Live Updates:ఈరోజు (ఆగస్ట్-22) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 22 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు శనివారం, 22 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్ల పక్షం శు.తదియ రా.2.21 వరకు, తదుపరి చవితి నక్షత్రం ఉత్తర రా.1.30 వరకు, తదుపరి హస్త, వర్జ్యం ఉ.9.41 నుంచి 11.11 వరకు, దుర్ముహూర్తం ఉ.8.16 నుంచి 9.05 వరకు తదుపరి ప.12.27 నుంచి 1.19 వరకు, అమృతఘడియలు... సా.6.42 నుంచి 7.42 వరకు. సూర్యోదయం ఉ.5-47 సూర్యాస్తమయం సా.6-19
అందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు
మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు జేజేలు!
ఈరోజు తాజా వార్తలు
విజయవాడ: ప్రకాశం బ్యారేజి వద్ద క్రమక్రమంగా పెరుగుతున్న వరద ఉధృతి
ఇన్ ఫ్లో 2 లక్షల క్యూసెక్కులు
ఔట్ ఫ్లో 1.59లక్షల క్యూసెక్కులు
తూర్పుగోదావరి: సఖినేటిపల్లి లంకలో కరోనా పాజిటీవ్ లక్షణాలతో తో ఇబ్బంది పడుతున్న ఓ రోగి
వరదలో ఆస్పత్రికి తరలించడానికి ముందుకు రాని స్థానికులు, సచివాలయ సిబ్బంది
విషయం తెలుసుకుని ట్రాక్టర్ వేసుకుని లంకలో రోగి ఇంటికి వెళ్ళిన సఖినేటిపల్లి ఎస్ఐ సిహెచ్ గోపాలకృష్ణ
వరద ముంపు ప్రాంతం నుంచి ట్రాక్టరుపై సురక్షితంగా వున్న ఏటిగట్టుకు తీసుకువచ్చిన ఎస్ఐ గోపాలకృష్ణ
అక్కడ నుంచి 108 వాహనం లో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలింపు
తూర్పుగోదావరి: సఖినేటిపల్లి లంకలో కరోనా పాజిటీవ్ లక్షణాలతో తో ఇబ్బంది పడుతున్న ఓ రోగి
వరదలో ఆస్పత్రికి తరలించడానికి ముందుకు రాని స్థానికులు, సచివాలయ సిబ్బంది
విషయం తెలుసుకుని ట్రాక్టర్ వేసుకుని లంకలో రోగి ఇంటికి వెళ్ళిన సఖినేటిపల్లి ఎస్ఐ సిహెచ్ గోపాలకృష్ణ
వరద ముంపు ప్రాంతం నుంచి ట్రాక్టరుపై సురక్షితంగా వున్న ఏటిగట్టుకు తీసుకువచ్చిన ఎస్ఐ గోపాలకృష్ణ
అక్కడ నుంచి 108 వాహనం లో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలింపు
విజయవాడ: ప్రసన్న వెంకటేష్, వీఎంసీ కమీషనర్
ఈరోజు రాత్రి సమయంలో ఎగువ నుండి ప్రకాశం బ్యారేజ్ వరద పెరిగే అవకాశం
కృష్ణానది దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
రణధీర్ నగర్, భూపేష్ గుప్తా నగర్, తారకరామనగర్, భవానీపురం, విద్యాధపురం ప్రాంతాల వారు పునరావాస కేంద్రాలకు వెళ్ళాలి
తూర్పుగోదావరి - రాజమండ్రి:
ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద మూడో ప్రమాదం దాటి నిలకడగా ప్రవహిస్తున్న వరద గోదావరి
సాయంత్రం నుంచి 18.6 అడుగుల వద్దే నిలకడగా వున్న వరద నీటిమట్టం
ప్రస్తుతం ధవలేశ్వరం బ్యారేజ్ 175 గేట్ల నుంచి 20లక్షల 40వేల క్యూసెక్కుల సముద్రంలోకి విడుదల
గుంటూరు: ఈఎస్ఐ కుంభకోణంలో ఏ2ముద్దాయి మాజీ మంత్రి అచ్చంన్నాయుడును ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలింపు
కరోనా పాజిటివ్ రావటంతో అచ్చంన్నాయుడును కోవిడ్ ఆసుపత్రికి తరలించాలని హైకోర్టు ఆదేశం
కోర్టు ఆదేశాల మేరకు అచ్చంన్నాయుడును తరలించిన పోలీసులు...
ఇప్పటి వరకు రమేష్ ఆసుపత్రిలో అచ్చంన్నాయుడు కు చికిత్స.
తాజాగా మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలింపు.
పాజిటివ్ వచ్చిన వారం తర్వాత తరలించిన పోలీసులు...
పశ్చిమ గోదావరి: ఏలూరులో ప్రైవేట్ ల్యాబ్ పై మెడికల్, రెవెన్యూ అధికారులు తనిఖీలు
ఏలూరు ప్రభావతి హాస్పిటల్ రోడ్ లో రైట్ ల్యాబ్ లో కరోనా వైరస్ ర్యాపిడ్ టెస్ట్ నిర్వహణ
ప్రభుత్వ అనుమతులు లేకుండా రాపిడ్ టెస్ట్లు నిర్వహిస్తున్న ల్యాబ్ నిర్వాహకులను విచారిస్తున్న అధికారులు
ప్రభుత్వానికి చెందిన మెడికల్ రాపిడ్ కిట్లు అక్రమంగా తరలిపోవడం పై అధికారుల విచారణ...
అమరావతి:
- టీడీపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు
- జేఏసీ ఆందోళనకు టీడీపీ మద్దతు
- రేపటి నిరసనల్లో పాల్గొని అమరావతి రైతాంగానికి సంఘీభావం తెలపాలి.
- రాజధాని మూడు ముక్కలాటను 13 జిల్లాల ప్రజలు నిరసించాలి
ప.గో:
- ఏలూరు NR పేటలోని మురళీకృష్ణ సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ సీజ్..
- కరోనా పేషెంట్ ల నుండి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదు..
- విచారణ అనంతరం హాస్పిటల్ సీజ్ చేసిన పోలీసులు..
- ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కోవిడ్ పేషెట్స్ ను మరో ఆసుపత్రికి తరలింపు...
గుంటూరు
- అచ్చంపేట మండలం గ్రంధశిరిలో మైనర్ బాలికపై యువకుడు అత్యాచార యత్నం.....
- మాయమాటలు చెప్పి బాత్రూమ్ కు తీసుకెళ్లి బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన చిలకా షడ్రక్(23)..
- సోంత బాబాయ్ బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టిన అన్న షడ్రక్....
- తల్లితండ్రులు పిర్యాదుతో యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..
- యువకునిపై ఫోక్స్,నిర్భయ కేసుల నమోదు....