర్థ్యాన్ని తనిఖీ చేసి ఫిట్ నెస్ దృవపత్రం తీసుకున్నాకే అనుమతిస్తాం

కోవిడ్ నిబంధనల దృష్ట్యా ప్రకాశం బ్యారేజీ పై భక్తుల రద్దీ నివారణకు చర్యలు తీసుకుంటాం

తెప్పోత్సవం జరుగుతున్నంత సేపు కొత్తగా నిర్మించిన కనకదుర్గ పై వంతెనల పై వాహనాలు, భక్తులు రాకపోకలు ఆపేస్తాం

2020-10-24 07:53 GMT

కృష్ణాజిల్లా

రాష్ట్ర ఎన్నికల కమీషన్ నిమ్మగడ్డ రమేష్ వ్యహారం పై స్పందించిన మంత్రి కొడాలి నాని

మంత్రి కొడాలి నాని

రాష్ట్రంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేను చెప్పిందే వేదం అనే విధంగా వ్యవహరిస్తున్నాడు

నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో కొన్ని నెలల మాత్రమే ఉంటాడు

రాష్ట్ర ప్రభుత్వానికి నిమ్మగడ్డ రమేష్ కన్నా ప్రజల శ్రేయస్సు ముఖ్యం

నిమ్మగడ్డ రమేష్ తాను చెప్పిందే రాజ్యాంగ అంటే కుదరదు

ప్రభుత్వన్ని సంప్రదించకుండా ఏమీ చేయ్యలేరు

రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలంటే ప్రభుత్వాన్ని సంప్రదించకుండా జరిగే పనికాదు

కరోనా మహమ్మారి వల్లన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలు ప్రకారమే ఎవరైనా నడుచుకోవాలి

గతంలో మాదిరిగా ఎన్నికల నిర్వహణ కు ఎక్కువ మందిని తరలించడం సాద్యం కాదు

కరోనా మహమ్మారి వల్లన ఎవరు వచ్చే పరిస్థితి లేదు

గతంలో మాదిరిగా కాకుండా పోలింగ్ బూత్ లు, సిబ్బంది పెంచాలి

ఈ వి యం మీషన్, బ్యాలెట్ పేపర్ అనేవి కరోనా, ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని వ్యహరించాలి

ప్రజల ఆరోగ్యం దృష్ట్యా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ఆలోచన ప్రస్తుతం ప్రభుత్వానికి లేదు

నవంబర్, డిసెంబర్ నెలలో మరోసారి వైరస్ వ్యాప్తి జరిగే అవకాశం ఉందని హెచ్చరికలు ఉన్నాయి

దసరా తరువాత సెకెండ్ వేవ్ ఉంటుందని నిపుణులు చెపుతున్నారు

బీహార్ లో కచ్చితంగా జరగాల్సిన రాష్ట్ర ఎన్నికలు కనుక నిర్వహించక తప్పలేదు

రాష్ట్ర ఎన్నికలు రాజ్యాంగ ప్రకారం జరిగి తీరాల్సిందే

బీహర్ ఎన్నికలతో స్థానిక ఎన్నికలు పోల్చకూడదు

2020-10-24 07:53 GMT

తిరుమల

నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టం చక్రస్నానం మహోత్సవం వైభవోపేతంగా నిర్వహించం.

ఇవాళ సాయంత్రం నిర్వహించే బంగారు తిరుచ్చి ఆధ్యాత్మిక కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం.

స్వామి వారి సంకల్పంతోనే బ్రహ్మోత్సవాలు నిర్విఘ్నంగా ఏకాంతంగా జరిగాయి.

నవరాత్రి ఉత్సవాలలో ఎటువంటి ఆటకం లేకుండా అర్చకులు, జీయర్ స్వాములు నిర్వహించినందుకు ధన్యవాదాలు.

సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం, టోకెన్ల పెంపుపై అధికారులతో సమీక్షించి, మరో రెండు రోజుల్లో తుది నిర్ణయం ప్రకటిస్తాం.

కేఎస్ జవహర్ రెడ్డి , టీటీడీ ఈవో

2020-10-24 07:52 GMT

అనంతపురం:

టీడీపీ హిందూపురం పార్లమెంటు అధ్యక్షులు బి.కె పార్థసారథి ప్రెస్ మీట్

జిల్లాలో మంత్రి పనులు చేయదు...ప్రజలు కాబట్టరు. ....

అసలు జిల్లాలో ఎంతమంది రైతులు ఉన్నారో మంత్రి కి తెలుసా..

తెలుగుదేశం జాతీయ పార్టీ నేత నారా లోకేష్ అనంత పర్యటనకు వస్తే సభ్యత, సంస్కారం లేకుండా మంత్రి మాట్లాదుతున్నాడు.

ముందు నుంచి రైతుల పక్షాన ఉందేడ్జి తెలుగుదేశం ప్రభుత్వమే.

హంద్రీనీవా ప్రాజెక్టును పూర్తి చేసి చెరువు లన్నిటికి నీరు ఇచ్చిన ఘనత చంద్రబాబు దే

మంత్రి సంస్కారం తో మాట్లాడటం నేర్చుకోవాలి.

