Hyderabad updates: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విదేశీ బంగారం పట్టివేత...

శంషాబాద్:

-శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సుమారు 70 లక్షల రూపాయల విలువ చేసే 1.4 కిలోల విదేశీ బంగారం పట్టివేత.

-విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ కస్టమ్స్ అధికారులు అందించిన సమాచారం మేరకు విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వచ్చిన ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకున్న శంషాబాద్ కస్టమ్స్ అధికారులు.

-నిందితులు లో దుస్తులలో దాచి తీసుకుని వస్తున్న 4 బంగారం బిస్కెట్ ముక్కలను స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు.

-దుబాయ్ నుండి వైజాగ్ మీదుగా హైదరాబాద్ వస్తున్న ఫ్లైట్ లో బంగారం తీసుకుని వచ్చిన ఇద్దరు ప్రయాణికులు వైజాగ్ లో దిగిపోగా వారిచ్చిన సమాచారం మేరకు వైజాగ్ లో అదే ఫ్లైట్ ఎక్కిన మరో ఇద్దరు ప్రయాణికులు విదేశీ బంగారం ను హైదరాబాద్ కు తరలించేందుకు ప్రయత్నించారు.

-దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులను వైజాగ్ లో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకొని విచారించగా బంగారం విషయం తెలిసింది.

-అప్పటికే ఫ్లైట్ వైజాగ్ నుండి హైదరాబాద్ కు బయలుదేరడంతో శంషాబాద్ ఎయిర్ పోర్టు కస్టమ్స్ అధికారులకు సమాచారం అందించిన వైజాగ్ కస్టమ్స్ అధికారులు.

-వైజాగ్ కస్టమ్స్ అధికారులు అందించిన సమాచారం మేరకు శంషాబాద్ ఎయిర్ పోర్టు లో నిందితులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారి వద్దనుంచి బంగారం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న శంషాబాద్ కస్టమ్స్ అధికారులు.

Update: 2020-10-23 16:22 GMT

Linked news