Live Updates:ఈరోజు (ఆగస్ట్-21) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-08-21 01:52 GMT
Live Updates - Page 2
2020-08-21 12:07 GMT

Srisailam: ప్యానెల్స్ లో ఒక్కసారిగా మంటలు ఎగిసి పడడంతో ఈ ప్రమాదం జరిగింది.

- 900 మెగావాట్ల సామర్థ్యం కలిగిన శ్రీశైలం జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో గురువారం (ఆగస్టు 20) రాత్రి 10.30 గంటలకు అగ్ని ప్రమాదం జరిగింది.

- ప్యానెల్స్ లో ఒక్కసారిగా మంటలు ఎగిసి పడడంతో ఈ ప్రమాదం జరిగింది.

- ప్రమాదం పసిగట్టిన ఉద్యోగులు మంటలను ఆర్పడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. మంటల్లో కాలిపోకుండా ప్లాంటును కాపాడడానికి ఉద్యోగులు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రయత్నించారు.

- రాత్రి 12 గంటల వరకు ఉద్యోగులు ప్రయత్నాలు కొనసాగించినట్లు తెలుస్తున్నది. అయినప్పటికీ లాభం లేకుండా పోయింది.

- ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 17 మంది ఉద్యోగులు ప్లాంటులో ఉన్నారు. వారిలో 8 మంది బయటకు రాగలిగారు. కానీ మిగిలిన 9 మంది అక్కడే చిక్కుకుని పోయారు.

- ఈ తొమ్మిది మందిలో జెన్ కో కు చెందిన డిఇ శ్రీనివాస్ గౌడ్, ఎఇలు వెంకట్ రావు, మోహన్ కుమార్, ఉజ్మ ఫాతిమా, సుందర్, ప్లాంట్ అటెండెంట్ రాంబాబు, జూనియర్ అటెండెంట్ కిరణ్, హైదరాబాద్ అమరన్ బ్యాటరీ కంపెనీకి చెందిన వినేష్ కుమార్, మహేష్ కుమార్ ఉన్నారు.

- ఎస్కేప్ టన్నెల్ ద్వారా బయటకు రావడానికి వారు ప్రయత్నం చేసినప్పటికీ, దట్టమైన పొగల వల్ల సాధ్యం కాలేదు.

- ప్రమాదం సమాచారం తెలుసుకున్న వెంటనే విద్యుత్ శాఖ మంత్రి జి. జగదీష్ రెడ్డి, జెన్ కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు, డైరెక్టర్లు, సీనియర్ ఉద్యోగులు సంఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించారు.

- ఎన్.డి.ఆర్.ఎఫ్., సింగరేణి, తెలంగాణ స్టేట్ ఫైర్ సర్వీసెస్ వారు ప్లాంటు దగ్గరికి చేరుకుని మంటలు, పొగలో చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నం చేశారు.

- 1.2 కిలోమీటర్ల లోతులో ప్లాంటు ఉంది. అక్కడికి చేరుకోవడానికి సొరంగ మార్గం మాత్రమే ఉంది. మంటలు, పొగలు కమ్ముకోవడం వల్ల చాలాసేపటి వరకు లోపటికి పోవడం సాధ్యం కాలేదు. చాలా శ్రమించిన తర్వాత శుక్రవారం మద్యాహ్నం ప్లాంటులోకి ప్రవేశించడం సాధ్యమయింది. చిక్కుకున్న 9 మంది దురుదృష్ట వశాత్తూ మరణించారు.

- ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురు ఉద్యోగులు చికిత్స పొందుతున్నారు.

- శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో సహచర ఉద్యోగులు ప్రాణాలు కోల్పోవడం పట్ల జెన్ కో- ట్రాన్స్ కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఈ దురదృష్టకరమైన సంఘటన తనకెంతో బాధను, దుఃఖాన్ని కలిగిస్తున్నదని ఆయన చెప్పారు. తన సుదీర్ఘ అనుభవంలోనే

2020-08-21 11:31 GMT

Nagarjunasagar: నాగార్జున సాగర్..6 గేట్లు..ఎత్తివేత..

