Live Updates: ఈరోజు (23 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 23 అక్టోబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు శుక్రవారం | 23 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | సప్తమి మ.12-01 వరకు తదుపరి అష్టమి | పూర్వాషాఢ నక్షత్రం ఉ.06-46 వరకు తదుపరి ఉత్తరాషాఢ | వర్జ్యం: మ.02-43 నుంచి 04-18 వరకు | అమృత ఘడియలు రా.12-15 నుంచి 03-22 వరకు | దుర్ముహూర్తం: ఉ.08-15 నుంచి 09-02 వరకు తిరిగి మ.12-09 నుంచి 12-56 వరకు | రాహుకాలం: ఉ.10-30 నుంచి 12-00 వరకు | సూర్యోదయం: ఉ.05-59 | సూర్యాస్తమయం: సా.05-31
ఈరోజు తాజా వార్తలు
//జయశంకర్ భూపాలపల్లి జిల్లా
//24 గేట్లు ఎత్తిన అధికారులు
//పూర్తి సామర్థ్యం 100.00 మీటర్లు
//ప్రస్తుత సామర్థ్యం 97.50 మీటర్లు
//ఇన్ ఫ్లో 44,900 క్యూసెక్కులు
//ఔట్ ఫ్లో 44,900 క్యూసెక్కులు
శంషాబాద్:
-శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సుమారు 70 లక్షల రూపాయల విలువ చేసే 1.4 కిలోల విదేశీ బంగారం పట్టివేత.
-విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ కస్టమ్స్ అధికారులు అందించిన సమాచారం మేరకు విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వచ్చిన ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకున్న శంషాబాద్ కస్టమ్స్ అధికారులు.
-నిందితులు లో దుస్తులలో దాచి తీసుకుని వస్తున్న 4 బంగారం బిస్కెట్ ముక్కలను స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు.
-దుబాయ్ నుండి వైజాగ్ మీదుగా హైదరాబాద్ వస్తున్న ఫ్లైట్ లో బంగారం తీసుకుని వచ్చిన ఇద్దరు ప్రయాణికులు వైజాగ్ లో దిగిపోగా వారిచ్చిన సమాచారం మేరకు వైజాగ్ లో అదే ఫ్లైట్ ఎక్కిన మరో ఇద్దరు ప్రయాణికులు విదేశీ బంగారం ను హైదరాబాద్ కు తరలించేందుకు ప్రయత్నించారు.
-దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులను వైజాగ్ లో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకొని విచారించగా బంగారం విషయం తెలిసింది.
-అప్పటికే ఫ్లైట్ వైజాగ్ నుండి హైదరాబాద్ కు బయలుదేరడంతో శంషాబాద్ ఎయిర్ పోర్టు కస్టమ్స్ అధికారులకు సమాచారం అందించిన వైజాగ్ కస్టమ్స్ అధికారులు.
-వైజాగ్ కస్టమ్స్ అధికారులు అందించిన సమాచారం మేరకు శంషాబాద్ ఎయిర్ పోర్టు లో నిందితులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారి వద్దనుంచి బంగారం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న శంషాబాద్ కస్టమ్స్ అధికారులు.
తెలంగాణ
// రేపు తెలంగాణ ఎంసెట్ అగ్రికల్చర్ ఫలితాల వెల్లడి
// ఫలితాలు విడుదల చేయనున్న ఉన్నత విద్యా మండలి
తెలంగాణ
// రేపు తెలంగాణ ఎంసెట్ అగ్రికల్చర్ ఫలితాల వెల్లడి
// ఫలితాలు విడుదల చేయనున్న ఉన్నత విద్యా మండలి
-ఉత్తమ్ కుమార్ రెడ్డి.. టీపీసీసీ అధ్యక్షుడు.
-ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోళ్లు రైతుల విజయం.. కాంగ్రెస్ పోరాట ఫలితం.. ఉత్తమ్ కుమార్ రెడ్డి.
-రైతులకు సంపూర్ణ న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు..
-రాష్ట్రంలో మొక్కజొన్న రైతులు, కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాట ఫలితంగానే ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోళ్ళకు అనుమతి ఇచ్చిందని రైతులు, కాంగ్రెస్ పార్టీ విజయం.
