Nellore updates: టి టి డి నిధులు ఇష్టానుసారం మళ్లించే అధికారం ప్రభుత్వాలకు లేదు..కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి..
నెల్లూరు..
నెల్లూరు నూడా మాజీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మీడియా సమావేశం.
-- తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనానికి అన్య మతస్తులకు డిక్లరేషన్ అవసరం లేదని టి టీ డి చైర్మన్ ప్రకటించడంతో ఆంతర్యం ఏమిటి?.
-- 23 న తిరుమలకు వస్తున్న ముఖ్యమంత్రి జగన్ కోసం మినహాయింపు లిస్తారా..
-- బ్రిటిష్ హయాం నుంచి వస్తున్న సంప్రదాయాన్ని మార్చే డానికి మీకు ఎవరు అధికారం ఇచ్చారు.
-- దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కన్నా ముఖ్యమంత్రి జగన్ అతీతులా !
-- అనాదిగా వస్తున్న హిందూ సంప్రదయాల్ని గౌరవించడానికి జగన్ కు కలిగిన ఇబ్బందులు ఏమిటి.
--తిరుమల తిరుపతి దేవస్థానం సంప్రదయాల్ని మార్చే హక్కు 2 సంవత్సరాలు వుండే పాలకమండళ్లకు 5 సంవత్సరాలు అధికారంలో ప్రభుత్వాలకు లేదు.
-- ఇప్పటికే రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న దేవలయాలపై దాడులతో హిందువుల మనోభావాలు దెబ్బతిని ఆందోళనలో వున్నారు.
-- కొత్తగా తిరుమల వెంకన్న నిధులను ఐదు వేల కోట్ల రూపాయలను ప్రభుత్వ సంస్థలలో బాండ్ల రూపంలో పెట్టుబడి పెడతామంటున్నారు.
-- అన్య మతస్తులు ఎవరు తిరుమల దర్శనానికి వచ్చినా హిందూ ధర్మం మీద నాకు నమ్మకం ఉంది కాబట్టే నేను వెంకటేస్వర స్వామిని దర్శించకోవడానికి వచ్చాను అని ఎంతటి వారైనా.. చివరకు అమెరికా అధ్యక్షుడు వచ్చినా డిక్లరేషన్ ఇచ్చి తీరాల్సిందే.
-- వెంటనే టి టి డి చైర్మైన్ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకొని తిరుమల సనాతన సంప్రదాయాలను కాపాడాలి డిమాండ్ చేస్తున్నాము.
-- ఇక ఏ పార్టీ అయినా ఏ చైర్మన్ అయినా భవిష్యత్తులో ఇలాంటి అనైతిక నిర్ణయాలకు పాల్పడితే రాజకీయంగా కనుమరుగై పోతారని హెచ్చెరిస్తున్నాము