Live Updates: ఈరోజు (సెప్టెంబర్-22) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-09-22 00:30 GMT
Live Updates - Page 3
2020-09-22 08:08 GMT

East Godavari updates: పిఠాపురం కోటగుమ్మం సెంటర్ లో టిడిపి కార్యకర్తల రాస్తారోకో.. హాజరైన మాజీ ఎమ్మెల్యే వర్మ..

తూ‌ర్పుగోదావరి :

-తమ హయాంలో పిఠాపురం పట్టణంలో ఏడు కోట్ల రూపాయల సిసిరోడ్డు శంకుస్థాపన చేసిన నిధులు ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేయడాన్ని నిరసిస్తూ ధర్నా..

-వెంటనే నిధులు మంజూరు చేసి పిఠాపురం ఉప్పాడ సెంటర్ నుంచి బైపాస్ రోడ్డు వరకు సిసి రోడ్డు మొదలు పెట్టాలని డిమాండ్..

2020-09-22 07:27 GMT

Tirumala updates: శ్రీకాళహస్తి ఆలయంలో శివలింగం నందీశ్వరుడు విగ్రహ ప్రతిష్ట వివాదం...

తిరుపతి..

-శ్రీకాళహస్తి ఆలయంలో శివలింగం నందీశ్వరుడు విగ్రహ ప్రతిష్ట వివాదంపై పుత్తూరు కు చెందిన ముగ్గురు సోదరులను అరెస్ట్ చేసిన తిరుపతి అర్బన్ పోలీసులు

-శ్రీకాళహస్తి ఆలయంలో నంది శివలింగం ప్రతిష్ఠిస్తే పెళ్లి జరుగుతుందన్న కొందరి సలహాతో విగ్రహాలను ప్రతిష్టించిన సోదరులు

-ఆ వివాదం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ఆలయంలో సి సి ఫుటేజ్ ఆధారంగా పుత్తూరు కు చెందిన ముగ్గురు ను అరెస్ట్ చేసి మీడియా ముందు   ప్రవేశపెట్టిన పోలీసులు..

2020-09-22 06:50 GMT

Antarvedi updates: అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామివారి నూతన రథం నిర్మాణానికి బస్తరు టేకును రావులపాలెం నుండి అంతర్వేది దేవస్థానంకు తరలించిన అధికారులు....

తూర్పుగోదావరి జిల్లా.....

-వంశపారంపర్యంగా వస్తున్న రథం వాహనకారుల చేతనే లారీ నుంచి క్రిందకు దింపించిన అధికారులు.....

-100 సంవత్సరాల నాటి బస్తరు టేకును రథం నిర్మాణానికి ఎంపిక చేసిన అధికారులు

-ముహూర్తం నిర్ణయించి రథం తయారీ పనులు మొదలు పెట్టనున్న గణపతి ఆచార్యులు.

2020-09-22 06:07 GMT

Vijayawada updates: జీఓ నం.311, పేరా నం.16లో ఉన్న ప్రకారం అన్య మతస్తులు తిరుమల దర్శనానికి వస్తే, వారు ఏ హోదాలో ఉన్నా డిక్లరేషన్ ఇవ్వాలి: బొండా ఉమామహేశ్వరరావు..

విజయవాడ..

మాజీ ఎంఎల్ఏ బొండా ఉమామహేశ్వరరావు..

-ఎక్కడా లేని దేవస్ధానమే తిరుమల దేవస్ధానం అన్నది, మూర్ఖుడు కొడాలి నాని తెలుసుకోవాలి

-గత ప్రభుత్వం అమరావతిలో రెండు లక్షల కోట్లు అవినీతి చేసిందని అనేక కమిటీలు వైసీపీ ప్రభుత్వం వేసింది

-మంత్రుల సబ్ కమిటీ ఏమి తేల్చింది

-పదహారు నెలల్లో కొండను తవ్విన సబ్ కమిటీ ఎలుకను కూడా పట్టుకోలేదు

-ఈ ప్రభుత్వానికి పదహారు నెలల అభివృద్ధిపైన శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం ఉందా

