Live Updates: ఈరోజు (సెప్టెంబర్-22) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-09-22 00:30 GMT
Live Updates - Page 2
2020-09-22 11:13 GMT

CM Jagan in Delhi: ఢిల్లీ చేరుకున్న ఏపీ సీఎం జగన్..

జాతీయం..

ఢిల్లీ:

-కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలవనున్న సీఎం

-రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను చర్చించనున్న సీఎం

-పోలవరం ప్రాజెక్టుకు నిధులు, తాజా పరిస్థితులను చర్చించనున్న సీఎం

2020-09-22 10:56 GMT

Nellore updates: టి టి డి నిధులు ఇష్టానుసారం మళ్లించే అధికారం ప్రభుత్వాలకు లేదు..కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి..

నెల్లూరు..

నెల్లూరు నూడా మాజీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మీడియా సమావేశం.

-- తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనానికి అన్య మతస్తులకు డిక్లరేషన్ అవసరం లేదని టి టీ డి చైర్మన్ ప్రకటించడంతో ఆంతర్యం ఏమిటి?.

-- 23 న తిరుమలకు వస్తున్న ముఖ్యమంత్రి జగన్ కోసం మినహాయింపు లిస్తారా..

-- బ్రిటిష్ హయాం నుంచి వస్తున్న సంప్రదాయాన్ని మార్చే డానికి మీకు ఎవరు అధికారం ఇచ్చారు.

-- దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కన్నా ముఖ్యమంత్రి జగన్ అతీతులా !

-- అనాదిగా వస్తున్న హిందూ సంప్రదయాల్ని గౌరవించడానికి జగన్ కు కలిగిన ఇబ్బందులు ఏమిటి.

--తిరుమల తిరుపతి దేవస్థానం సంప్రదయాల్ని మార్చే హక్కు 2 సంవత్సరాలు వుండే పాలకమండళ్లకు 5 సంవత్సరాలు అధికారంలో ప్రభుత్వాలకు లేదు.

-- ఇప్పటికే రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న దేవలయాలపై దాడులతో హిందువుల మనోభావాలు దెబ్బతిని ఆందోళనలో వున్నారు.

-- కొత్తగా తిరుమల వెంకన్న నిధులను ఐదు వేల కోట్ల రూపాయలను ప్రభుత్వ సంస్థలలో బాండ్ల రూపంలో పెట్టుబడి పెడతామంటున్నారు.

-- అన్య మతస్తులు ఎవరు తిరుమల దర్శనానికి వచ్చినా హిందూ ధర్మం మీద నాకు నమ్మకం ఉంది కాబట్టే నేను వెంకటేస్వర స్వామిని దర్శించకోవడానికి వచ్చాను అని ఎంతటి వారైనా.. చివరకు అమెరికా అధ్యక్షుడు వచ్చినా డిక్లరేషన్ ఇచ్చి తీరాల్సిందే.

-- వెంటనే టి టి డి చైర్మైన్ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకొని తిరుమల సనాతన సంప్రదాయాలను కాపాడాలి డిమాండ్ చేస్తున్నాము.

-- ఇక ఏ పార్టీ అయినా ఏ చైర్మన్ అయినా భవిష్యత్తులో ఇలాంటి అనైతిక నిర్ణయాలకు పాల్పడితే రాజకీయంగా కనుమరుగై పోతారని హెచ్చెరిస్తున్నాము

2020-09-22 09:53 GMT

Chittoor updates: పెద్దతిప్పసముద్రం మండలం లో విషాదం..

చిత్తూరు..

- కరోనా కు గురై క్వారంటైన్ కు తరలిస్తుంటే మార్గమధ్యంలో భయంతో మృతి చెందిన భర్త అబ్దుల్ రెహ్మాన్

- భర్త మృతిని జీర్ణించుకోలేక భార్య గుండెపోటు తో మృతి.

- సైదానీ(69), అబ్దుల్ రెహ్మాన్(74) భార్య భర్తలు ఇద్దరికీ కరోనా పాజిటివ్

- పాజిటివ్ కు గురైన వారిని మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే ఇద్దరూ మృతి

2020-09-22 09:30 GMT

Andhra Pradesh High Court: చీరాల దళిత యువకుడి కేసులో ఏపీ సర్కార్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు..

అమరావతి (హైకోర్టు)..

-చీరాల దళిత యువకుడు కిరణ్‌కుమార్ మృతి కేసులో ఏపీ ప్రభుత్వం, పోలీసుల తీరుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

-విచారణ సందర్భంగా ఈ కేస్‌ను సీబీఐకి ఎందుకు ఇవ్వకూడదు అని న్యాయస్థానం ప్రశ్నించింది.

-విచారణ పట్ల కిరణ్ కుమార్ తల్లిదండ్రులు సంతృప్తి చెందారని కేస్ కొట్టేయాలని ప్రభుత్వం తరపు న్యాయవాది విజ్ఞప్తి చేశారు.

-తమ  ప్రభుత్వంలో ఎవరినైనా మీరు సంతృప్తి పరచగలరంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది.

-కిరణ్ కుమార్‌తో పాటు ఉన్న సహ నిందితుడి ఫోన్ కాల్ రికార్డ్ ఇస్తామని న్యాయవాది శ్రవణ్ తెలుపగా.. అవసరం లేదని హైకోర్టు పేర్కొంది.

-ఈ కేసులో స్వాతంత్ర సంస్థ  సీబీఐతో ఎంక్విరీ చేయించే అర్హత కలిగి ఉందని కోర్టు స్పష్టం చేశారు.