2020-10-24 07:51 GMT

విజయవాడ

బెజవాడ దుర్గమ్మ ఆలయంలో ముగిసిన దుర్గదేవి అలంకారం..

12 గంటల నుంచి 2 గంటల వరకు అలంకారం మార్పు బ్రేక్

2 గంటల నుంచి మహిషాసురమర్ధిని దేవి అలంకారంలో భక్తులకు దర్శనం

రాత్రి 8గంటల వరకు అమ్మవారి దర్శనం

2020-10-24 07:51 GMT

కడప :

పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్

తులసిరెడ్డి కామెంట్స్ ...

పోలవరం ప్రాజెక్టు కాంగ్రెసు పార్టీ మానస పుత్రిక

1980 లో కాంగ్రెస్ .ముఖ్యమంత్రి అంజయ్య గారు శంకుస్థాపన చేశారు..

2004 లో కాంగ్రెస్ సిఎం వైస్ రాజశేఖర్ రెడ్డి పరిపాలనా అనుమతులిచారు..

పోలవరం రాష్ట్రానికి ప్రకృతి ప్రసాదించిన వరం...

పోలవరం బహుళార్ధ సాధక ప్రాజెక్టు, గ్రావిటీ ప్రాజెక్టు..

విభజన చట్టంలోని సెక్షన్ 90 ప్రకారం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదే...

బిజెపి మోసగారి తనం,టీడీపీ ,వైకాపా ప్రభుత్వా ల చేతకానితనం వల్ల నత్తనడకన సాగుతున్నాయి ..

కేంద్రం నిర్వాసితులకు పూర్తి న్యాయం చేస్తూ,రాష్ట్రానికి భారం పడకుండా .త్వరగతిన కేంద్రం పూర్తి చేయాలి

2020-10-24 07:51 GMT

అమరావతి

ట్విట్టర్ లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్...

కూల్చివేతల జగన్ రెడ్డి రాక్షస ఆనందానికి అడ్డు, అదుపు లేదు.సీఎం స్థానంలో ఉన్న వారికి అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పుడు కిక్ వస్తుంది.

జగన్ రెడ్డి కి విధ్వంసం కిక్ ఇస్తుంది.

సుదీర్ఘ చరిత్ర ఉన్న గీతం యూనివర్సిటీ కట్టడాల కూల్చివేత రాజకీయ కక్ష సాధింపుకు పరాకాష్ట.

కరోనా కష్ట కాలంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సేవలు అందించింది గీతం ఆసుపత్రి.

ఎన్నో ఏళ్లుగా విద్యా, బుద్ధులు నేర్పి ఎంతో మందిని ఉన్నత స్థానాలకు చేర్చిన గీతం యూనివర్సిటీ పై విధ్వంసం జగన్ రెడ్డి నీచ స్థితికి అద్దం పడుతోంది.

కనీసం నోటీసు ఇవ్వకుండా యుద్ధవాతావరణం సృష్టించారు.

మొన్న సబ్బం హరి గారి ఇల్లు, నేడు గీతం యూనివర్సిటీ.

పడగొట్టడమే తప్ప నిలబెట్టడం తెలియని వ్యక్తి జగన్ రెడ్డి.విశాఖ లో విధ్వంసం సృష్టించి ప్రజలను భయబ్రాంతులకు గురిచెయ్యడమే జగన్ రెడ్డి లక్ష్యం.

2020-10-24 07:49 GMT

పశ్చిమ గోదావరి జిల్లా

ఏలూరులో ప్రారంభమైన సబ్సిడీ ఉల్లి విక్రయాలు

భారీగా బారులు తీరిన విద్యార్థులు, చిన్నారులు

వార్డెన్ తీసుకురమ్మన్నారని, వివరాలు చెబితే ఊరుకోరని అంటున్న విద్యార్థులు

కేజీ ఉల్లి 40 రూ.లకు ఇవ్వడంతో వార్డెన్ విద్యార్థులను ఉల్లి కొనుగోళ్ళకు పంపడంపై అనుమానాలు

అది ఏ హాస్టల్, ప్రభుత్వ లేక ప్రయివేట్ ఆ, లేక దళారీలు పంపారా అనేది తెలియాల్సి ఉంది.

2020-10-24 07:49 GMT

విజయవాడ

ఈడీ, వెంకటేశ్వరరావు, విజయవాడ జోన్

హైదరాబాదు నుంచీ గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలకు వచ్చేవారికి షటిల్ సర్వీసులు

గరికపాడు, కల్లూరు, తిరువూరు దాటాక మిరియాల గూడా చెక్ పొస్టు వరకూ, పశ్చిమగోదావరి జిల్లా నుంచీ తెలంగాణ బోర్డర్ వరకూ

ప్రతీ పది నిముషాలకూ ఒక బస్సు ఉండేలా ఏర్పాటు

వంద బస్సులు ప్రతీ చెక్ పోస్టు వరకూ వెళ్ళేలా ఏర్పాటు

Tags:    

Similar News