-రాష్ట్రంలో జగిత్యాల, కామారెడ్డి ప్రాంతాలలో మొక్కజొన్న రైతులు పెద్దఎత్తున పోరాటం చేసారని వారికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించి పోరాటంలో పాల్గొన్నారు.
-రైతులు, కాంగ్రెస్ చేసిన పోరాటాల ఫలితంగా ప్రభుత్వం దిగొచ్చింది.
-రాష్ట్రంలో భారీ వర్షాలకు, వరదలకు మొక్కజొన్న పంటలు బాగా దెబ్బతిన్నాయని వర్షాలకు పాడైన పంటలకు కూడా మద్దతు ధరలు ఇచ్చి కొనుగోలు చేయాలని డిమాండ్.
-రైతులకు సంపూర్ణ న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉండి పోరాటం చేస్తుంది.
సిద్దిపేట జిల్లా..
- దుబ్బాక నియోజకవర్గం రాయపోల్ మండల రామారం సభలో మంత్రి హరీష్ రావు సమక్షంలో కాంగ్రెస్ నుండి టి ఆర్ ఎస్ లో చేరిన దౌల్తాబాద్ మాజీ వైస్ ఎంపీపీ తలారి నర్సింలు తో పాటు పలువురు నాయకులు పెద్ద ఎత్తున చేరికలు
హరీష్ రావు కామెంట్స్:
- దుబ్బాకలో ఎక్కడికి పోయినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు..ఘన స్వాగతం పలుకుతున్నారు..
- బీడీ కార్మికులకు 2016 పెన్షన్ కేసీఆర్ ఇస్తున్నారు...కాంగ్రెస్ పార్టీ బీడీ లకట్టల పై పుర్రె గుర్తు పెట్టింది..BJP బీడీల కట్టల పై పుర్రె గుర్తు పెట్టింది..
- కాంగ్రెస్ పార్టీహయాంలో ఎప్పుడు కరెంటు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి..
- 101 కోట్ల తో దుబ్బాక నియోజకవర్గం లో ట్రాన్స్ఫార్మర్లు, సబ్ స్టేషన్ లు ఏర్పాటు చేసినం..నాణ్యమైన కరెంటు ఇచ్చినం.
- 50 ఏండ్లు కాంగ్రెస్20 ఏండ్లు BJP TDP పార్టీలు పాలించాయి... ఒక్క గ్రామానికి కూడా తాగడానికి కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదు..
- ఎన్నికలప్పుడు వచ్చి ప్రజలకు ఝూట మాటలు చెప్పడం, అబద్ధాల ప్రచారాలు చేయడం కాంగ్రెస్, BJP లకు అలవాటు గా మారింది..
- బీడీ ల పెన్షన్ లో 1600 మోడీ ఇస్తున్నాడని BJP తప్పుడు ప్రచారం చేస్తున్నది...దీని పై బహిరంగ చర్చకు రావాలని BJP నేత బండి సంజయ్ కి సవాల్ విసిరిన...నిరూపిస్తే రాజీనామా చేస్తానన్న ఒక్కడు రాలే.. దొంగలెక్క తిరుగుతున్నరు..బీజేపీ నేతలది నల్లమొఖమయ్యింది..
- కేసీఆర్ కిట్ లో కేంద్రానిది ఒక్క రూపాయి లేదు..
- TRS పార్టీ చెప్పింది చేస్తది..చేసింది చెబుతుంది..
- అడుగడుగునా అభివృద్ధికి కాంగ్రెస్, BJP లు అడ్డు తగులుతున్నాయి..కాంగ్రెస్ పార్టీ నేతలు కోర్టుల్లో కేసులు వేస్తూ ప్రాజెక్టులు కట్టకుండా అడ్డు తగులుతున్నారు..
- ఎన్ని అడ్డంకులు కల్పించినా సీఎం కేసీఆర్ మొండి ధైర్యంగా కొండ పోచమ్మ సాగర్,కాలేశ్వరం ప్రజెక్టు ను పూర్తి చేయించారు..
- కాంగ్రెస్ అంటే కాలిపోయిన మోటర్లు. BJP అంటే..బాయికాడ మోటర్లు..
