Live Updates:ఈరోజు (ఆగస్ట్-22) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-08-22 01:36 GMT
Live Updates - Page 4
2020-08-22 04:33 GMT

తూర్పుగోదావరి :

- ధవళేశ్వరం బ్యారేజీ నుంచి వస్తున్న వరద నీటితో కోనసీమ లో ఉధృతంగా ప్రవహిస్తున్న గౌతమి, వృద్ధ గౌతమి, వశిష్ట, వైనతేయ గోదావరి ఉప నదులు..

- కోనసీమ వ్యాప్తంగా జలదిగ్బంధంలో చిక్కుకున్న సుమారు 30 లంక గ్రామాలు..

- వారం రోజులుగా అంధకారంలో మగ్గుతున్న లంక గ్రామాలు.

- తినడానికి తిండి, త్రాగడానికి నీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న లంక గ్రామాల ప్రజలు..

- పునరావాస కేంద్రం లో తప్ప లంక గ్రామాలకు అందని వరద సహాయం..

- నిత్యావసర వస్తువుల కోసం ప్రమాదకర పరిస్థితి లో నాటు పడవలపై ప్రయాణం సాగిస్తున్న లంక గ్రామాల ప్రజలు..

- పూర్తిగా నీట మునిగిన ఎదురుబిడియం, అప్పన్నపల్లి, కనకాయలంక కాజ్ వే లు.

- జలదిగ్బంధంలో అయినవిల్లి మం. వీరవల్లిపాలెం,

- అద్దంకివారి లంక, అయినవిల్లి లంక,.

- పి.గన్నవరం మం. గంటి పెదపూడి, బూరుగులంక, అరిగెలవారి పేట, ఊడిముడిలంక, లంకలగన్నవరం, నడిగాడి, శివాయలంక, కాట్రగడ్డ, నాగుల్లంక, కనకాయలంక

- మామిడికుదురు మం. అప్పనపల్లి, బి.దొడ్డవరం, పెదపట్నంలంక, పెదపట్నం,

- మానేపల్లి, పాశర్లపూడి బాడవ..

- ముమ్మిడివరం మం. అయినాపురం బాడవ, కర్రవానిరేవు, చింతవానిరేవు, లంక ఆఫ్ ఠాణేలంక, కూనాలంక, గురజాపులంక, కమిని, వలసలతిప్ప, సలాదివారిపాలెం, పొట్టి తిప్ప, గేదెల్లంక..

- ఐ.పొలవరం మం. పశువుల్లంక, కొమరగిరి, గోగుల్లంక..

- కె.గంగవరం మం. శేరిలంక, కోటిపల్లి మత్సకారుల కాలనీ.

- అల్లవరం మం. బోడసకుర్రు, పల్లిపాలెం, గోపాలలంక.

- సఖినేటిపల్లి మం. సఖినేటిపల్లి, పల్లిపాలెం, అప్పనరాముని లంక..

- రాజోలు మం. రాజోలు ,పల్లిపాలెం, సోంపల్లి..

- కొత్తపేట మం. నారాయణ లంక.. ఆలమూరు మం. బడుగువాని లంక,.

- రావులపాలెం మం. తోకాలంక.. ఆత్రేయపురం మం. పిచ్చుక లంక..

2020-08-22 04:31 GMT

తిరుమల

- తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జె.కె.మహేశ్వరి

2020-08-22 04:30 GMT

AP Government: వైఎస్సార్ చేయూత అమలుకు కమిటీలు ఏర్పాటు చేసిన సర్కార్

అమరావతి

- వైఎస్సార్ చేయూత అమలుకు కమిటీలు ఏర్పాటు చేసిన సర్కార్

- వైఎస్సార్ చేయూత లబ్దిదారులకు జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వం ప్రణాళిక

- రాష్ట్ర స్థాయి కమిటీతో పాటు జిల్లా, మునిసిపాలిటీ, మండల స్థాయి కమిటీలు ఏర్పాటు

- ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కార్

- పంచాయతీ రాజ్ శాఖ మంత్రి చైర్మన్ గా మరో 13 మంది సభ్యులతో రాష్ట్ర స్థాయి కమిటీ

- కమిటీలో ఏడుగురు మంత్రులు, ఆయా శాఖల కార్యదర్శులకు చోటి

- కలెక్టర్ చైర్ పర్సన్ గా 10 మంది సభ్యులతో జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటు

- మునిస్పల్ కమిషనర్ ఛైర్పర్సన్ గా మరో ఇద్దరు సభులతో మున్సిపాలిటీ స్థాయి కమిటీ ఏర్పాటు

- ఎంపీడీఓ అధ్యక్షతన మరో నలుగురు సభ్యులతో మండల స్థాయి కమిటీ

- ప్రతి కమిటీలో ప్రభుత్వం ఏంఓయు చేసుకున్న కంపెనీ ప్రతినిధులకు చోటు

- వారానికి ఒక సారి సమావేశం అవ్వాలని కమిటీలకు ఆదేశం

- 15 రోజులకు ఒకసారి భేటీ కానున్న రాష్ట్ర స్థాయి కమిటీ

- సెప్టెంబర్ 21 లోగా లబ్దిదారులకు ఆర్థిక సహకారం అందించాలని ఆదేశించిన సర్కార్

- వివిధ డిపార్ట్మెంట్ లను నోడల్ ఏజెన్సీ లుగా పేర్కొన్న ప్రభుత్వం

2020-08-22 04:29 GMT

చిత్తూరు

- చిత్తూరు కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం

- వినాయక చవితి సందర్భంగా కాణిపాకం సర్వాంగ సుందరంగా వరసిద్దుడి ఆలయం

- స్వామివారి మూల విరాట్ కు వివిధ రకాల అభిషేకాలు నిర్వహించి చందనాలంకరణ చేసి ప్రత్యక పూజల అనంతరం స్వామివారి దర్శనం ప్రారంభం

