Live Updates:ఈరోజు (ఆగస్ట్-21) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 21 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు శుక్రవారం, 21 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్లపక్షం తదియ(రా. 2-22 వరకు) తదుపరి చవితి; ఉత్తర నక్షత్రం (రా. 1-31 వరకు) తదుపరి హస్త నక్షత్రం, అమృత ఘడియలు (సా. 6-44 నుంచి 8-15 వరకు) వర్జ్యం (ఉ. 9-42 నుంచి 11-12 వరకు) దుర్ముహూర్తం (ఉ. 8-17 నుంచి 9-07 వరకు తిరిగి మ. 12-28 నుంచి 1-18 వరకు) రాహుకాలం (ఉ. 10-30 నుంచి 12-00 వరకు వరకు) సూర్యోదయం ఉ.5-47 సూర్యాస్తమయం సా.6-20
ఈరోజు తాజా వార్తలు
బండిసంజయ్. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు విడుదల చేసిన ప్రకటన
గణేష్ ఉత్సవాలు నిర్వహించుకోవచ్చన్న హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు.
హైకోర్టు తీర్పును వెంటనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలి.
హైకోర్టు తీర్పును గౌరవించే అమలు చేయని అధికారులపై చర్యలు తీసుకోవాలి
ఇది హిందువుల విజయం
అయినా అడ్డంకులు సృష్టిస్తే ఖబర్దార్.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా సాకుతో గణేష్ మండపాలపై నిషేధం విధించడాన్ని తెలంగాణ హైకోర్టు తప్పుపట్టింది, హిందువులు యధావిధిగా మండపాలలో గణేష్ నవరాత్రులు జరుపుకోవచ్చని తీర్పునిచ్చింది, ఈ తీర్పు హిందువుల పై పక్షపాతానికి చెంప పెట్టు లాంటిదని అభివర్ణంచారు.
రాష్ట్ర ప్రభుత్వ హిందూ వ్యతిరేక విధానాలను తెలంగాణ హిందూ సమాజం ఎన్నటికీ మరువదు.
గత పది రోజుల నుండి పోలీసులు చేస్తున్న అరాచకాలు, భయభ్రాంతులను తెలంగాణ సమాజం గుర్తుంచుకుంటుంది.
కోర్టు అనుమతి ఇచ్చేవరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం ప్రజలు గమనిస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా హిందువులు కరోనా నిబంధనలు పాటిస్తూ, కోర్టు తీర్పు మేరకు నిరాటంకంగా మండపాలలో గణేష్ నవరాత్రులు జరుపుకుంటాం.
బ్రేకింగ్..
శ్రీశైలం విద్యుత్ కేంద్రo ప్రమాద ఘటనలో ఏఈ ఉజ్మా ఫాతిమా మృతి చెందడంతో చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని
అజాంపురా హరిలాల్ బాగ్ లో విషాదఛాయలు నెలకొన్నాయి.
చెప్పుల వ్యాపారం నిర్వహించే జబ్బార్ కు ఇద్దరు కుమార్తెల లో ఒకరైన ఫాతిమా అవివాహిత ..
చిన్నప్పటి నుంచి కష్ట పడి చదివి ఏఈ గా ఉద్యోగం సాదించింది.
ఫాతిమా అకాల మరణం పట్ల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
శ్రీశైలం జెన్కో ప్రమాదం ఫై విచారణ ప్రారంభించిన సీఐడీ ఛీఫ్ గోవింద్ సింగ్
రేపు సంఘటనా స్థలానికి వెళ్లనున్న గోవింద్ సింగ్
శ్రీశైలం జెన్కో ప్రమాదమ్ ఫై నాలుగు టీమ్ ల ఏర్పాటు
ఎలక్ట్రిసిటీ , ఫోరెన్సిక్ సైన్స్ , సీఐడీ ,లోకల్ పోలీస్ మొత్తం 4 టీమ్ ల ఏర్పాటు
ఈగల పెంట పోలీస్ స్టేషన్ లో 174 కింద కేసు నమోదు
ఈగల పెంట పోలీస్ స్టేషన్ లో నమోదు అయిన కేసు సీఐడీ కి బదిలీ
టీఎస్ హైకోర్టు: జియాగూడ లోని రంగనాథ స్వామి ఆలయంలో గణేష్ విగ్రహాన్ని పెట్టడానికి అనుమతించిన హైకోర్టు....
కులుసుమ్ పూర పోలీస్ స్టేషన్ పరిధిలో రంగనాథస్వామి ఆలయంలో లో తీసుకువచ్చిన దేవాలయ కమిటీ...
ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి విగ్రహాన్ని పెట్టడాన్ని అడ్డుకున్న పోలీసులు...
ప్రభుత్వ ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినా న్యాయవాది భాస్కర్ రెడ్డి...
గత కొన్ని సంవత్సరాలుగా రంగనాథస్వామి ఆలయంలో గణేష్ ఉత్సవాలు జరుపుతామని కోర్టుకు తెలిపిన భాస్కర్ రెడ్డి...
ఇప్పటికే విగ్రహాన్ని కూడా తీసుకువచ్చామని కోర్టుకు తెలిపిన భాస్కర్ రెడ్డి...
కరుణ నిబంధనలు పాటించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని కోర్టుకు తెలిపిన భాస్కర్ రెడ్డి...
