Srisailam: ప్యానెల్స్ లో ఒక్కసారిగా మంటలు ఎగిసి పడడంతో ఈ ప్రమాదం జరిగింది.
- 900 మెగావాట్ల సామర్థ్యం కలిగిన శ్రీశైలం జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో గురువారం (ఆగస్టు 20) రాత్రి 10.30 గంటలకు అగ్ని ప్రమాదం జరిగింది.
- ప్యానెల్స్ లో ఒక్కసారిగా మంటలు ఎగిసి పడడంతో ఈ ప్రమాదం జరిగింది.
- ప్రమాదం పసిగట్టిన ఉద్యోగులు మంటలను ఆర్పడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. మంటల్లో కాలిపోకుండా ప్లాంటును కాపాడడానికి ఉద్యోగులు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రయత్నించారు.
- రాత్రి 12 గంటల వరకు ఉద్యోగులు ప్రయత్నాలు కొనసాగించినట్లు తెలుస్తున్నది. అయినప్పటికీ లాభం లేకుండా పోయింది.
- ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 17 మంది ఉద్యోగులు ప్లాంటులో ఉన్నారు. వారిలో 8 మంది బయటకు రాగలిగారు. కానీ మిగిలిన 9 మంది అక్కడే చిక్కుకుని పోయారు.
- ఈ తొమ్మిది మందిలో జెన్ కో కు చెందిన డిఇ శ్రీనివాస్ గౌడ్, ఎఇలు వెంకట్ రావు, మోహన్ కుమార్, ఉజ్మ ఫాతిమా, సుందర్, ప్లాంట్ అటెండెంట్ రాంబాబు, జూనియర్ అటెండెంట్ కిరణ్, హైదరాబాద్ అమరన్ బ్యాటరీ కంపెనీకి చెందిన వినేష్ కుమార్, మహేష్ కుమార్ ఉన్నారు.
- ఎస్కేప్ టన్నెల్ ద్వారా బయటకు రావడానికి వారు ప్రయత్నం చేసినప్పటికీ, దట్టమైన పొగల వల్ల సాధ్యం కాలేదు.
- ప్రమాదం సమాచారం తెలుసుకున్న వెంటనే విద్యుత్ శాఖ మంత్రి జి. జగదీష్ రెడ్డి, జెన్ కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు, డైరెక్టర్లు, సీనియర్ ఉద్యోగులు సంఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించారు.
- ఎన్.డి.ఆర్.ఎఫ్., సింగరేణి, తెలంగాణ స్టేట్ ఫైర్ సర్వీసెస్ వారు ప్లాంటు దగ్గరికి చేరుకుని మంటలు, పొగలో చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నం చేశారు.
- 1.2 కిలోమీటర్ల లోతులో ప్లాంటు ఉంది. అక్కడికి చేరుకోవడానికి సొరంగ మార్గం మాత్రమే ఉంది. మంటలు, పొగలు కమ్ముకోవడం వల్ల చాలాసేపటి వరకు లోపటికి పోవడం సాధ్యం కాలేదు. చాలా శ్రమించిన తర్వాత శుక్రవారం మద్యాహ్నం ప్లాంటులోకి ప్రవేశించడం సాధ్యమయింది. చిక్కుకున్న 9 మంది దురుదృష్ట వశాత్తూ మరణించారు.
- ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురు ఉద్యోగులు చికిత్స పొందుతున్నారు.
- శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో సహచర ఉద్యోగులు ప్రాణాలు కోల్పోవడం పట్ల జెన్ కో- ట్రాన్స్ కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఈ దురదృష్టకరమైన సంఘటన తనకెంతో బాధను, దుఃఖాన్ని కలిగిస్తున్నదని ఆయన చెప్పారు. తన సుదీర్ఘ అనుభవంలోనే