Live Updates:ఈరోజు (ఆగస్ట్-23) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 23 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-08-23 00:26 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు ఆదివారం, 23 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్ల పక్షం పంచమి: (రా. 9-32 వరకు) తదుపరి షష్టి, చిత్త: (రా. 10-15 వరకు) తదుపరి స్వాతి, అమృత ఘడియలు: (సా. 4-18 నుంచి 5-47 వరకు) వర్జ్యం: (ఉ. 7-22 నుంచి 8-51 వరకు తిరిగి తె. 3-27 నుంచి 4-57 వరకు) దుర్ముహూర్తం: (సా. 4-38 నుంచి 5-28 వరకు) రాహుకాలం: (సా. 4-30 నుంచి 6-00 వరకు) సూర్యోదయం: ఉ.5-47 సూర్యాస్తమయం: సా.6-19

ఈరోజు తాజా వార్తలు

Live Updates
2020-08-23 17:32 GMT

బీజేపీ మీడియా స్టేట్మెంట్

కె కృష్ణసాగర రావు

ముఖ్య అధికార ప్రతినిధి, బీజేపీ, తెలంగాణ రాష్ట్రం. చే 

అనుకున్నట్టుగానే, కాంగ్రెస్ పార్టీ కుప్పకూలడానికి అంచుల్లో, చివరి దశలో ఉంది. కాంగ్రెస్ ఒక అప్రజాస్వామిక ఏర్పాటు అని చేస్తోన్న స్పష్టమైన ఆరోపణకు బీజేపీ కట్టుబడే ఉంది. ఆ పార్టీ ప్రారంభం నుంచీ నెహ్రూ కుటుంబ కబంధ హస్తాల్లోనే ఉంది.

సీడబ్ల్యూసీ సభ్యులు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, మాజీ, తాజా ఎంపీలు దాదాపు 23 మంది కలసి కాంగ్రెస్ పార్టీని ఆమూలాగ్రం సంస్కరించాలంటూ సోనియా గాంధీకి లేఖ రాశారు. ఓ రకంగా కాంగ్రెస్ ను కుదిపేసే బహిరంగ పిలుపు ఇది.

కాంగ్రెస్ సీనియర్లు రాసిన ఈ లేఖ అంతర్లీనంగా, ఆ పార్టీ ప్రస్తుత నాయకత్వం మీద దాడే. అంతేకాదు, అది సోనియా రాజీనామాకు స్పష్టమైన డిమాండ్ కూడా. కాంగ్రెస్ అధ్యక్షులుగా కుటుంబం బయటి వ్యక్తే ఉండాలన్న ప్రియాంక వాద్రా తాజా ప్రకటన, ఈ లేఖకు ప్రభావమే.

ఒక జాతీయ ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ అనే మాట, ఆ ఆట ముగిసిపోయాయని బీజేపీ బలంగా నమ్ముతోంది. ఆ పార్టీ వ్యవస్థాగత బలాన్ని కోల్పోయింది. అసలు దశాబ్ద కాలంగా చెప్పుకోదగ్గ, నడిపించదగ్గ సరైన నాయకత్వమే లేకుండా చుక్కాని లేని నావలా ఉంది కాంగ్రెస్ పరిస్థితి.

కాంగ్రెస్ తన పతనానికి తన సొంత వ్యవస్థాగత నిర్మితిని తప్ప, మరెవరినీ బాధ్యులు చేయజాలదు.

2020-08-23 17:28 GMT

జగిత్యాల : ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం లో దర్శనాలు నిలిపివేత...

ధర్మపురి లో covid 19 విజృంభిస్తున్న నేపథ్యం లో ఐదు రోజులు ఆలయం లో దర్శనాలు నిలిపివేత

ఈనెల 28వ తేదీ నుండి భక్తులకు దర్శనాలు యథాతథం.

2020-08-23 17:21 GMT

సీఎం హామీలపై ప్రజల దగ్గరకు వెళ్లాలని నిర్ణయించుకున్నమ్- తూర్పు జగ్గారెడ్డి .

 రైతులకు రుణమాఫీ ఏమైందని కూడా అడుగుతాం

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో డబుల్ బెడ్ రూమ్ ఇస్తా అని గెలిచాడు...

మళ్ళీ జీహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చాయి... ఇప్పుడు ఏం చెప్తారు..?

 జీహెచ్ఎంసీ లో కూడా రథయాత్ర చేయాలి

ప్రజల సమస్యలపై పోరాటం చేయాలని పీసీసీ, సీఎల్పీ నేతకు చెప్పిన

కేసీఆర్ ఎన్ని హామీలు ఇచ్చారో ప్రజలకు .. మాకు గుర్తుండటం లేదు

హామీలు తెలుసుకుందామని నెట్ లో చూస్తే   తెరాస మేనిఫెస్టో లేకుండా చేశారు

2014 ఎన్నికల్లో 12 శాతం ముస్లిం, ఎస్టీలకు రిసేర్వేషన్ అన్నాడు ఇప్పటి వరకు లేదు

57 ఏండ్లు నిండిన వారికి పెన్షన్ లేదు.. నిరుద్యోగులకు భృతి లేదు

డబుల్ బెడ్ రూమ్ కూడా సిద్దిపేట, గజ్వేల్ లో తప్పితే ఎక్కడా లెవ్వు

మొదటి విడత జీహెచ్ఎంసీ  లో రథయాత్ర..  