ఒక్క విగ్రహానికి అనుమతిస్తే నగరంలో ఉన్న కొన్ని వేల మంది అనుమతులు కోరుతారని కోర్టు తెలిపిన ప్రభుత్వం..
6 ఫీట్ల విగ్రహాన్ని తెచ్చి నిబంధనలు ఉల్లంఘించారని కోర్టుకు తెలిపిన ప్రభుత్వం...
దేవాలయంలో ప్రతిష్టిస్తున్న విగ్రహానికి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయన్న హైకోర్టు...
ఆర్టికల్ 25 ప్రకారం వ్యక్తి స్వేచ్ఛను హరించలేమన్న హైకోర్టు...
గణేష్ విగ్రహాన్ని పెట్టడానికి కి నిబంధనలతో కూడిన అనుమతించిన హైకోర్టు..
ప్రజా సంక్షేమం శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకం కలిగించమని దేవాలయ కమిటీ సంబంధిత అధికారులకు హామీపత్రం ఇవ్వాలన్న హైకోర్టు...
దేవాలయంలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి పూర్తి నివేదిక కోర్టుకు సమర్పించాలని దేవాలయ కమిటీ కి హైకోర్టు ఆదేశం..
మినిస్ట్రీ ఆఫ్ హోం ఎఫైర్స్ సూచించిన నిబంధనలు పాటిస్తామని హామీ పత్రం ఇవ్వాలని హైకోర్టు..
మూడు రోజుల తర్వాత పరిస్థితిని సమీక్షించి మళ్ళీ విచారిస్తామని హైకోర్టు...
హైకోర్టు ఆదేశాల మేరకు అన్ని నిబంధనలు పాటిస్తామన్న పిటిషనర్ భాస్కర్ రెడ్డి.
తదుపరి విచారణ వచ్చే బుధవారానికి వాయిదా వేసిన హైకోర్టు.
వరంగల్ రూరల్ జిల్లా: దామెర మండలం దమ్మన్నపేట , పులుకుర్తి గ్రామాల్లో గత పది రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్న పంటలను, తీవ్ర వర్షాలతో ఇండ్లు కోల్పోయిన వారిని పరామర్శించిన బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి , రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డి , రూరల్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్. నాయకులు పాల్గొన్నారు
నల్గొండ:
నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కు పెరుగుతున్న ఇన్ ఫ్లో..10 క్రస్ట్ గేట్లు ఎత్తి కిందికి నీటిని విడుదల చేస్తున్న అధికారులు...
- శ్రీశైలం దుర్ఘటనలో మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం.
- ఘటన పై సీబీఐతో విచారణ
- ఎంపీ రేవంత్ రెడ్డి డిమాండ్.
- శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో జరిగిన దుర్ఘటనలో మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను.
- వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి.
- మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.
- మృతుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి.
- ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సాయం అందించాలి.
- ఈ ఘటన పై అనేక అనుమానాలు ఉన్నాయి.
- జగన్ జలదోపిడీకి కేసీఆర్ సహకరిస్తూ... శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ విద్యుత్ ప్రాజెక్టును చంపేసే కుట్ర చేస్తున్నాడని చాలా కాలంగా మేం చెబుతున్నాం.
- దుర్ఘటన జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది.
- రాష్ట్ర పరిధిలోని విచారణ సంస్థలతో కాక... కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాను.
నాగర్ కర్నూల్:
- జూలకంటి రంగారెడ్డి కామెంట్స్, సీపిఎం నాయకుడు..
- శ్రీ శైలం ఎడమగట్టు జల విద్యుత్ ప్రమాదం ముమ్మాటికీ మానవ తప్పిదమే..
- ఆసియా ఖండంలోనే పెద్దదైన ఈ ప్రాజెక్టుకు నిర్వాహన లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.
- దుర్ఘటనపై సీబీఐ విచారణ చేపట్టాలి.
- మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం అందించాలి.
నాగర్ కర్నూల్ జిల్లా:
- శ్రీశైలం జల విద్యుత్ ఘటనలో మృతులకు కోటి రూపాయల పరిహారం అందించాలి..
- భవిష్యత్తులో ఇలాంటు ఘటలకు తావులేకుండా చర్యలు చేపట్టాలి.
- క్షత గాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి.
- మృతుల కుటుంబాలకు కాంగ్రేస్ పార్టీ తరపున ప్రగాఢ సానుభూతి..
- కాంగ్రెస్ పార్టీ జిల్లా అద్యక్షుడు డాః వంశీకృష్ణ.
నాగర్ కర్నూల్:
- ఇప్పటి వరకు 9 మృతదేహాలు స్వాధీనం...
- గుర్తించిన మృతదేహాలు
- డీఈ శ్రీనివాస్ గౌడ్..
- నలుగురు ఏఈ లు సుందర్ నాయక్, మోహన్, ఫాతిమా, వెంకట్ రావు.
- వినేష్ కుమార్, మహేశ్ కుమార్ అమ్రాన్ కంపెనీ బ్యాటరీ టెక్నిషన్స్..
- కిరణ్, రాంబాబు, జూనియర్ ప్లాంట్ ఆపరేటర్స్..
- మృతదేహాలను మార్చరీకి తరలింపు.
- తమ వారి మృతదేహాలను చూసి బోరున విలపించిన కృటుంబ సభ్యులు.
- పోస్టు మార్టం తర్వాత మృతదేహాలను బందువులకు అప్పగించేందుకు చర్యలు చేపట్టిన అదికారులు.