-ప్రభుత్వం తరపు పూర్తి వివరాలు అందించేందుకు రెండు వారాలు సమయం కోరింది.

-దీంతో హైకోర్టు తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.

-కిరణ్ కుమార్ తరపున మాజీ ఎంపీ హర్షకుమార్ పిటిషన్ వేశారు.

-బాధితుడి తరపున హైకోర్టు న్యాయవాది జాడా శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. 

2020-09-22 09:26 GMT

CM Jagan Tour to Delhi: గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి..

కృష్ణాజిల్లా..

- తాడేపల్లి నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

- గన్నవరం నుండి ఢిల్లీ బయలుదేరిన సీఎం జగన్మోహన్ రెడ్డి.

2020-09-22 09:22 GMT

Visakha updates: డాక్టర్ శ్యామల మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న భర్త, కుటుంబ సభ్యులు..

విశాఖ ...

- అనకాపల్లి లో గత 48 రోజుల క్రితం తాళ్లపాలెం దగ్గర పోలవరం కాలవ లో పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన డాక్టర్ శ్యామల మృతిపై పలు                 అనుమానాలు వ్యక్తం చేస్తున్న భర్త, కుటుంబ సభ్యులు..

- పోలీసుల విచారణ తమ అనుమానాలకు నివృత్తి చేసేలా లేనందున ఈ కేసును CBCID కి అప్పగించాలని డిమాండ్ చేస్తూ నిరసన...

- శ్యామల కుటుంబ సభ్యులకు బీసీ సంఘాల సంఘీభావం...

- ఈ కేసులో నిజాలు బయటకు రావాలంటే సిఐఢీ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసిన కుటుంబ సభ్యులు..

2020-09-22 09:19 GMT

Visakha updates: గతంలో లాగ మావోలు ఉనికి చాటుకోనే పరిస్థతి లేదు..ఎస్పీ కృష్ణారావు..

విశాఖ..

-hmtv తో విశాఖ ఎస్పీ కృష్ణారావు..

-గిరిజనులు మావోయిస్ట్ సిద్ధాంతినికి దూరంగా ఉంటున్నారు.

-ముమ్మరంగా కూంబింగ్ ఆపరేషన్స్ చేస్తున్నాము.

-మావోయిస్ట్ వారోత్సవాలు జరగకుండా అడ్డుకట్ట వేస్తాం.

-మన్య ప్రజలకు మంచి జరగకుండా మావోలు అడ్డుకుంటున్నారు.

-ఎవరు మేలు చేస్తున్నారో గిరిజనులు గ్రహించాలి.

-గిరుజనులు అన్నం తిని, ఇన్ ఫార్మర్ అనే నేపంతో మావోలు అమాయక ప్రజలను పొట్టనపెట్టుకుంటున్నారు.

2020-09-22 08:56 GMT

Rajahmundry updates: మంత్రి గుమ్మనూరు జయరాంపై ఏసీబీకి ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు..

తూర్పుగోదావరి - రాజమండ్రి..

  • మంత్రి గుమ్మనూరు జయరాంపై రాజమండ్రి- లో ఏసీబీకి ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు..
  • ఈఎస్‌ఐ స్కామ్‌లో కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్‌ అలాగే అతడి తనయుడు ఈశ్వర్‌ ప్రమేయం ఉందని ఆరోపిస్తూ వారిపై తగు విచారణ చేయాలని కోరుతూ ఏబీసీ కి ఫిర్యాదు
  • రాజకీయకక్ష సాధింపుతో మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే కింజారపు అచ్చెన్నాయుడిపై ఉద్దేశపూర్వకంగా ఈఎస్‌ఐ స్కామ్‌లోకి లాగారని, నిజానికి, ఆంధ్రప్రదేశ్‌ లేబర్‌, ఎంప్లాయ్‌మెంట్‌, ట్రైనింగ్‌ అండ్‌ ఫ్యాక్టరీస్‌ శాఖా మంత్రి గుమ్మనూరు జయరామ్‌, ఆయన తనయుడు ఈశ్వర్‌లు ఈ కుంభకోణంలో పాత్రదారులని పేర్కొన్నారు.
  • నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి రెడ్డి మణేశ్వరరావు, తెలుగుదేశం నాయకులు, మజ్జి రాంబాబు, కడలి రామకృష్ణ, నగర తెలుగు యువత అధ్యక్షులు నక్కా దేవీవరప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు

2020-09-22 08:42 GMT

Nellore updates: సంగం(మం),పెరమన సమీపంలో ముంపునకు గురైన వరి పంటను పరిశీలించిన కేంద్ర బృందం..

నెల్లూరు..

కేంద్ర బృందం..

తడిసిన ధాన్యాన్ని పరిశీలించి.. నమూనాలను సేకరించిన కేంద్ర బృందం.-

రైతుల నుండి సమస్యలు తెలుసుకున్న కేంద్ర బృందం.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా పంట నష్టాన్ని పరిశీలిస్తున్నాం.

జరిగిన పంట నష్టం గురించి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తాం....నష్ట పోయిన ప్రతీ రైతుకు నష్ట పరిహారం అందేటట్లు చర్యలు...

2020-09-22 08:12 GMT

Anantapur updates: మడకశిర కి చెందిన ఓ యువకుడు పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్య యత్నం..

అనంతపురం :

* మడకశిర మండలం చీపులేటి గ్రామానికి చెందిన ఓ యువకుడు పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్య యత్నం..

* తన పై అక్రమ కేసులు బనాయించారని మనస్థాపం చెంది Police Station ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకుయత్నం.

* అడ్డగించి కాపాడిన పోలీసులు.

Tags:    

Similar News