రెండో విడత మండల, జిల్లాలో రథయాత్ర చేపట్టాలని పార్టీకి సూచించా

2020-08-23 17:17 GMT

మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడిన సీఎం జగన్ మోహన్ రెడ్డి.

కొన్నిరోజుల కిందట అనారోగ్యంతో కన్నుమూసిన ఎడ్మ కృష్ణా రెడ్డి.

1994,2004లో శాసనసభ్యుడిగా పని చేసిన కృష్ణా రెడ్డి.

ఒక దఫా ఇండిపెండెంట్ గా, మరోసారి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా ఎన్నిక.

కిష్టారెడ్డి కుమారుడు సత్యంతో మాట్లాడిన సీఎం జగన్.

కుటుంబానికి అండగా ఉంటానని

నిబ్బరంగా ఉండాలన్న సీఎం

హైదరాబాద్ వచ్చినప్పుడు తనని కలుస్తానని ధైర్యంగా ముందుకు సాగలన్న సీఎం.

2020-08-23 17:14 GMT

ఆదిలాబాద్ బాసర, అసిపాబాద్ లలో కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు గ్రీన్ సిగ్నల్..

విద్యాలయాలు ఏర్పాటుకు సమగ్ర ప్రతిపాదనలు సమర్పించాలని రాష్ట్ర పాఠశాల విద్యశాఖ కు అదేశాలను జారీచేసిన మానవ వనరుల శాఖమంత్రిత్వశాఖ..

మానవనరుల శాఖ మంత్రిత్వశాఖ కు క్రుతజ్నతలు తెలిపిన. ఎంపి సోయం బాపురావు

2020-08-23 17:11 GMT

సిద్దిపేట జిల్లా : సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామంలో రూ. 12లక్షలతో నూతనంగా నిర్మించిన సమీకృత మార్కెట్ ను మరియు 31 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామంచాయతీ భవనాన్ని ప్రారంభించి న మంత్రి హరీశ్ రావు.

2020-08-23 17:05 GMT

శ్రీశైలం దుర్ఘటనలో మృతి చెందిన డీఈ శ్రీనివాస్ గౌడ్, ఏఈ ఫాతిమా కుటుంబాలను పరామర్శించిన ఎంపీ రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ.

శ్రీశైలం ఘటనకు మంత్రి జగదీష్ రెడ్డి, సీఎండీ ప్రభాకర్ రావు నిర్లక్ష్యమే కారణం.

ప్రమాదం పొంచి ఉందని క్షేత్ర సిబ్బంది రెండు రోజుల క్రితమే లేఖ రాసినా స్పందించ లేదు.

ఇవి ప్రమాద మరణాలు కాదు... ప్రభుత్వ హత్యలు

మంత్రి జగదీష్ రెడ్డి, సీఎండీ ప్రభాకర్ రావుల పై ఐపీసీ 302 సెక్షన్ కింద కేసులు పెట్టి, అరెస్టు చేయాలి.

వీరిద్దరిని పదవుల్లో కొనసాగిస్తే ఘటనకు కేసీఆర్ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది.

హైదరాబాద్ లోనే ఉన్న బాధిత కుటుంబాలను పరామర్శించని కేసీఆర్ కు అసలు మానవత్వం ఉందా

కేసీఆర్ కంటే రోశయ్యే నయం

80 ఏళ్ల వయస్సులో సీఎంగా శ్రీశైలం వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు

మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం, ఇంట్లో ఒకరికి ఉద్యోగం, హైదరాబాద్ లో 500 గజాల స్థలం ఇవ్వాలి

ఘటన పై సీబీఐ విచారణ జరగాలి

2020-08-23 16:57 GMT

మహబూబ్ నగర్ : శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్టు ప్రమాదంలో బయటకు వచ్చిన ఇద్దరు ఏఈలు సుందర్, మోహన్ మద్య చివరి వాయిస్...

ఇక కష్టం మన పని అయిపోయింది

ఆశలు వదులుకో మోహన్ తో సుందర్..  నై.. బై.. ఆశగా ఉండాలన్న మోహన్..

ప్రాణాలపై ఆశలు వదులుకోవాలి : సుందర్..

నిన్న సుందర్ ఫోన్ చార్జింగ్ పెట్టిన భార్య ప్రమీల.. స్విచ్ ఆన్ చేయగా వెలుగు చూసిన వీడియోలోని వాయిస్..

కన్నీకు మున్నీరుగా విలపిస్తున్న సుందర్, మోహన్ ల కుటుంబాలు.

2020-08-23 16:53 GMT

వరంగల్ రూరల్ జిల్లా : దుగ్గొండి మండలం దేశాయపల్లి గ్రామంలో అక్రమంగా నిల్వ చేసిన 61క్వింటాళ్ల పిడియస్ బియ్యాన్ని పట్టుకున్న పోలీసులు..

2020-08-23 16:50 GMT

మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కస్తూరి నగరంలో అక్రమంగా రవాణా చేస్తున్న 9 కింటాల నల్లబెల్లం, ఆటో స్వాధీనం చేసుకొని ముగ్గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు.

Tags:    

Similar News