2020-08-22 04:28 GMT

Visakhapatnam: నగరంలో కానరాని వినాయకచవితి సందడి

విశాఖ

- నగరంలో కానరాని వినాయకచవితి సందడి

- ఇళ్ళకే పరిమితమైన పండుగ

- వినాయక చవితిని పురస్కరించుకుని సంపత్ వినాయక ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు

- ఉదయాన్నే భక్తులకు అనుమతి లేకుండా లక్ష్మీగణపతి హోమాన్ని చేపట్టిన నిర్వాహకులు

- సంపత్ వినాయకుడ్ని దర్శించుకుంటున్న వివిధ రంగాల ప్రముఖులు, నగరవాసులు

2020-08-22 04:27 GMT

YS Jagan: మరో సంక్షేమ పథకం కు శ్రీకారం చుట్టిన ఏపీ సర్కార్

అమరావతి:

- మరో సంక్షేమ పథకం కు శ్రీకారం చుట్టిన ఏపీ సర్కార్

- ఎన్నికల హామీలో బాగంగా డ్వాక్రా మహిళల రుణ మాఫీ కి వైఎస్సార్ ఆసరా పథకం

- వైఎస్సార్ ఆసరా పథకాన్ని ప్రవేశపెడుతూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

- ఎన్నికల సమయానికి ఉన్న బ్యాంక్ లోన్ లు పూర్తిగా తిరిగి చెల్లించనున్న జగన్ సర్కార్

- నాలుగు దఫాలుగా పథకం అమలు చేయనున్న ప్రభుత్వం

- గత సమావేశంలో వైఎస్సార్ ఆసరా పథకంకు ఆమోద ముద్ర వేసిన రాష్ట్ర మంత్రి మండలి

2020-08-22 04:26 GMT

Thungabadhra Dam: తుంగభద్ర డ్యామ్ కు తగ్గిన వరద ప్రవహం..

కర్ణాటక: 

- డ్యాం ఇన్ ఫ్లో: 38,924 క్యూసెక్కులు.

- డ్యాం ఔట్ ఫ్లో: 33156 క్యూసెక్కులు.

- డ్యామ్ లో నీటి మట్టం: 1632.63 ఆడుగులు.

- పూర్తి స్థాయి నీటి మట్టం: 1633 అడుగులు.

- డ్యామ్ లో నీటి నిల్వ: 99.432 టీఎంసీలు.

- పూర్తి సామర్థ్యం: 100.855 టీఎంసీలు.

2020-08-22 04:25 GMT

Prakasam Barrage: ఇన్ ఫ్లో ఆధారంగా ఔట్ ఫ్లో మేనేజ్మెంట్ చేస్తున్న అధికారులు

విజయవాడ:

- ప్రకాశం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో ఆధారంగా ఔట్ ఫ్లో మేనేజ్మెంట్ చేస్తున్న అధికారులు

- ప్రస్తుతం 1,25,550 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల

2020-08-22 04:24 GMT

Vijayawada: పులిచింతల వద్ద నీటి లెవెల్స్ పెరుగుతున్నాయి

విజయవాడ:

- పులిచింతల వద్ద నీటి లెవెల్స్ పెరుగుతున్నాయి

- నీటి లెవెల్ +50.90M (166.993ft)/ FRL 53.34 M (175.000 ft )

- పులిచింతల ప్రాజెక్టు కెపాసిటీ 34.2400/45.77 TMC

- 2 మీటర్ల ఎత్తుకు 6 స్పిల్ వే గేట్లను ఎత్తిన అధికారులు

- 99402 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల

- విద్యుత్ తయారీకి 15వేల క్యూసెక్కుల నీటి విడుదల

- మొత్తం ఔట్ ఫ్లో 114402 క్యూసెక్కులు

- మొత్తం ఇన్ ఫ్లో 290060 క్యూసెక్కులు

2020-08-22 04:23 GMT

Amaravati: ఈనెల 25 న జరగాల్సిన అపెక్స్ కౌన్సిల్ వాయిదా

అమరావతి:

- ఈనెల 25 న జరగాల్సిన అపెక్స్ కౌన్సిల్ వాయిదా పడటం హర్షణీయమన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.

- గోదావరి, కృష్ణా నదుల వరద నీరు వృథాగా సముద్రం పాలవుతున్నది.

- ఇరు తెలుగు రాష్ట్రాల సీఎంల జల వివాదాల వల్ల రాయలసీమకు అన్యాయం జరుగుతోంది.

- పుష్కలంగా ఉన్న నీటిని రెండు తెలుగు రాష్ట్రాలు సక్రమంగా వినియోగించుకుంటే రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి.

- ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు నీటి తగాదాలకు తావిస్తూ అపెక్స్ కౌన్సిల్ కు వెళ్లడం సరికాదు.

- తమకు భేషిజాలు లేవన్న కేసీఆర్, జగన్ లు నీటి వివాదాలు సామరస్యంగా పరిష్కరించుకోవాలి.

- పలు విషయాల్లో పరస్పరం సహకరించుకునే కెసిఆర్, జగన్ లు ప్రజా సమస్యల పట్ల కూడా చిత్తశుద్ధి చూపాలి.

👆రామకృష్ణ.

Tags:    

Similar News