-అధికారంలోకి వచ్చాక కూడా వైసీపీ ప్రభుత్వం అబద్ధాలు చెపుతోంది

-రాజధాని ప్రకటిస్తే భూములు కొనకూడదని రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా

-ఇన్ సైడర్ ట్రేడింగ్ అనేది ఏ యాక్టులోనూ లేదు

-ల్యాండు, శాండు, వైను అన్నిటిలో ఈ ప్రభుత్వ అవినీతి పెరిగిపోయింది

-అమరావతిలో ఇన్ సైడర్ తో పాటుగా, విశాఖలో వన్ సైడర్ పైన కూడా సీబీఐ విచారణ వేయాలి

-మంత్రి జయరాం మీద సమగ్ర దర్యాప్తు చేసి, ఆయన్ని బర్తరఫ్ చేయాలి..

2020-09-22 06:01 GMT

Amaravati updtaes: ట్విట్టర్ లో సజ్జల రామకృష్ణా రెడ్డి కి కౌంటర్ ఇచ్చిన టిడిపి నేత, మాజీ మంత్రి అయ్యనపాత్రుడు..

అమరావతి..

-కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటే వాళ్ళ కాళ్ళ మీద పడటం వైసిపి చరిత్ర.

-యూపీఏ ప్రభుత్వం ప్రణబ్ ను రాష్ట్రపతిగా పెడితే మద్దతు ఇచ్చింది.

-ఎన్డీఏ ప్రభుత్వం కోవింద్ ను పెడితే మద్దతు ఇచ్చింది.

-చంచల్ గూడ జైల్ నుంచి బెయిల్ కోసం సోనియా చుట్టూ తిరిగారు. మళ్ళీ లోపలికి పంపకుండా ఎన్డీయే చుట్టూ తిరుగుతున్నారు.

-టిడిపి ఆ రోజు ప్రణబ్ కు గాని సంగ్మా కు గాని మద్దతు ఇవ్వలేదు. తటస్తం గా ఉంది.

-రాష్ట్ర ప్రయోజనాల విషయం లో తేడా వస్తే కేంద్రంలో అధికారం వద్దనుకొని బయటకు వచ్చింది.

-వైసీపీకి కేసులు ముఖ్యం. టిడిపికి రాష్ట్రం ముఖ్యం.

2020-09-22 05:58 GMT

Vijayawada updates: బిజెపి రాష్ట్ర పదాధికారుల, జిల్లాల అధ్యక్షులు సమావేశం..

విజయవాడ..

సోము వీర్రాజు రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలి భేటీ

రాష్ట్రం లో బిజెపి బలోపేతం, భవిష్యత్తు కార్యాచరణ పై దిశానిర్దేశం చేయనున్న సోము వీర్రాజు

పాల్గొన్న ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి లు, కార్యదర్శి లు, అధికార ప్రతినిధులు

2020-09-22 05:46 GMT

Kadapa updates: గండికొట జలాశయానికి కొనసాగుతున్న వరద నీటి ప్రవాహాం...

కడప :

-జిఎన్ఎస్ఎస్ వరద కాలువ ద్వారా 6200 క్యూసెక్కులు, పరివాహాక ప్రాంతంలొంచి వస్తున్న నీరు మరొ 5200 క్యూసెక్కులు వచ్చి చేరుతున్న ప్రవాహాం...

-మైలవరం ప్రాజెక్టుకు 8 వేల క్యూసెక్కులు, జిఎస్ఎస్ఎస్ కాలువకు 400, గండికొట లిప్ట్ 990క్యూసెక్కులు విడుదల...

-గండికొటలొ 13.980టిఎంసీలకు చేరిన నీటి నిల్వ...

-తాళ్లపొద్దుటూరు గ్రామంలొ మరింతగా పెరిగిన వరద నీరు...

-నీటిలొనే కొనసాగుతున్న నిర్వాసితుల ఆందోళన

2020-09-22 04:44 GMT

National updates: 2014లో ఆమోదించిన విభజన చట్టం ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ నగరాన్ని 10 ఏళ్ల పాటు కొనసాగేలా అవకాశం కల్పించింది: కనకమేడల రవీంద్ర కుమార్..

