Musi Project: సెల్ఫీ దిగుతుండగా నీటిలో పడి యువకుడు మృతి
నల్గొండ : మూసీ ప్రాజెక్టు దిగువన నీటిలో సెల్ఫీ దిగుతుండగా నీటిలో పడి సాయి అనే యువకుడు మృతి....
Police Raids: కోడి పందాలపై ఎస్వోటీ పోలీసుల దాడి
యాదాద్రి : బీబీనగర్ మండలం ముగ్దుంపల్లి శివారులో కోడి పందాలపై ఎస్వోటీ పోలీసుల దాడి.
19 మంది అరెస్ట్,రూ 1.51 లక్షల నగదు, 13 కార్లు,30 బైకులు,35 పందెం కోళ్లు స్వాధీనం.
పరారీలో మరికొంతమంది పందెం రాయుళ్లు.
Medak News: కౌడిపల్లిలో దారుణం
మెదక్:
👉కౌడిపల్లి మండలo కూకట్ల పల్లి గ్రామంలో మామను చంపిన అల్లుడు.
👉మృతుడు దూదేకులా పాషా(45 )నిందితుడు యాదగిరి (30)
👉సoవత్సరం క్రితం పాషా కూతుర్ని, యాదగిరి ప్రేమ వివాహం చేసుకున్నాడు. లో
Selfie craze Selfie craze: జూరాల ప్రాజెక్టు వద్ద సెల్ఫీ మోజులో వ్యక్తి గల్లంతు...
వనపర్తి జిల్లా జూరాల ప్రాజెక్టు వద్ద సెల్ఫీ మోజులో వ్యక్తి గల్లంతు...
మహబూబ్ నగర్ కు చెందిన వ్యక్తి గా అనుమానం... విచారణ జరుపుతున్న పోలీసులు
Kachiguda: తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ ఆధ్వర్యంలో కాచిగూడ వైష్ణవి హోటల్ లో అవగాహన సదస్సు...
- తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ ఆధ్వర్యంలో కాచిగూడ వైష్ణవి హోటల్ లో అవగాహన సదస్సు...
- మాజీ ఎమ్మెల్సీ రాష్ట్రీయ లోక్ దళ్ తెలంగాణ అధ్యక్షులు కపిలవాయి దిలీప్ కుమార్ అధ్యక్షతన ఈ కోవిడ్ అవగాహన సదస్సు జరుగుతుంది...
- ఈ అవగాహన సదస్సులో ప్రధాన వక్తలుగా
- 1.డా. వసంత్ కుమార్ (ప్రముఖ జనరల్ ఫిషియన్ అపోలో హాస్పిటల్)
- 2.డా. శ్యామ్ సుందర్ (ఐసీసీ యూనిట్ స్పెషలిస్ట్) విరిచే కోవిడ్ అవగాహన ...
Siddipet: సైడ్ డ్రైన్ నిర్మాణం కోసం పనులకు శంకుస్థాపన: మంత్రి హరీశ్ రావు
సిద్దిపేట్:
- బుస్సాపూర్ తిమ్మాయిపల్లి రోడ్డు పై రావురూకుల గ్రామ పరిధిలో రూ.24లక్షల రూపాయల వ్యయంతో 11 కిలో మీటర్ల మేర సైడ్ డ్రైన్ నిర్మాణం కోసం పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు.
- అంతకు ముందు గ్రామ చెరువులో చేపలు వదిలారు. ఆ తర్వాత సెగ్రీ గేషన్ షెడ్ ప్రారంభం చేశారు. ఆ తర్వాత గ్రామ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
Nalgonda: తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్..
నల్గొండ :
- ప్రభుత్వం కక్ష కట్టి వ్యక్తిగతంగా దెబ్బకొట్టడానికే నా కొడుకు సుహాస్ నిర్వహిస్తున్న నవ్య ఆస్పత్రి ని అధికారుల తో కలిసి సీజ్ చేయించారు..
- ముప్పై ఏళ్లకింద నకరికల్లు లో నా ఆస్పత్రి పై దాడి చేసి కేసులు పెట్టారు..
- ఇపుడు కేసీఆర్ డైరెక్షన్ లోనే నా కొడుకు నిర్వహిస్తున్న ఆస్పత్రి ని సీజ్ చేయించారు..
- నేను నా కొడుకు ఇద్దరం అనేక మంది పేదలకు వైద్యం అందించాం ...
- కరోనా వైరస్ లో కూడా సేవ చేసాం ..కావాలని రాజకీయ కక్ష్య సాధింపుతో ఆస్పత్రి సీజ్ చేసారు...ప్రజా సేవలో కేసులకు వెనకాడేది లేదు...
- తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్...
సిద్దిపేట జిల్లా :
- గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ఘోరం, మున్సిపాలిటీలో పనిచేసే 9మంది మున్సిపల్ కార్మికులకు కరోనా పాజిటివ్ రాగా వారిని నిర్లక్ష్యంగా అధికారులు చెత్త ట్రాక్టర్ లో RVM ఆస్పత్రికి తరలింపు. అధికారుల తీరుపై ఆగ్రహించి తోటి మున్సిపల్ కార్మికులు మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన.
Sriram Sagar: శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు తగ్గిన వరద..
నిజామాబాద్
- శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు తగ్గిన వరద..
- ఇన్ ఫ్లో 18 వేల క్యూసెక్కు లు
- ఔట్ ఫ్లో వెయ్యి క్యూసెక్కు లు
- పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు, 90 టీఎంసీ లు
- ప్రస్తుత నీటి మట్టం 1088 అడుగులు, 76 టీఎంసీ లు
- మహరాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో నిండిన ప్రాజెక్టులు
- నీటిని విడుదల చేసే అవకాశమున్నందున గోదావరి నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచిస్తూ నిజామాబాదు జిల్లా కలెక్టర్ కు నాందెడ్ జిల్లా కలెక్టర్ వైర్ లెస్ మెసెజ్
- శ్రీరాం సాగర్ కు పెరగనున్న వరద
భద్రాద్రి కొత్తగూడెం :
- భద్రాచలంలో స్వల్పంగా తగ్గుతున్న గోదావరి నీటిమట్టం . ఈ రోజు ఉదయం 8 గంటలకు 48.1 అడుగుల వద్ద ప్రవహిస్తున్న నీటి మట్టం
- సుమారు 7 అడుగులు తగ్గిన వరద
- కొనసాగుతున్న 2వ ప్రమాద హెచ్చరిక