Vinayaka Chavithi: కరోనా ఆంక్షల మధ్య జిల్లాలో నిరాడంబరంగా ప్రారంభమైన వినాయక చవితి ఉత్సవాలు..
తూర్పుగోదావరి :
- కరోనా ఆంక్షల మధ్య జిల్లాలో నిరాడంబరంగా ప్రారంభమైన వినాయక చవితి ఉత్సవాలు..
- బిక్కవోలు లక్ష్మీగణపతి ఆలయంలో భక్తులకు దర్శనానికి మాత్రమే అనుమతి..
- కరోనా ప్రభలుతోన్న నేపధ్యంలో అంతరాలయ దర్శనాలు నిలిపివేత..
- నవరాత్రులను పురస్కరించుకుని యధావిధిగా స్వామి వారి కైంకర్యాలు.. అభిషేకాలు నిర్వహిస్తోన్న అర్చక స్వాములు..
- ఐనవిల్లి విఘ్నేశ్వరుని ఆలయంలోనూ తెల్లవారుజాము నుంచి భక్తుల దర్శనాలకు అనుమతి..
- పరిమితి సంఖ్యలో భక్తులను అనుమతిస్తోన్న దేవాదాయశాఖ అధికారులు..
- పూర్తి జాగ్రత్తలు తీసుకున్న తరువాతే భక్తులకు దర్శనాలకు అనుమతి..
Vinayaka Chaturthi 2020: నగరంలో కళ తప్పిన వినాయకచవితి
విజయవాడ:
- నగరంలో కళ తప్పిన వినాయకచవితి
- వాణిజ్య రాజధాని లో అత్యధికంగా వ్యాపారులు ఘనంగా వినాయక చవితి నిర్వహించే వారు...
- ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలతో ఇళ్లకే పరిమితము అయ్యిన పండుగ కళ
- అలయాల్లోనూ కనిపించని పండుగ శోభ
Vinayaka Chavithi 2020: జిల్లా వ్యాప్తంగా గా దేవాలయాలు, ఇళ్ల కే పరిమితమైన వినాయక చవితి..
అనంతపురం:
- జిల్లా వ్యాప్తంగా గా దేవాలయాలు, ఇళ్ల కే పరిమితమైన వినాయక చవితి.
- ఒక్క రోజు లోనే నిమజ్జనం.
- ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగానే వినాయక చవితి ఉత్సవాలు
Ananthapur: ఎస్కేయూ పనివేళల్లో మార్పు..
అనంతపురం:
- ఎస్కేయూ పనివేళల్లో మార్పు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉద్యోగుల హాజరు. ఈ నెల 24 నుంచి అమలు: మల్లికార్జున, రిజిస్టర్, ఎస్కేయూ
- బ్యాంకు వేళల్లో మార్పు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెరవాలి: మోహన్ మురళి,లీడ్ బ్యాంకు మేనేజర్
Srisailam: శ్రీశైలం జలాశయంలో కొనసాగుతున్న భారీ వరద ఉధృతి
కర్నూలు జిల్లా:
- శ్రీశైలం జలాశయంలో కొనసాగుతున్న భారీ వరద ఉధృతి
- 10 క్రేస్ట్ గేట్లు 18 అడుగుల మేర ఎత్తి దిగువ నాగార్జున సాగర్ కి నీటిని విడుదల
- ఇన్ ఫ్లో : 4,03,201 క్యూసెక్కులు
- ఔట్ ఫ్లో : 4,60,250 క్యూసెక్కులు
- పూర్తి స్థాయి నీటి మట్టం : 885 అడుగులు
- ప్రస్తుత : 883.70 అడుగులు
- నీటి నిల్వ సామర్ధ్యం:215.807 టిఎంసీలు
- ప్రస్తుతం : 208.2841 టీఎంసీలు
- కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
- ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో నిల్
Godavari River: పరవళ్ళు తొక్కుతున్న వరద గోదావరి..
తూర్పుగోదావరి:
- పరవళ్ళు తొక్కుతున్న వరద గోదావరి..
- ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న వరద మూడో ప్రమాద హెచ్చరిక
- 18.40 అడుగులకు చేరుకున్న నీటిమట్టం
- ధవలేశ్వరం బ్యారేజ్ నుంచి సముద్రంలోకి విడుదలవుతున్న 20 లక్షల 11వేల క్యూసెక్కుల వరద ప్రవాహం
- అంతకంతకూ పెరుగుతున్న వరద..
- పోలవరం అప్పర్ కాఫర డ్యాం వద్ద 30.10 మీటర్లు నీటిమట్టం
- భద్రాచలం వద్ద 53.7 అడుగులతో కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక
- శబరిలో తగ్గని వరద ఉధృతి