- నాగార్జున సాగర్..6 గేట్లు..ఎత్తివేత..

- ఇన్ ఫ్లో....3 లక్షల క్యూసెక్కులు...

- ఔట్ ఫ్లో...74,000 క్యూసెక్కులు...

- పూర్తి స్థాయి నీటి మట్టo 590 అడుగులు...

- ప్రస్తుతం...585 అడుగులు....

- పూర్తి సామర్థ్యం 312 tmc ల

- ప్రస్తుతం...295 tmc లు...

2020-08-21 11:30 GMT

వరంగల్ రూరల్ జిల్లా:

- వర్ధన్నపేట మండల కేంద్రం లోని కోనారెడ్డి చెరువు కట్ట తెగి వరంగల్ ఖమ్మం రహదారి 60 ఫీట్ ల మేర కొట్టుకుపోవడం తో మరమ్మత్తులు పై అధికారులతో కలిసి పరిశీలించిన జిల్లా కలెక్టర్ హరిత,యం పి పసునూరి దయాకర్,ఎమ్మెల్యే అరూరి రమేష్.

2020-08-21 11:29 GMT

వరంగల్ రూరల్ జిల్లా :

- వర్ధన్నపేట మండలం కొనారెడ్డీ చెరువు కట్టతెగి పోవడంతో పరిస్తితిని పరిశీలించిన రాష్ట్ర బిజెపి నేతలు ప్రేమెందర్ రెడ్డి, రాకేష్ రెడ్డి, బిజెపి నేతలు కొండేటి శ్రీధర్..

2020-08-21 10:52 GMT

Hyderabad: కీసర తహసిల్దార్ నాగరాజ్ కస్టడీ పిటిషన్ పై ముగిసిన వాదనలు...

ఏసీబీ అప్ డేట్స్:

- కీసర తహసిల్దార్ నాగరాజ్ కస్టడీ పిటిషన్ పై ముగిసిన వాదనలు...

- సోమవారం కస్టడీ పిటిషన్ పై తీర్పు ప్రకటించనున్న ఏసీబీ కోర్టు....

- నలుగురు నిందితులను నాలుగు రోజుల పాటు కస్టడీకి కోరిన ఏసీబీ...

- కోటి పది లక్షల రూపాయల సంబంధించి నిందితుల నుంచి లోతుగా దర్యాప్తు చేయాలని కోర్టు తెలిపిన ఏసీబీ..

- నిందితులను కస్టడీలోకి తీసుకుంటే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని కోర్టుకు తెలిపిన ఏసీబీ..

- నిందితులను కస్టడీలోకి ఇవ్వొద్దని కౌంటర్ దాఖలు చేసిన నిందితుల తరఫు న్యాయవాది...

- కస్టడీలోకి తీసుకొని విచారించాల్సిన అవసరం లేదని కోర్టుకు తెలిపిన నిందితుల తరఫు న్యాయవాది...

- ఇరు వాదనలు విన్న ఏసీబీ కోర్టు తీర్పును సోమవారం వాయిదా...

2020-08-21 10:51 GMT

Uttam Kumar Reddy: అగ్నిప్రమాదం పై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి..

- శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదం పై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి.

- 9 మంది సొరంగంలో చిక్కుకున్నారని ఇప్పటకే 7 మృతదేహాలను వెలికి తీశారని తెలిసింది ఇది చాలా ఆందోళన కలిగించే అంశం..

- మృతులలో సుందర్ నాయక్ అనే ఏ.ఈ ఉన్నారని అతను సూర్యాపేట ప్రాంత వాసి, మా నల్గొండ పార్లమెంట్ పరిధిలోనిది. సుందర్ నాయక్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి..

- మంచి భవిష్యత్ ఉన్న ఒక ఇంజనీర్ ఇలా ప్రమాదంలో మరణించడం పట్ల ఆవేదన వ్యక్తం చేసిన ఉత్తమ్

- ఇది దేశంలో పెద్ద ప్రమాదాల్లో ఒకటి, ప్రమాదానికి కారణాలపై లోతైన విచారణ జరగాలి..

- ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ప్రమాదానికి కారణాలను వెంటనే బయటపెట్టాలి.

- ఎంతో మంచి భవిష్యత్ ఉన్న వారు ఇలా ఘోర ప్రమాదంలో అసువులు బయడం చాలా బాధాకరం.

- వారి.కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలి, కుటుంబీకులకు అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి.

- ప్రమాదానికి కారణాలను వెతికి భవిష్యత్ లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలి.

- ప్రమాదంలో మరణించిన వారికి నా ప్రగాఢ సంతాపం.. వారి కుటుంబాలకు నా సానుభూతి, భగవంతడు వారికి మనో ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్న.

2020-08-21 10:50 GMT

Hyderabad: కూతురి అభ్యంతకర చిత్రాలు తీసిన కేసులో బయట పడుతున్న తండ్రి రాజేష్ కేశ్వాని అరాచకాలు...

- కూతురి అభ్యంతకర చిత్రాలు తీసిన కేసులో బయట పడుతున్న తండ్రి రాజేష్ కేశ్వాని అరాచకాలు...

- అదనపు కట్నం కోసం భార్య ను వేధించిన రాజేష్....

- రెండో వివాహం చేసుకున్న సమయంలో కట్న కానుకలు సమర్పించినా తిరిగి అదనపు కట్నం కావాలంటూ భార్యకు వేధింపులు.

- రాజేష్ కేస్వాని చేసిన అప్పులు తీర్చడానికి తమ బంగారాన్ని తాకట్టు పెట్టిన కూతురు, భార్య.అయినా అగని వేధింపులు..

- భార్య ను అదనపు కట్నం కోసం వేదింపులు,

- కూతురికి తెలియకుండా అభ్యంతకర చిత్రాలు తీసుకున్న తండ్రి....

- కొన్ని రోజుల కిందట తండ్రి ల్యాప్ టాప్ లో చిత్రాలు బయట పడటంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లి కూతుళ్ళు..

- రాజేష్ కెస్వాని ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన నాచారం పోలీసులు....

2020-08-21 10:50 GMT

Mulugu District: మెడివాగులో నిన్న ఉదయం కొట్టుకుపోయిన ఇద్దరు మత్స్యకారులు

ములుగు జిల్లా:

- మెడివాగులో నిన్న ఉదయం కొట్టుకుపోయిన ఇద్దరు మత్స్యకారులు శివాజీ - కవిరాజు....

- వీరిలో ఒకరి డెడ్ డాడీ లభ్యం..

- మరొకరి కోసం ముమ్మరంగా కొనసాగుతున్న NDRF, పోలీసులు, గజ ఈతగాళ్ల గాలింపు చర్యలు..

2020-08-21 10:48 GMT

Srisailam Incident: సిఐడి విచారణకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాలు జారీ

- శ్రీశైలం పవర్ ప్లాంటులో జరిగిన ప్రమాదంపై సిఐడి విచారణకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాలు జారీ చేశారు.

- ఈ ప్రమాదానికి గల కారణాలు వెలికి తీయాలని, ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులు బయటకు రావాలని సిఎం స్పష్టం చేశారు.

- ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సిఐడి అడిషనల్ డి.జి.పి. గోవింద్ సింగ్ ను విచారణాధికారిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.

- ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ జరిపి, ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

2020-08-21 10:20 GMT

Lorry Accident: యశ్వంతపూర్ బైపాస్ వద్ద ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన లారి..

జనగామ జిల్లా:

- యశ్వంతపూర్ బైపాస్ వద్ద ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన లారి.

- ఆర్టీసీ బస్సులో ఉన్న ప్రయాణికులకు తీవ్ర గాయాలు.

- హాస్పిటల్ కు తరలింపు.

- లారీ డ్రైవర్ పరిస్థితి విషమం.

Tags:    

Similar News