జాతీయం..

-రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్..

-2014లో ఆమోదించిన విభజన చట్టం ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ నగరాన్ని 10 ఏళ్ల పాటు కొనసాగేలా అవకాశం కల్పించింది

-ఈలోపు ఏపీకి రాజధాని నగరాన్ని ఏర్పాటు చేయాలని పేర్కొంది

-విభజన చట్టం ప్రకారమే తగిన ప్రదేశాన్ని చూసి ల్యాండ్ పూలింగ్ చేయడం జరిగింది

-కేంద్రం రూ. 2,500 కోట్లు ఈ రాజధాని కోసం ఇచ్చింది

-ప్రధాని మోదీ స్వయంగా భూమిపూజలో పాల్గొన్నారు

-స్మార్ట్ సిటీ మిషన్ కింద ఈ నగరాన్ని కేంద్రం ఎంపిక చేసింది

-కొత్త ప్రభుత్వం ఎలాంటి సహేతుక కారణాలు లేకుండా అమరావతి రాజధాని ప్రాజెక్టును నిర్వీర్యం చేసింది

-13 జిల్లాలున్న రాష్ట్రంలో 3 రాజధానులు అంటోంది

-యూపీ, రాజస్థాన్ వంటి పెద్ద రాష్ట్రాల్లో ఒక రాజధాని మాత్రమే ఉంది

-ఈ విధానాన్ని అంగీకరిస్తే పండోరా బాక్స్ తెరిచినట్టే అవుతుంది

-అందుకే కేంద్రం జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకోవాలని కోరుతున్నాను

2020-09-22 04:23 GMT

Amaravati updates: 2019లో కాకిలెక్కలు వేసి తానొక జాతీయ నాయకుడిగా, దేశ రక్షకుడిగా అవతారం ఎత్తారు..

అమరావతి...

సజ్జల రామకృష్ణ రెడ్డి....ప్రభుత్వ సలహాదారు..

-బోర్లాపడ్డాక తన ఎంపీలందర్నీ బీజేపీలోకి పంపి, ఢిల్లీ కరుణకోసం మళ్లీ చొక్కామార్చి తానొక కాషాయవాది అన్నట్టు కనికట్టు చేస్తున్నారు.

-మళ్లీ ఈ చొక్కాను ఏ క్షణానైనా చంద్రబాబు మార్చేయగలరు.

-2004లో ఎన్డీయే ఓడిపోయినప్పడు భవిష్యత్తులో ఎన్నడూ బీజేపీతో కలవనంటూ ఆ చొక్కావదిలేసి మళ్లీ సెక్యులర్‌ చొక్కా వేసుకున్నారు.

-2014లో మోదీ గాలి ఉందనేసరికి మళ్లీ చొక్కా మార్చారు.

-చంద్రబాబు గతాన్ని ఒక్కసారి చూడండి. యునైటెడ్‌ ఫ్రంట్‌ ఉండగా సెక్యులర్‌ చొక్కా వేసుకున్నారు.

-పరాజయం తప్పదని తెలిసి స్టీరింగ్‌ కమిటీ ఛైర్మన్‌గా ఉండికూడా వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీయేవైపు పరుగెత్తారు.

-వెంటనే చొక్కా మార్చేసి కాషాయవాదిగా అవతారం ఎత్తారు.

2020-09-22 04:06 GMT

Kadapa District updates: కడప స్టీల్ ఫ్లాంట్ కు రూ.50 కోట్లు విడుదల..

కడప :

-కడప స్టీల్ ఫ్లాంట్ కు రూ.50 కోట్లు విడుదల.. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ..

-ఈ గ్రాంటును ఉక్కు కర్మాగారంలో భాగస్వామి ఎంపిక, కన్సల్టెంట్లు, ఇతర వ్యయాల కోసం వినియోగించాలన్న రాషఫ్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి     కరికాల వలవన్..

-స్టీల్ ఫ్లాంట్ ప్రాజెక్టు కోసం బడ్జెట్ లో రూ.250 కోట్లు కేటాయించగా.. ఇప్పటికే రూ.72.36 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం..

Tags:    

Similar News