National updates: 2014లో ఆమోదించిన విభజన చట్టం ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ నగరాన్ని 10 ఏళ్ల పాటు కొనసాగేలా అవకాశం కల్పించింది: కనకమేడల రవీంద్ర కుమార్..
జాతీయం..
-రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్..
-2014లో ఆమోదించిన విభజన చట్టం ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ నగరాన్ని 10 ఏళ్ల పాటు కొనసాగేలా అవకాశం కల్పించింది
-ఈలోపు ఏపీకి రాజధాని నగరాన్ని ఏర్పాటు చేయాలని పేర్కొంది
-విభజన చట్టం ప్రకారమే తగిన ప్రదేశాన్ని చూసి ల్యాండ్ పూలింగ్ చేయడం జరిగింది
-కేంద్రం రూ. 2,500 కోట్లు ఈ రాజధాని కోసం ఇచ్చింది
-ప్రధాని మోదీ స్వయంగా భూమిపూజలో పాల్గొన్నారు
-స్మార్ట్ సిటీ మిషన్ కింద ఈ నగరాన్ని కేంద్రం ఎంపిక చేసింది
-కొత్త ప్రభుత్వం ఎలాంటి సహేతుక కారణాలు లేకుండా అమరావతి రాజధాని ప్రాజెక్టును నిర్వీర్యం చేసింది
-13 జిల్లాలున్న రాష్ట్రంలో 3 రాజధానులు అంటోంది
-యూపీ, రాజస్థాన్ వంటి పెద్ద రాష్ట్రాల్లో ఒక రాజధాని మాత్రమే ఉంది
-ఈ విధానాన్ని అంగీకరిస్తే పండోరా బాక్స్ తెరిచినట్టే అవుతుంది
-అందుకే కేంద్రం జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకోవాలని కోరుతున్నాను