- ఎన్నికలు రాగానే బీజేపీ కాంగ్రెస్ నేతలు వచ్చి.ఆపద మొక్కుకులు మొక్కుతరు.. ఝూట మాటలు చెబుతారు..
- ఓట్లు కాంగనే ఒక్క నేత కనిపించడు..
- కష్ట సుఖాల్లో ఉండేది ఒక్క TRS నాయకులే..
ఎల్బీనగర్...
-మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ లో వరద ముంపు బాధితులను ఆదుకునేందుకు వచ్చిన సబితమ్మ
-ఎన్టీఆర్ నగర్ లో మంత్రి సబితమ్మ అడ్డుకున్న స్థానిక బీజేపీ నాయకులు,స్థానికులు
-డివిజన్ లో టీ.ఆర్.ఎస్ కార్యకర్తలకే తక్షణ నష్టపరిహారం ఇస్తున్నారని అంటూ స్థానికుల ఆరోపణ
-నష్ట పరిహారం విషయం లో నిలదీసిన మహిళలు.
-స్థానిక బీజేపీ కార్పొరేటర్ రాధ దిరాజ్ రెడ్డి కి మంత్రికి మద్య వాగ్వివాదం
-వెను తిరిగిన మంత్రి సబితమ్మ
నాగర్‌కర్నూల్ ..
-రెండు రోజులుగా స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్న ఎమ్మెల్యే.
-నేడు హైదరాబాదులో చికిత్సలు చేయించుకోగా కరోనాగా నిర్ధారించిన వైద్యులు.
-తాను ఆరోగ్యంగానే ఉన్నాను.. తన నివాసంలో ప్రస్తుతం హోమ్ క్వారయింటైన్ లో వున్నాను.. ఎమ్మెల్యే మర్రి.
-నియోజకవర్గ ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందవద్దు.
-తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని, వైద్యపరంగా అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి.
తెలంగాణ..
#తెలంగాణ పూల పండుగ బతుకమ్మ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ శుభాకాంక్షలు
#ప్రజలంతా కొవిడ్ ఆంక్షలకు అనుగుణంగా... సురక్షితంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించుకోవాలి.
#తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతికగా బతుకమ్మ నిలుస్తుంది
# ప్రకృతి మాతకు పట్టం కట్టడమే బతుకమ్మ సంబరాలు
# ఈ ఉత్సవాల్లో వినియోగించే పూలకు అత్యంత విలువైన మెడిసినల్ విలువలు ఉన్నాయి....వాటిని చెరువుల్లో వదలటం వల్ల అనేక రకాల క్రిములు హరిస్తాయి
హైదరాబాద్
-ఇవాళ ఉదయం ఇరు రాష్ట్రాల ఆర్టీసి ఉన్నతాధికారుల టెలి కాన్ఫరెన్స్...
-తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన లక్షా 61 వేల కిలోమీటర్ల కు ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ అంగీకరిస్తేనే బస్సులు నడుస్తాయని తేల్చి చెప్పిన తెలంగాణ ఆర్టీసీ అధికారులు...
-లక్షా 61 వేల కిలోమీటర్ల నడపడం పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకొని ఏపీఎస్ ఆర్టీసీ...
-గతంలో 2లక్షల 65 వేల కిలోమీటర్లు నడిపిన ఎపి తాము 50 వేల కిలోమీటర్లు తగ్గించుకొని తెలంగాణ 50 వేల కిలోమీటర్లు పెంచుకోవాలని ఏపీఎస్ ఆర్టీసీ తెలంగాణ కు సూచన...
-ఏపిఎస్ ఆర్టీసీ సూచించిన 50 వేళా కిలోమీటర్ల పెంపును అంగీకరించని తెలంగాణ...
-తెలంగాణ ప్రతిపాదించిన లక్షా 61 వేల కిలోమీటర్ల ప్రతిపాదన వల్ల ఇరు రాష్ట్రాల ఆర్టీసీ లకు తీవ్ర నష్టం..
-తెలంగాణ కాకుండా ఏపీ కాకుండా లక్ష కిలోమీటర్ల దూరం ప్రయివేటు ట్రావెల్స్ ఆగడాలు పెరిగే అవకాశం...