Live Updates: ఈరోజు (24 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-10-24 01:22 GMT
Live Updates - Page 2
2020-10-24 05:58 GMT

విజయవాడ

ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

తెలంగాణా, ఏపీ ఆర్టీసీ ల మధ్య కుదరని ఒప్పందాలు

ఏపీ బార్డర్ వరకూ బస్సులు నడిపేందుకు రంగం సిద్ధం చేసిన అధికారులు

ప్రయాణీకుల సౌలభ్యం కోసం ఏర్పాట్లు

రెండు రాష్ట్రాల మంత్రులు, అధికారుల నాల్గవ విడత చర్చలు విఫలం

2020-10-24 05:58 GMT

విజయవాడ

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ కి కరోనా పాజిటివ్.. శనివారం నిర్వహించిన పరీక్షలలో నిర్ధారణ, 14 రోజుల హోమ్ క్వరంటీన్ లో ఉండాలని వైద్యుల సూచన

2020-10-24 05:57 GMT

కర్నూలు జిల్లా

దేవనకొండ మండలం ప్యాలకుర్తి లో దారుణం... ఇంట్లో ఒంటరిగా ఉన్న తొమ్మిదివ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం....

అత్యాచారం తరువాత నోట్లో గుడ్డ పెట్టి బలవంతంగా నోట్లోకి పురుగుల మందు తాపీ పరారు అయ్యిన ముగ్గురు వ్యక్తులు....

మనుషులను గుర్తు పట్టకుండా ఉండడానికి ముఖానికి నల్లటి మసి పూసుకున్న యూవకులు....

ఇంత దారుణం జరిగిన ఏమి తెలియనట్లు వ్యవహరిస్తున్న పోలీసులు......

అమ్మాయి పరిస్థితి విషమం కర్నూలు హాస్పటల్ కి తరలింపు,.

2020-10-24 05:57 GMT

విశాఖ

పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు కామెంట్స్

గీతంలో అక్రమ కట్టడాలు తొలగిస్తుంటే ప్రభుత్వ కక్షసాధింపు చర్యలు అంటున్నారు.

గతంలో టీడీపీ నాయకులు విశాఖలో అనేక భూ ఆక్రమణలు చేశారు.

గాంధీ పెరు పెట్టుకొని గాడ్సే పనులు చేస్తున్న చందంగా ఉంది గీతం విశ్వవిద్యాలయం.

ఇటువంటి విశ్వవిద్యాలయం లో విద్యను అభ్యసిస్తే సమాజానికి ముప్పు తప్పదు.

టీడీపీ నాయకులు ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్నారు.

భూ ఆక్రమణలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు.

2020-10-24 05:56 GMT

విశాఖ

అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ కామెంట్స్

విశాఖలో అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూమిని స్వాదీనం చేసుకుంటే కొంతమంది దుస్పచారం చేస్తున్నారు.

నారాలోకేష్ తోడొల్లుడు భరత్ దాదాపు 40 ఎకరాల భూమిని తన ఆక్రమణలో పెట్టుకున్నారు.

దాదాపు ఎనిమిది వందల కోట్లు విలువ గల భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

విశ్వవిద్యాలయానికి గాంధీ పేరుపెట్టి అక్రమాలకు పాల్పడుతున్నారు.

ఐదు నెలల క్రితం గీతం యాజమాన్యానికి అధికారులు తెలియజేశారు.

ప్రభుత్వ భూమి ప్రైవేటు వ్యక్తులు ఆక్రమణలో ఉంటే ప్రభుత్వం స్వాదీనం చేసుకోవడానికి ఎవ్వరికి చెప్పాల్సిన అవసరం లేదు.

గత ప్రభుత్వంలో అత్యంత అవినీతికి పాల్పిడిన వ్యక్తిని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడుని చేసింది.

ప్రభుత్వ భూములు ఆక్రమించిన ఎవ్వరిని విడిచిపెట్టేది లేదు.

2020-10-24 05:55 GMT

అమరావతి

ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి విజయ దశమి శుభాకాంక్షలు

రాష్ట్ర ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు

చెడుపై మంచి, దుష్ట శక్తుల మీద దైవ శక్తులు సాధించిన విజయానికి గుర్తుగా దసరా పండుగ

చెడు ఎంత దుర్మార్గమైనదైనా, ఎంత శక్తిమంతమైనదైనా అంతిమ విజయం మంచినే వరిస్తుందని మహిషాసురుడిపై జగన్మాత సాధించిన విజయం ప్రపంచానికి చాటింది

జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని, ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు వరించేలా దుర్గామాత దీవించాలని కోరుకుం టు న్నాను: సీఎం జగన్

2020-10-24 05:55 GMT

తిరుపతి

తిరుపతి పర్యటన నిమిత్తం ఢిల్లీ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న

బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దేవదార్ కు విమానాశ్రయం వద్ద బిజెపి నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

2020-10-24 05:55 GMT

విజయవాడ

బ్రేకింగ్

దివ్య తేజస్విని కేసులో పురోగతి

సాక్షుల విచారణ పూర్తిచేసిన పోలీసులు

ఛార్జి షీటు సిద్ధం చేసిన పోలీసులు

నిందితుడు నాగేంద్రను సోమవారం డిచ్ఛార్జ్ చేసే అవకాశం

నాగేంద్ర డిచ్ఛార్జ్ అనంతరం, అతనిని విచారణ చేయనున్న పోలీసులు

పండగ సెలవులు ముగిసాక కోర్టుకు ఛార్జి షీటు

దివ్య తేజస్విని పోస్ట్ మార్టం ఫోరెన్సిక్ నివేదికలలో నమ్మలేని నిజాలు

వివిధ కోణాలో లోతుగా విచారించిన పోలీసులు

నాగేంద్రతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం

ఇన్ స్టా, ఫేస్ బుక్ నకిలీ క్రియేట్ చేసిన వారిపై చర్యలకు రంగం సిద్దం

దివ్య తేజస్విని స్వయంగా గాయాలు చేసుకోలేదన్న పోస్ట్ మార్టం, ఫోరెన్సిక్ నివేదికలు

దివ్య తేజస్విని పై కత్తితో దాడి చేసాక, ఎవరికీ అనుమానం రాకుండా నాగేంద్ర కోసుకున్నట్టు తెల్చిన ఫోరెన్సిక్ నిపుణులు

2020-10-24 03:08 GMT

విజయవాడ

అమ్మవారిని దర్శించుకున్న మాజీ హోమ్ మంత్రి చిన్నారాజప్ప

అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన రాజప్ప.

చిన్నారాజప్ప, మాజీ మంత్రి

అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది.

కోవిడ్ కారణంగా ప్రజల్లో అవగాహన వచ్చి భక్తుల రాక తగ్గింది.

ప్రభుత్వం ఏర్పాట్లు అన్ని బాగా చేసింది.

ఈ రోజు, రేపు పెద్ద ఎత్తున భవానీ వస్తారు కాబట్టి అధికారులు దానికి తగ్గ ఏర్పాట్లు చేయాలి.

కరోనా మహమ్మారి త్వరగా పోవాలి అని అమ్మవారిని కోరుకున్న.

2020-10-24 03:08 GMT

విజయవాడ

అమ్మవారిని దర్శించుకున్న డీజీపీ గౌతమ్ సవాంగ్

అమ్మవారికీ ప్రత్యేక పూజలు చేసిన డీజీపీ

ఈ నెల 21న విరిగిపడ్డ కొండచరియలను పరిశీలించిన డీజీపీ

Tags:    

Similar News